చంద్రబాబు ఆ పని చేస్తారా? నమ్మొచ్చా? 

సాధారణంగా రాజకీయనాయకుల గురించి అనేక ప్రచారాలు జరుగుతుంటాయి. కొన్ని నిజాలవొచ్చు, కాకపోవొచ్చు. కానీ చంద్రబాబు నాయుడుకు సంబంధించి వచ్చిన ఒక సమాచారం మాత్రం వందశాతం అవాస్తవం అయ్యే ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో జగన్ ను…

సాధారణంగా రాజకీయనాయకుల గురించి అనేక ప్రచారాలు జరుగుతుంటాయి. కొన్ని నిజాలవొచ్చు, కాకపోవొచ్చు. కానీ చంద్రబాబు నాయుడుకు సంబంధించి వచ్చిన ఒక సమాచారం మాత్రం వందశాతం అవాస్తవం అయ్యే ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో జగన్ ను అధికారంలోకి రాకుండా చేయడం కోసం బాబు ఈ పని చేస్తాడని అంటున్నారు. 

ఇంతకూ బాబు చేయబోయే ఆ పని ఏమిటి ? బాబు చెప్పినట్లు ఆయన కనుక ఆ పని చేస్తే మాత్రం అది పెను సంచలనమవుతుంది. ఇంతకూ వచ్చే ఎన్నికల్లో అదృష్టవశాత్తు టీడీపీ గెలిస్తే ఆయన ఏం చేయబోతున్నారని ప్రచారం జరుగుతోందో తెలుసా? ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేస్తారట. అంటే కుమారుడు లోకేష్ ను సీఎం చేస్తారని అందరూ అనుకుంటారు. కానీ కాదు. ఒక కాపు నాయకుడిని సీఎం చేస్తారట.

సీఎం పదవిని తాత్కాలికంగా అయినా త్యాగం చేసేందుకు టీడీపీ అధినేత ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కులసమీకరణాలతో కునారిల్లుతున్న రాష్ట్రంలో అదే కుల సమీకరణాల్ని రూటుమార్చి ప్రయోగించడం ద్వారా గత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ వేసిన సోషల్ ఇంజనీరింగ్ పాచికకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. 

ఉమ్మడి ఏపీలోనే కాపులకు సీఎం పదవి తెరపైకి వచ్చింది. దర్శకుడు దాసరి, చిరంజీవి వంటి వారు ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ను సీఎం చేసేందుకు బీజేపీ కూడా సహకరిస్తోంది. ఇలాంటి పరిస్ధితుల్లో కాపు నేతకు సీఎం పదవి కట్టబెట్టేందుకు చంద్రబాబు మానసికంగా సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 

వైసీపీకి చెక్ పెట్టాలంటే తాను సీఎం రేసు నుంచి తప్పుకుని కాపు నేతకు సీఎం పదవి ఆఫర్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప రూపంలో కాపులకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన చంద్రబాబు.. ఈసారి కాపులకు సీఎం పదవే ఆఫర్ చేసే అవకాశం ఉందట. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎంలుగా రెడ్డి, యాదవ సామాజిక వర్గాలకు పదవులు ఆఫర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గం అధికారంలో ఉంది. వీరిలో చాలా మంది అధికారం కోసమే టీడీపీని వీడి వైసీపీలో చేరిన వారు కూడా ఉన్నారు. 

వారిని ఆకట్టుకునేందుకు రెడ్లకు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే బీసీ సామాజిక వర్గమైన యాదవులకు కూడా మరో డిప్యూటీ సీఎం ఆఫర్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో చూస్తే జగన్ తొలి కేబినెట్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన అనిల్ కు జలవనరుల మంత్రి పదవి దక్కింది. రెండో కేబినెట్లో యాదవులకు చోటు దక్కలేదు. దీంతో ఈ సామాజిక వర్గానికి ఏకంగా డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేయడం ద్వారా వారితో పాటు మిగతా బీసీల్ని ఆకట్టుకోవచ్చని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

వచ్చే ఎన్నికల్లో మూడు రాజధానుల అంశంతో పాటు సంక్షేమాన్ని ఎన్నికల అజెండాగా మార్చుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇందులో రాజధానుల అంశం ఎవరి చేతుల్లోనూ లేదు. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చినా ఇప్పటికిప్పుడు రాజధానుల నిర్మాణం సాధ్యం కాదు. దీంతో రాజధానుల వ్యవహారం వైసీపీకి మైనస్ అవుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. దీంతో సంక్షేమ అజెండాను దారి మళ్లించేందుకు సంచలన కులసమీకరణాల్ని తెరపైకి తీసుకురావాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. తద్వారా ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమం తప్పనిసరి కాబట్టి కులాల ఆధారంగానే ఓట్లు కురవాలనేది చంద్రబాబు ప్లాన్ గా చర్చ జరుగుతోంది. 

కానీ చంద్రబాబు వంటి నాయకుడు సీఎం అయ్యే అవకాశం వస్తే ఆ పదవిని వదులుకుంటారా? ఒక ప్రాంతీయ పార్టీలో ఈ విధంగా జరగడం సాధ్యమా?