ఇద్దరు ఎమ్మెల్యేలకు పవన్ హెచ్చరిక

పరిశ్రమలు, వాటి యజమానుల విషయంలో అస్సలు జోక్యం తగదని పవన్ ఖరాఖండీగా చెప్పినట్లు తెలుస్తోంది.

నిన్నటికి నిన్న ఓ హెచ్చరిక జారీ చేసారుఏపీ మంత్రి పవన్ కళ్యాణ్ తన పేషీ సిబ్బందికి. అవినీతి అన్నది సహించను అని. అలాంటి వాళ్లు వుంటే ఇప్పుడే వెళ్లిపోవచ్చని. ఇది జరగడానికి కొన్ని రోజులకు ముందు ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా పవన్ సుతి మెత్తగా ఇదే తరహా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనకు అందిన ఫిర్యాదులు, సమాచారం మేరకు సదరు ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లు తెలుస్తోంది.

విశాఖ జిల్లాకు చెందిన అ ఇద్దరు ఎమ్మెల్యేలు పారిశ్రామిక వాడలు, పరిశ్రమలు, వాటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, వారి నుంచి పెద్ద మొత్తాలు అశిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, ఇలాంటివి తగదని పవన్ హెచ్చరించినట్లు రాజకీయ వర్గాల బోగట్టా. పరిశ్రమలు, వాటి యజమానుల విషయంలో అస్సలు జోక్యం తగదని పవన్ ఖరాఖండీగా చెప్పినట్లు తెలుస్తోంది.

విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ సిఎమ్ రమేష్ ఇప్పుడు మొత్తం తానై వ్యవహరిస్తున్నారు. సాధారణంగా ఎంపీలు అంత యాక్టివ్ గా వుండరు. కానీ సిఎమ్ రమేష్ తన నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్ధానాల్లో చురుగ్గా పర్యటిస్తున్నారు. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అయన ఇలా చురుగ్గా వ్యవహరించడం, సిఎమ్ రమేష్ కు పవన్ తో చాలా సాన్నిహిత్యం వుండడం, ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలను పవన్ హెచ్చరించడం, ఇవన్నీ ఒకదానికి ఒకటి ముడిపెట్టి మాట్లాడుకుంటున్నారు ఙిల్లా రాజకీయ నాయకులు.

13 Replies to “ఇద్దరు ఎమ్మెల్యేలకు పవన్ హెచ్చరిక”

  1. మా జగన్ రెడ్డన్న అయితే.. పాలస్ కి పిలిపించుకుని.. కమీషన్లు మాట్లాడుకుని పంపించేస్తాడు..

    మా జగన్ రెడ్డన్న పాలన లో తప్పు చేయడం తప్పు కాదు.. తప్పు చేయకపోవడమే తప్పు..

    ఆ తప్పు చేసాక జగన్ రెడ్డి కి కమీషన్లు ఇవ్వకపోవడం.. అతి పెద్ద తప్పు..

Comments are closed.