జెడి లక్ష్మీనారాయణ మళ్లీ మరోసారి విశాఖ బరిలోనే తన అదృష్టాన్ని పరిశీలించుకోవాలని డిసైడ్ అయిపొయారు. ఈ మేరకు ముందుగానే ప్రకటించేసారు. తాను మరోసారి విశాఖ నుంచే పోటీ చేస్తానని, తన భావాలకు దగ్గరగా వుండే పార్టీలతో ముందుకు వెళ్తానని చెప్పేసారు.
వైకాపా తప్ప మిగిలిన పార్టీలు అన్నీ ఆయన భావాలకు తగ్గరగా వుండేవే అని అందరికీ తెలిసిన రహస్యమే. మళ్లీ వెనక్కు వస్తే జనసేన ఆయనను స్వాగితిస్తుందా? విశాఖ సీటు కేటాయిస్తుందా? అన్నది చూడాలి.
అలాగే ఎన్నికల వేళ పొత్తులు అనేవి చాలా కీలకం. అందువల్ల విశాఖ లాంటి కీలక ఎంపీ సీటును ఈసారి తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో చూడాలి. బాలయ్య చిన్నల్లుడు భరత్ మళ్లీ పోటీ చేస్తారా? అన్న క్వశ్చను వుండనే వుంది. సో, జెడి లోక్ సభకు విశాఖ నుంచి పోటీ చేయాలి అంటే కేవలం ఆయన ఒక్కరు నిర్ణయించకుంటే సరిపోదు. అన్ని పార్టీల మద్దతు కలిసి రావాల్సి వుంటుంది. అప్పుడే గ్రీన్ సిగ్నల్ దొరుకుతుంది.
ఉత్తరాంధ్ర అందులోనూ ముఖ్యంగా విశాఖ విషయంలో ఈసారి లోకల్ కేండిడేట్ లు అన్నది కీలకం అనే పాయింట్ వుంది. ఉత్తరాంధ్రకు రాజధాని అన్నదాన్ని వ్యతిరేకించేవారిని బరిలోకి దింపరు. ఈ విషయంలో జెడి నాన్ లోకల్ కేటగిరీలోకి వస్తారు. అందువల్ల ఆయనకు ఆయన ఫిక్స్ అయినా పోటీ వరకు వచ్చేసరికి చాలా అడ్డంకులు వుండే అవకాశం వుంది.