తెలుగుదేశం అను కుల మీడియా లెక్కల ప్రకారం, ప్రచారం చేస్తున్న తీరు ప్రకారం, వైకాపా పార్టీ దారుణంగా ఓడిపోబోతోంది రాబోయే ఎన్నికల్లో. వాళ్లకు ఇష్టమైన చంద్రబాబు ఆయన పార్టీ అధికారంలోకి వస్తారని నమ్ముతున్నారు. అదే దిశగా ప్రచారం చేస్తున్నారు.
మరో పక్క ఆంధ్రలో వైకాపాను గద్దె దించడమే లక్ష్యంగా జనసేన హడావుడి చేస్తోంది. ఇంకా అంతా అయిపోయింది. జగన్ ఇక జైలుకే అంటూ ఆ రెండు పార్టీల సోషల్ మీడియా వింగ్స్ ప్రచారం చేస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో వైకాపా టికెట్ ల కోసం రొడ్డెక్కుతున్నారు నాయకులు. రామచంద్రపురం, గన్నవరం తాజా ఉదాహరణలు. ఇలా రోడ్డెక్కకపోయినా టికెట్ ల కోసం పోటీ పడుతున్న నియోజకవర్గాలు చాలా వున్నాయి. చాలా నియోజక వర్గాల్లో అభ్యర్థిని మార్చాలని, ఈసారి తమ కులానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ లు వుండనే వున్నాయి. అంటే దీని అర్థం ఏమనుకోవాలి? పోటీకి దిగడం అంటే కనీసం 30 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్దం కావడం.
ఓడిపోయే పార్టీ నుంచి ఎవరు మాత్రం పోటీ చేయాలనుకుంటారు. కానీ అలా అనుకుంటున్నారంటే ఈ పత్రికలు రాసేది, టాం టాం వేసేది వేరు. గ్రౌండ్ రియాల్టీ వేరు అనే కదా అనుకోవాల్సింది. అందుకే తెలుగుదేశం అను కుల మీడియాకు భలే సంకట స్థితి. గొడవలు ఫోకస్ చేస్తే ఒక విధంగా బాగుంటుంది. కానీ అలా చేస్తే వైకాపా కు అవకాశాలు బలంగా వున్న ఫీల్ బయటకు వెళ్తుంది. ఫోకస్ చేయకుండా వుండడానికి మనసు ఒప్పదు.
ఇదిలా వుంటే ఈ టికెట్ గొడవలను మరో విధంగా చూడాలేమో? ఎన్నికల వేళ, పార్టీ బలహీనపడుతోంది. నాయకత్వం పట్టు సడలుతుంది. ఇలాంటపుడే తమ మాట నెగ్గించుకోవాలని వైకాపా నాయకులు అనుకుంటున్నారేమో?