వైసీపీ వార‌సుడు… భ‌లేభ‌లే!

ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత ఆ పార్టీ నాయకులు సొంత వ్యాపారాల‌పై నిమ‌గ్న‌మ‌య్యారు. కూట‌మి అప‌రిమిత‌మైన అధికారాన్ని ద‌క్కించుకోవ‌డంతో వైసీపీ నాయ‌కులకు రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై దిక్కుతోచ‌లేదు. కాలం గ‌డిచేకొద్ది కూట‌మి పాల‌న వైసీపీ…

ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత ఆ పార్టీ నాయకులు సొంత వ్యాపారాల‌పై నిమ‌గ్న‌మ‌య్యారు. కూట‌మి అప‌రిమిత‌మైన అధికారాన్ని ద‌క్కించుకోవ‌డంతో వైసీపీ నాయ‌కులకు రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై దిక్కుతోచ‌లేదు. కాలం గ‌డిచేకొద్ది కూట‌మి పాల‌న వైసీపీ నేత‌ల్లో అధికారంపై మ‌ళ్లీ న‌మ్మ‌కం తీసుకొస్తోంది. ఈ ద‌ఫా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కొంద‌రు వార‌సుల‌కు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. ఎన్నిక‌ల అనంత‌రం వాళ్లెవ‌రూ మీడియాకు క‌నిపించ‌డం లేదు.

అయితే అనూహ్యంగా ఒక వారసుడు మాత్రం దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. వైఎస్ జ‌గ‌న్ మేన‌మామ పి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి త‌న‌యుడు న‌రేన్ రామాంజుల‌రెడ్డి దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుండ‌డం వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. మాజీ ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014, 2019ల‌లో వ‌రుస‌గా రెండుసార్లు గెలిచారు. మూడోసారి ఆయ‌న ఓడిపోయారు. 2024లో ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి త‌న‌యుడు న‌రేన్ రామాంజుల‌రెడ్డి క‌మ‌లాపురం టికెట్ ఆశించారు.

అయితే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి త‌న కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించ‌డానికి అంగీక‌రించ‌లేదు. తానే బ‌రిలో ఉంటాన‌ని, అదే ప‌ని చేశారు. క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని సీకేదిన్నె నుంచి జెడ్పీటీసీ స‌భ్యుడిగా నరేన్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల క‌మ‌లాపురం వైసీపీ ఇన్‌చార్జ్‌గా న‌రేన్‌ను జ‌గ‌న్ నియ‌మించారు. త‌న మేన‌మామ‌ను వైఎస్సార్ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడిని చేశారు.

ఈ నేప‌థ్యంలో న‌రేన్ రాజ‌కీయంగా నిత్యం యాక్టీవ్‌గా వుంటున్నారు. మీడియా ముందుకొచ్చి ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ప్ర‌తి స‌మ‌స్య‌పై ఆ యువ నాయ‌కుడు స్పందిస్తున్నారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చి నాలుగు నెల‌లే అయిన‌ప్ప‌టికీ, ఇసుక‌, మ‌ద్యంతో పాటు సూప‌ర్‌సిక్స్ ప‌థ‌కాల అమ‌ల్లోనూ అట్ట‌ర్ ప్లాప్ అయ్యిందంటూ న‌రేన్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

న‌రేన్ తీరు చూస్తుంటే, తండ్రి ర‌విరెడ్డి కంటే బెట‌ర్ అనే అభిప్రాయాన్ని క‌లిగిస్తున్నారు. త‌న తండ్రిలా జ‌నానికి ఏమీ చేయ‌కుండా, దూరంగా వుండ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌ల్ని న‌రేన్ తీసుకోవాలి. ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి అధికారంలో ఉన్న‌ప్పుడు సొంతింటిని చ‌క్క‌దిద్దుకోడానికే త‌ప్ప‌, ప్ర‌జ‌ల‌కు ఏదైనా చేయాలనే ఆలోచ‌న లేకుండా పోయింద‌నే విమర్శ‌లున్నాయి. ముఖ్యంగా వైసీపీ శ్రేణుల‌కు ఒక్క‌టంటే ఒక్క ప‌ని కూడా రవీంద్ర‌నాథ్‌రెడ్డి చేయ‌లేద‌నే విమ‌ర్శ‌ని కొట్టి పారేయ‌లేం.

త‌న తండ్రి రాజ‌కీయ పంథాలో లోపాల్ని గుర్తించి, వాటిని పున‌రావృతం చేయ‌కుండా, పార్టీ కోసం ప‌ది రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టే గుణాన్ని అల‌వ‌రుచుకుంటే న‌రేన్ మంచి నాయ‌కుడిగా ఎదిగే ల‌క్ష‌ణం పుష్క‌లంగా వుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు నాయ‌కుడు న‌డుచుకునే తీరే, ప్ర‌జ‌ల్లో మంచి అభిప్రాయం ఏర్ప‌డ‌డానికి బీజం ప‌డుతుంది. ప్ర‌స్తుతం న‌రేన్‌పై సానుకూల‌త ఏర్ప‌డేందుకు అనువైన రాజ‌కీయ వాతావ‌ర‌ణం నెల‌కుందని చెప్పొచ్చు.

38 Replies to “వైసీపీ వార‌సుడు… భ‌లేభ‌లే!”

  1. ఇతను ఎంత ఘనుడో నువ్వే రాసావ్ కదా సామీ…. ప్రజా సేవ చేసేద్దాం అనే కసి తో అబ్బ తో కొట్లాడాడు అని …ఏంటో మన అన్న ఫామిలీ లో అందరు కి ప్రజా సేవ మీద అమితమైన ఇష్టం ఒకాయన ప్రజాసేవ కోసం గొడ్డలి కూడా దూశారు అలంటి ది మల్లి రిపీట్ అవ్వకూడదు అనేమో ఈయన జాగ్రత్త పడి కుమారుడుకికి ఛాన్స్ ఇచ్చేసారు

  2. ఆ మధ్య ఒకడ్ని పులివెందుల ఇంచార్జి అంటూ .. ఇలానే .. భలే భలే.. అంటూ పరిచయం చేసావు..

    చాక్లెట్ బాయ్ లాగా ఉండేవాడు.. జగన్ రెడ్డి బంధువు..

    అనినాసనమ్ బదులు గా కడప ఎంపీ గా కూడా పోటీ చేయించాలని అనుకొన్నారు..

    ఈ మధ్య హైదరాబాద్ హాస్పిటల్ లో కోమా లో పడి ఉన్నాడని.. జగన్ రెడ్డి వదిలించుకొన్నాడని వార్తలు వచ్చాయి..

    ఇలా వారసులందరూ.. కోమా లోకి వెళ్తున్నారా.. భలే.. భలే..

  3. ఆంటే జగన్ పార్టీ కి కాబోయే అధ్యక్రుడు ఇతనే అన్నమాట.

    వరసే కాబట్టి అల్లుడు కూడా అయ్యే అవకాశం వుందా !

  4. ఈడు అసలు మొగోడే కాదని భూమా అఖిలప్రియ ఈడిని వదిలేసి, రెండో పెళ్లి కమ్మ వాడిని చేసుకు0ది.. ఇసంటోడు పంగనామాల 11 పార్టీ ని పైకి లేపుతాడా??

  5. పార్టీ లో పెద్ద పదవి కావాలి అంటే సొంత తం*డ్రి నీ లేపేయ్యాలి అని వాళ్ళ పార్టీ నాయకుడిని మోటివేషన్ గా తీసుకుంటాడు ఏమో , వాళ్ళ నాన్నని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి.

  6. Mr GA Reddy garu, మీరు ఏదేదో వ్రాసి వాళ్ళని ఎందుకు తిట్టిస్తున్నావు. నీవు వ్రాయడం వల్లనే కదా ఈ బూతుల పంచాంగం.

    1. వారి వ్యక్తిగత విషయాలు కూడా బయటకు వచ్చే విధంగా చేయడం మంచిది కాదు.

Comments are closed.