Advertisement

Advertisement


Home > Politics - Analysis

జ‌గ‌న్ హ‌త్యే ల‌క్ష్య‌మా?

జ‌గ‌న్ హ‌త్యే ల‌క్ష్య‌మా?

నెల రోజుల్లో పోలింగ్ జ‌ర‌గ‌బోతోంది. నిజంగానే జ‌గ‌న్ పై ప్ర‌జావ్య‌తిరేక‌త ఉంటే ఫ‌లితాలు అందుకు త‌గ్గ‌ట్టుగా ఉంటాయి. కూట‌మి రూపంలో చంద్ర‌బాబు నాయుడు తిరిగి అధికారాన్ని పొందితే.. అప్పుడు అమ‌రావ‌తినే రాజ‌ధానిగా చేసుకోవ‌చ్చు. రాష్ట్రాన్నంతా నిండా ముంచేసి.. అన్ని అమ‌రావ‌తిలోనే పెట్టుకుని పెట్టుబ‌డి దారులు లాభాలు పొంద‌వ‌చ్చు! క‌మ్మ సామ్రాజాన్ని తిరిగి ప్ర‌తిష్టాప‌న చేసుకోవ‌చ్చు. అప్పుడు వారు ఆడింది ఆట‌, పాడింది పాట‌! అయితే ఇదంతా జ‌రుగుతుంద‌నే న‌మ్మ‌కం ఆ కుల‌స్వామ్యానికి లేన‌ట్టుగా ఉంది! అందుకు సాక్ష్యం జ‌గ‌న్ పై ప‌డ్డ రాయి!

ప్ర‌జాస్వామ్యంలో తాము అనుకున్న‌దే జ‌ర‌గాల‌ని ఒక కులం అనుకుంటే అదేం జ‌ర‌గ‌దు. అదే ఇప్పుడు ఆ కులంలో క‌సి రేపుతూ ఉంది! సామ‌దాన‌బేధ‌దండోపాయాల‌న్నీ ఉప‌యోగించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ తోడు వ‌చ్చాడు. మోడీ కాళ్లు ప‌ట్టుకున్నారు. కూట‌మి అన్నారు. పురందేశ్వ‌రి రూపంలో ఇంకో శ్రేయోభిలాషి ల‌భించారు. ష‌ర్మిల కూడా గొర్రెలా దొరికింది! అయితే ఇన్ని చేసినా.. ఇంకా అధికారంపై ఆ కులంలో న‌మ్మ‌కం లేదు!

త‌మ అవ‌స‌రానికి అంద‌రినీ అన్ని ర‌కాలుగా వాడుకుంటున్నా.. జ‌గన్ కు తిరుగులేద‌నే స్వ‌ర‌మే ప్ర‌జ‌ల నుంచి వినిపిస్తోంది. ఇది ఆ కులాన్ని క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది. ఇంత‌మందిని క‌లుపుకున్నా.. జ‌గ‌న్ ను ఓడించే ధీమా లేక‌.. జ‌గ‌న్ ను భౌతికంగా మ‌ట్టుబెట్టాల‌నే తీవ్ర‌వాద‌పు ఆలోచ‌న రావ‌డం ఆ కుల తాలిబ‌న్ల‌కు పెద్ద విష‌యం కాదు. 

జ‌గ‌న్ ను కొట్టింది రాయిని పెట్టి అని ప్రాథ‌మికంగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ..ఎయిర్ గ‌న్ తో జ‌గ‌న్ ను లక్ష్యంగా చేసుకున్నార‌ని పోలీసుల‌కు అనుమానాలు రేగుతున్నాయి. జ‌గ‌న్ కు త‌గిలింది క‌నుబొమ్మ‌ల పైన అయినా.. ల‌క్ష్యం క‌ణ‌తలు కావ‌డంలో ఈ కుట్ర‌లో పెద్ద ఆశ్చ‌ర్యం లేని అంశం. 

పోలింగ్ కు నెల రోజుల్లోపు స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో జ‌గ‌న్ ను భౌతికంగా తొల‌గించే కుట్ర జ‌రిగింద‌ని అనుకోవ‌డానికి చాలా ఆధారాలు క‌నిపిస్తూ ఉన్నాయి. ఈ కుట్ర విఫ‌లం అయ్యింది. అయితే ఇది విఫ‌లం అయినా..క‌ప్పి పుచ్చ‌గ‌ల శ‌క్తి యుక్తులు ఆ మీడియాకు, ఆ కులానికి వెన్న‌తో పెట్టిన‌ట్టుగా ఉన్నాయి. చేతిలో మీడియా ఉంది, సోష‌ల్ మీడియాకు కావాల్సినంత ప‌డేసే శ‌క్తీ ఉంది. సానుభూతి కోసం అంటూ గోబెల్స్ వాద‌న‌ను వినిపించ‌గ‌ల‌రు. అస‌లు చంద్ర‌బాబు నాయుడు అనే వ్య‌క్తి రాజ‌కీయ జీవిత‌మే గోబెల్స్ ప్ర‌చారాన్ని పునాదిగా నిర్మిత‌మైన‌ది. కాబ‌ట్టి.. వాళ్ల ప్ర‌చార శ‌క్తి గురించి త‌క్కువ అంచ‌నా వేస్తే అది అంచ‌నా వేసే వాళ్ల అమాయ‌క‌త్వ‌మే! కాబ‌ట్టి.. జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నాన్ని వాళ్లు ట‌ర్న్ చేయ‌డానికి శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నారు!

జ‌గ‌న్ పై దాడి జ‌రిగిన వెంట‌నే జాతీయ మీడియాలో వ‌చ్చింద‌ని, వైఎస్ఆర్సీపీ వాళ్లు మాట్లాడార‌ని.. కాబ‌ట్టి ఇదంతా ప్రీప్లాన్డ్ అట‌. మ‌రి జ‌గ‌న్ పై దాడి జ‌రిగిన అతి తక్కువ స‌మ‌యంలోనే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ కూడా ట్విట‌ర్లో స్పందించారు. మ‌రి డ్రామా అయితే.. అందులో మోడీకీ వాటా ఉన్న‌ట్టా? ప‌చ్చ బ్యాచ్ విష పూరితం. అది ఈ విష‌యంలో కూడా విష‌పూరితంగా స్పందించ‌డంలో విడ్డూరం లేదు. 

ఈ దాడితో ఎన్నిక‌ల విష‌యంలో కూడా వారి దృక్ప‌థం తేలిపోయింది. విజ‌యంపై విశ్వాసం లేక జ‌గ‌న్ ను భౌతికంగా మ‌ట్టుబెట్టి తాము బ‌ట్ట‌క‌ట్టాల‌నే ప్ర‌య‌త్నంలో ఉన్నారని స్ప‌ష్టం అవుతోంది. ప్ర‌జాస్వామ్యంలో ఇది అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ఆట‌!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?