ఏ కుటుంబం కలిసి వుంది?

వైఎస్ సమాధి దగ్గరకు షర్మిల, జగన్ వేరు వేరుగా వెళ్లినపుడల్లా వార్తలే. సోషల్ మీడియాలో పోస్ట్ లే. Advertisement నిజానికి ఆధునిక కాలంలో, ఈ జనరేషన్ లో అన్నీ మైక్రో కుటుంబాలే. అన్ని కుటుంబాల్లోనూ…

వైఎస్ సమాధి దగ్గరకు షర్మిల, జగన్ వేరు వేరుగా వెళ్లినపుడల్లా వార్తలే. సోషల్ మీడియాలో పోస్ట్ లే.

నిజానికి ఆధునిక కాలంలో, ఈ జనరేషన్ లో అన్నీ మైక్రో కుటుంబాలే. అన్ని కుటుంబాల్లోనూ కలతలు.. ఇగో సమస్యలే. ఇలా లేని సెలబ్రిటీ కుటుంబాలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అయినా పెళ్లిళ్లు అయిపోయిన తరువాత ఎవరి కుటుంబం వారిదే. ఎవరి బతకులు వారివే. ఎవరి వ్యూహాలు వారివే. అలా అని ప్రతి సారీ రాస్తున్నారా? వార్తలు.

ఎన్టీఆర్ సమాధి దగ్గరకు కుటుంబం అంతా కలిసి వెళ్తున్నారా? లేదుగా. బాలయ్య దారి బాలయ్యది. ఎన్టీఆర్ దారి ఎన్టీఆర్ ది. కూకట్ పల్లిలో చెల్లెలు పోటీ చేస్తే, హరికృష్ణ కుమారులు మద్దతుగా నిలిచారా? లేదుగా.

రామోజీ కొడుకు సుమన్, చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఎదురు ఎదురుగా నిలిచిన సందర్భాలు లేవా? అంత ఎందుకు ఎందరో రాజకీయ నాయకుల ఇళ్లలో రెండు పార్టీలు.

అశోక్ గజపతి, ఆనంద్ గజపతి రెండు పార్టీల్లోనే వుంటూ వచ్చారు కదా. కేవలం జగన్- షర్మిల మాత్రమే ఈ ప్రపంచంలో విడిపోయిన అన్నా చెల్లెళ్లు అన్నట్లుగా ఎందుకు చూస్తోంది మీడియా?

సెలబ్రిటీలను పక్కన పెడితే మామూలు కుటుంబాలు కూడా పెళ్లిళ్లు అయిన తరువాత ఎవరి బతుకులు వారివి అన్నట్లే కదా వుంటున్నారు. మరి కేవలం ఎందుకు షర్మిల- జగన్ లను హైలైట్ చేసి, అక్కడికేదో, జగన్ అపరాధి అన్నట్లు ప్రొజెక్ట్ చేయడం. కేవలం కావాలని తప్ప వేరు కాదు అని అర్థం అయిపోవడం లేదా?