ఓటుకు నోటు పక్కా నిజమే

చంద్రబాబు హుటాహుటిన హైదరాబాద్ వదిలి, ఆంధ్రకు వెళ్లిపోయి, ఉమ్మడి రాజధాని హక్కుకు నీళ్లు వదలడానికి కారణం ఓటుకు నోటు కేసు.  Advertisement ఇది అందరికీ తెలిసిన సంగతే. అయితే అదంతా భోగస్ అని, అందులో…

చంద్రబాబు హుటాహుటిన హైదరాబాద్ వదిలి, ఆంధ్రకు వెళ్లిపోయి, ఉమ్మడి రాజధాని హక్కుకు నీళ్లు వదలడానికి కారణం ఓటుకు నోటు కేసు. 

ఇది అందరికీ తెలిసిన సంగతే. అయితే అదంతా భోగస్ అని, అందులో చంద్రబాబుకు ప్రమేయం లేదనీ ఇప్పటికీ వాదిస్తూనే వుంటారు కొందరు. కానీ చంద్రబాబు తనకు తెలియకుండానే కేసిఆర్ పన్నిన ఉచ్చులో చిక్కుకుపోయారని అది నిజమే అని అంటున్నారు ఎబిఎన్ ఆర్కే…ఆయన మాటల్లోనే చెప్పాలంటే…

‘’…..చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే తెలంగాణకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యే ఒకరిని కోవర్టుగా మార్చుకొని ఓటుకు నోటు కేసుకు స్కెచ్‌ వేశారు. సదరు ఎమ్మెల్యే ద్వారా రేవంత్‌ రెడ్డి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకొని అవినీతి నిరోధక శాఖను రంగంలోకి దించారు. ఇవేమీ తెలియని రేవంత్‌ రెడ్డి ఇరుక్కుపోయారు. చంద్రబాబు కూడా కేసీఆర్‌ చేతికి చిక్కారు. కోవర్టుగా మారిన ఎమ్మెల్యే ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో కీలక పదవి అనుభవిస్తున్నారు…’’

అంటే ఓటు కోసం నోట్లు వెదజల్లడం అన్నది జరిగిందని, కేసిఆర్ ముందుగానే కన్నేసి వుండడం వల్ల దొరికిపోయారు తప్ప లేదంటే దొరికే అవకాశం లేదని క్లారిటీగా తెలుస్తోంది. 

ఏమిటో మన మీడియా జనాలు…అవసరం అయినపుడు అడ్డంగా బుకాయిస్తారు…అంతా అయిపోయాక… అది నిజమే అన్నట్లు మాట్లాడతారు. ఇప్పుడు కూడా కేసిఆర్ పన్నిన ఉచ్చులో రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇరుక్కుపోయారు అంటున్నారు తప్ప చంద్రబాబు అలా ఓటుకు నోటు ఇవ్వడం తప్పు అనడం లేదు.

మనకు ఇష్టమైతే అవినీతి ఓ విధంగా కనిపిస్తుంది. ఇష్టం లేకపోతే అవినీతి మరోలా కనిపిస్తుంది.