Advertisement

Advertisement


Home > Movies - Movie News

'ప్రసన్న వదనం' ష్యూర్ హిట్

'ప్రసన్న వదనం' ష్యూర్ హిట్

యంగ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ సినిమా ప్రసన్నవదనం. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ థ్రిల్లర్ ఈ సినిమా. ఈ సినిమాకు దర్శకుడు అర్జున. ఈవారం విడుదలవుతున్న నేపథ్యంలో టీమ్ అంతా కలిసి మీడియాతో మాట్లాడారు.

మీడియా మీట్ లో హీరో సుహాస్ మాట్లాడుతూ, 'ప్రసన్న వదనం' సినిమా నా గత చిత్రాలు కంటే అద్భుతంగా వుంటుంది. ఫస్ట్ కాపీ చూశాను. ఇది థౌజండ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్' అని నమ్మకం వ్యక్తం చేశారు హీరో సుహాస్.

సుహాస్ మాట్లాడుతూ... 'ప్రసన్న వదనం' కంటెంట్ పై పూర్తిగా నమ్మకంగా వున్నాం. ఇది థౌజండ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ మూవీ. నా సినిమాలు మౌత్ టాక్ వలనే ఆడుతాయి. దయచేసి ఎవరికి కుదిరితే వారు తొందరగా సినిమా చూసి మిగతా వారికి కూడా చెప్పాలి. యునిక్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా అందరినీ అలరిస్తుంది' అన్నారు. 

'ప్రసన్న వదనం నా మొదటి సినిమా. సినిమా చాలా బావోచ్చింది. సినిమా కోసం ఎక్సయిటెడ్ గా ఎదురుచుస్తున్నాం. అందరూ వచ్చి థియేటర్స్ లో చూడాలి' అని దర్శకుడు అర్జున్ కోరారు.

ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా ఇది. ఇపటికే టీజర్, ట్రైలర్ మంచి అంచనాలని రేకెత్తించాయి. సుకుమార్ లాంటి దర్శకుడు 'ఈ సినిమా అందరినీ గొప్పగా అలరిస్తుంది. థియేటర్స్ లో మిస్ అవ్వద్దు' అని చెప్పడం మరింత బజ్ క్రియేట్ చేసింది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?