Advertisement

Advertisement


Home > Politics - Analysis

కుప్పంలో దిక్కులేదు.. కడపలో జేజేలు పలికారంట

కుప్పంలో దిక్కులేదు.. కడపలో జేజేలు పలికారంట

మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుంది చంద్రబాబు పరిస్థితి. కుప్పం వెళ్తే కార్యకర్తలు జై ఎన్టీఆర్ అంటున్నారు. స్వయానా సొంత మండలంలో ఎంపీటీసీ సీటు ఓడించారు. ఇలా ఉంది అక్కడ బాబు పరిస్థితి. అలాంటి బాబు ఇప్పుడు కడప పర్యటనకు వచ్చారు. 

సీఎం జగన్ సొంత జిల్లా అది, అక్కడ బాబుకి జనాలు నీరాజనాలు పలికారట, జేజేలు కొట్టారట. "ట్రాఫిక్ స్తంభించింది, కాలం ఆగిపోయింది" అంటూ కబుర్లు చెబుతోంది ఆయన అనుకూల మీడియా. కుప్పంలో తరిమికొట్టిన బాబుకి, కడప జేజేలు కొట్టిందంటే.. ఇంతకంటే కామెడీ ఇంకోటి ఉంటుందా..?

ఎలివేషన్ల కోసం పాకులాట..

ఎలాగూ కుప్పంలో కూసాలు కదిలిపోయాయి కాబట్టి.. కడపలో తన ప్రతాపం చూపిద్దామని వచ్చారు చంద్రబాబు. ప్రీ ప్లాన్డ్ గా జగన్ ఇలాకాలో బాబుకి భారీ ఎలివేషన్లు ఉండాలని ప్రణాళిక రచించారు. 

ఇక తిమ్మిని బమ్మిని చేసే సొంత మీడియా ఎలాగూ చేతిలోనే ఉంది. దీంతో వారు కావాల్సినంత హైప్ ఇచ్చుకుంటున్నారు. చంద్రబాబు రాకతో కడప విమానాశ్రయం కిక్కిరిసిపోయిందని, ఓపెన్ టాప్ లో బాబు ఎక్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేదికకు చేరుకోడానికే రెండు గంటలు సమయం పట్టిందని రాసుకొచ్చారు.

గజమాలలతో ప్రజలు బారులు తీరారట. వర్షాన్ని లెక్కచేయకుండా ఆయన కోసం వేచి చూశారట. జగన్ ని విమర్శించినప్పుడల్లా సభలో హర్షధ్వానాలు వినిపించాయట. ఇలా ఉంది ఈనాడు కథనం. 

నిజంగానే చంద్రబాబుకి ఇంత క్రేజ్ ఉంటే, సొంత నియోజకవర్గం కుప్పంలో ఉండాలి కానీ, ఒక్క సీటు కూడా గెలవని కడపలో బాబుకి ఇంతమంది అభిమానులుంటారా..? ఇదంతా పెయిడ్ ఆర్టిస్ట్ ల ప్రతాపం. దాన్ని అచ్చువేసి మరింత హడావిడి చేస్తోంది ఎల్లో మీడియా.

మళ్లీ ముంచే ప్రయత్నాలు..

2019లో చంద్రబాబుకి వాస్తవాలు చెప్పకుండా మోసం చేసింది మీడియా. బాబు కూడా వాస్తవాలు వినేందుకు సిద్ధంగా లేరు. ఇప్పుడు కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పులేదు. చంద్రబాబు వాస్తవాలను వినేటట్టు లేరు. దానికి తగ్గట్టుగానే బాబు అనుకూల మీడియా మరోసారి అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేస్తోంది. 

జగన్ ని ప్రజలు దూరం పెట్టారని, చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారనే ప్రచారం మొదలైంది. జగన్ ప్రభుత్వంపై అక్కడక్కడా అసంతృప్తి ఉండొచ్చేమో కానీ, చంద్రబాబుని మాత్రం ఎవరూ రావాలని కోరుకోవట్లేదు. 

బాబు వస్తే ఏమవుతుందో, ఆ తర్వాత ఎంత వినాశనం ఉంటుందో ఐదేళ్లలో చూశారు. అందుకే జనం బాబుని దూరం పెట్టారు. కానీ ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా కడపలో ఫ్యాన్స్ ఉన్నారు, కర్నూలులో అభిమానులున్నారు, ఒంగోలులో ఓట్లు గుద్దేస్తారు అనుకుంటే మాత్రం.. కుప్పంలో కూడా డిపాజిట్లు గల్లంతవడం ఖాయం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?