పవన్ కామెంట్ వెనుక…?

ప్రజ‌ల్లో శాంతి భద్రతల విషయంలో వస్తున్న వ్యతిరేకత చూసి, మొత్తం వైఫల్యం హోం మంత్రి ఖాతాలో జ‌మ వేయాలని ప్లాన్ చేసారా?

ఊరక రారు మహానుభావులు అని పెద్దల మాట. డిప్యూటీ సిఎమ్ పవన్ కళ్యాణ్ నోటి వెంట మాటలు కూడా ఊరికే అనాలోచితంగా రావు. వినడానికి లేదా చూడ్డానికి ఏదో ఫ్లో లో మాట్లాడేసినట్లు వుంటాయి. కానీ దాని వెనుక పక్కా ప్లానింగ్ వుంటుందని అనిపిస్తుంది. ప్లానింగ్ అంటే పవన్ కళ్యాణ్ ది మాత్రమే కాదు. తెలుగుదేశం పార్టీది కూడా వుంటుంది. కూటమి పెద్దలు ముగ్గురూ ఓ మాట మీదే వున్నారు. వుంటారు. అలా ముగ్గురు అనుకున్న తరువాతే పవన్ నోటి వెంట మాట వస్తుంది. దాదాపు అయిదారేళ్లుగా గమనిస్తే ఇదే టైమింగ్.. ఇదే లెంగ్త్ కనిపిస్తుంది.

ఇప్పుడు పవన్ నోటి వెంట ఓ మాట వచ్చింది. హోం మంత్రి అనిత కు చిన్న హెచ్చరికలాంటిది చేసారు. చురుగ్గా వ్యవహరించాలని, లేదంటే తను సీన్లోకి ఎంటర్ అయితే, అంటే తను కనుక హోం మంత్రి అయితే పరిస్థితి వేరుగా వుంటుందని అన్నారు.

అనిత హోం మంత్రి అయిన తరువాత ఇలాంటి సుతి మెత్తని హెచ్చరిక రావడం ఇది రెండో సారి. మొదట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఓసారి సుతిమెత్తగా హెచ్చరించారు. కానీ ఇటీవల రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు బాగా పెరిగాయి. జ‌నం వీటి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇది కాస్తా నేరుగా కూటమి దృష్టికి వెళ్లే వుంటుంది.

నిజానికి హోం మంత్రిగా చేయగలిగింది, నిస్పక్షపాతంగా వుండమని అధికారులకు చెప్పడం వరకే. అంతే తప్ప గ్రౌండ్ లో దిగి దర్యాప్తు చేయరు. అరెస్ట్ లు చేయరు. అవన్నీ సాగించాల్సింది అధికారులు. వారు ఉదాసీనంగా వుంటే నేరాలు పెరుగుతాయి. వారు అలా వుండకుండా చూడాల్సింది హోం మంత్రి.

కానీ హోం మంత్రిగా పోస్టింగ్ లు, బదిలీలపై ఎంత వరకు పట్టు వుంది, వుంటుంది అన్నది పాయింట్. హోం మంత్రిగా బలమైన, అనుభవం పండిన వారు వుంటే తప్ప, బదిలీలు, పోస్టింగ్ లు అన్నీ సిఎమ్ నే చూసుకుంటారు. చిన్న చిన్న బదిలీలు, పోలీస్ శాఖ టాప్ బాస్ లు చూసుకుంటారు. అందువల్ల ఈ విషయంలో హోం మంత్రి అనిత ను తప్పు పట్టి ప్రయోజ‌నం లేదు. ఎందుకంటే టాప్ నియాకమాలు అన్నీ లోకేష్ లేదా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే. వారి మీద హోం మంత్రికి ఏం పట్టు వుంటుంది.

మరి ఇవన్నీ కూటమి పెద్దలు ముగ్గురికి తెలియనిదా? లేక ప్రజ‌ల్లో శాంతి భద్రతల విషయంలో వస్తున్న వ్యతిరేకత చూసి, మొత్తం వైఫల్యం హోం మంత్రి ఖాతాలో జ‌మ వేయాలని ప్లాన్ చేసారా? అందులో భాగంగానే పవన్ నోటి వెంట ఈ మాటలు వచ్చాయా?

కొన్ని రోజులు అగితే మరింత క్లారిటీ వస్తుందేమో?

45 Replies to “పవన్ కామెంట్ వెనుక…?”

  1. ఈ….డి జివితిమంతా వీళ్ళను వాళ్ళను బ్లెం చెయ్యడమె …

    అ బొరుగడ్డ అనిల్ గాడిని వంగొపెట్టి గొలి సొడా ఎక్కిస్తె ఎవ్వడొద్దన్నాడు

    అ కడపలొ ఒ అమ్మయిని పెట్రొల్ పొసి కాల్చి చంపినొడుని ఎంకౌంటెర్ చెస్తె ఎవ్వడొద్దన్నాడు

    స్కూల్స్ లొ 13 నుండి 20 ఎళ్ళు వయసున్న అమ్మాయులకు వారినికొసారి…. టీనెజ్ ప్రెమలు ..వాటి పర్యవసనాలు …గురుంచి చెప్పి….. పెరెంట్స్ ని రెగులర్ గా మానిటర్ చెయ్యమని చెప్పండి ..

    అవిలెకుండా…మంచి జరిగితె నా అకౌంట్ లొకి ..చెడు జరిగితె మీ అకౌంట్ లొకి …అని ఎన్ని రొజులు టైం పాస్ చెస్తావ్ దొరా ?

  2. నీకు నీ గొర్రె బిడ్డలకు బుర్ర ఉంటె అర్థం చేసుకోవడం సులభం..

    రెండు రోజుల క్రితమే సీఎం చంద్రబాబు.. అత్యాచారాలు చేసే వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి వేయాలి అన్నారు..

    ప్రజాస్వామ్యం లో అలాంటివి కుదరవు.. కానీ ఈ సిరీస్ అఫ్ రేపులకు అదొక్కటే మార్గం అని ప్రజలు కూడా భావిస్తున్నారు..

    కూటమి ప్రభుత్వం ఈ విషయం లో కఠినమైన చట్టాలను “సిద్ధం” చేసుకొంటున్నారు..

    ఒకసారి చట్టం చేసాక.. సో కాల్డ్ “మానవతావాదులు” పుట్టుకొచ్చేస్తారు..

    వాళ్లకి ముందుగా వార్నింగ్ ఇవ్వడమే.. డిప్యూటీ సీఎం స్టేట్మెంట్ ఈ రోజు..

    హోమ్ మంత్రి అనిత కి ఫుల్ పవర్స్ ఇవ్వడమే ఇందులో ఉద్దేశ్యం.. ఈ ఆలోచన పోలీస్ వర్గాల్లో నుండే సీఎం కి సలహా గా వచ్చిన తర్వాతే చట్టాలను చేసుకొన్నారు..

    వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది..

    1. చిన్న పిల్లల మీద అకృత్యాలు చేసిన వాళ్ళని ఇమ్మేది ఏట్ గా చంపితేన్3 భయం పుడుతుంది .కనీసం ఒక 6 నెల్లలో శిక్ష లి అమలు పరచాలి అప్పుడే వెన్ను లో వణుకు వస్తుంది

  3. ఒక సమాజం లో నేరాలు ఘోరాలు ఆ సమాజం ఎంత బ్రష్టు పట్టిందో అన్న దానికి కొలమానమై అద్దం పడతాయి.. పాపం ప్రభుత్వాలు మంత్రులు అధికారులు.. ఏం చేస్తారు…

  4. చిన్న పిల్లల మీద తేడా గా చేస్తే అమాటిల్లని చక్కగా సూట్ చేసి చంపాలి

  5. నిజంగా జెన్యూన్ గా పరిష్కరించాలంటే ఇలా మైకు ముందు చెప్పరు. పని వెంటనే జరిగేలా చూస్తారు. కేంద్రంలో కూడా మీ కూటమే కదా అధికారంలో ఉంది. అయినా సరే రాష్ట్ర అధికారులు మీరు చెప్పినా కూడా పని చేయడం లేదా? 95 సిఎం అని ఒకడు, తొక్కి నార తీస్తా అని ఇంకొకడు బయలు దేరారు.

  6. ఇపుడు ఉన్న పోర్ట్ ఫోలియోలు బోర్ కొట్టేసిందంట, కొత్త మినిస్ట్రీ మీద మనసు పడినట్టుంది. హి హి హి. దేని మీదైనా నిలకడ ఉండాలమ్మా.

  7. All these gorrelu are doing this. In 80’s 99% were hindus crime was low once the conversion started crime increased that is the root cause. In South America crime increased cuz of missionaries.

  8. There were very less crime in 80’s cuz 99% were hindus. Once the conversion started crime was also increased. In South America and africa crime rate is high cuz of missionaries

Comments are closed.