ప‌చ్చ స‌వాళ్ల‌కు బ్రేక్.. ముందుంది ముస‌ళ్ల పండ‌గే!

స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ స్కామ్ లో అరెస్టైన తెలుగుదేశం అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు విష‌యంలో ఆయ‌న వ‌ర్గం ఒక బీభ‌త్స‌మైన స‌వాల్ ను మొద‌ట్లోనే చేసింది!  Advertisement స్కిల్…

స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ స్కామ్ లో అరెస్టైన తెలుగుదేశం అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు విష‌యంలో ఆయ‌న వ‌ర్గం ఒక బీభ‌త్స‌మైన స‌వాల్ ను మొద‌ట్లోనే చేసింది! 

స్కిల్ స్కామ్ లో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మేయం ఉంద‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం కుట్ర పూరితంగా అరెస్టు చేసింద‌ని, దాన్ని చంద్ర‌బాబు ఎదుర్కొంటార‌ని.. అది మామూలుగా కాద‌ని, ఏకంగా క్వాష్ పిటిష‌న్ తో ఈ ఆరోప‌ణ‌ల‌ను  చంద్ర‌బాబు నాయుడు ఎదుర్కొంటారంటూ ప‌చ్చ బ్యాచ్ హ‌డావుడి చేసింది! ఈ కేసులో చంద్ర‌బాబు నాయుడు బెయిల్ కు ద‌ర‌ఖాస్తు చేయ‌ర‌ని, ఏకంగా త‌న‌పై కేసును కొట్టేయించుకునే డైరెక్టుగా చంద్ర‌బాబు నాయుడు బ‌య‌ట‌కు వ‌స్తార‌న్న‌ట్టుగా వీరు చెప్పుకొచ్చారు! మ‌రి విచార‌ణ చేయించుకుని, కేసును కొట్టేయించుకురావాలంటే కొంచెం టైమ్ ప‌డుతుంది! అందుక‌నే క్వాష్ పిటిష‌న్ వేశారు. అస‌లు విచార‌ణే అక్క‌ర్లేదు, ఊరికే కేసు కొట్టేయాల‌నేది ఈ పిటిష‌న్ వాద‌న‌!

మ‌రి ఈ పిటిష‌న్ వేయ‌డ‌మే త‌మ గొప్ప‌ద‌నం అన్న‌ట్టుగా ప‌చ్చ‌బ్యాచ్ హ‌డావుడి సాగింది. చూశారా.. చంద్ర‌బాబు నాయుడు బెయిల్ అడ‌గ‌డం లేదు, డైరెక్టుగా కేసే కొట్టేయాల‌ని అడుగుతున్నార‌న్న‌ట్టుగా.. ప‌చ్చ బ్యాచ్ హ‌డావుడి జ‌రిగింది. బెయిల్ అడ‌గ‌డం చిన్న‌త‌నం అని క్వాష్ పిటిష‌న్ గొప్ప అని వాదించారు! మ‌రి ఆ క్వాష్ పిటిష‌న్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది!

కేసు విచార‌ణ ప్రారంభ ద‌శ‌లో తుది తీర్పుల‌ను ఇవ్వ‌లేమంటూ క్వాష్ పిటిష‌న్ ను హైకోర్టు కొట్టేసింది. త‌ద్వారా చంద్ర‌బాబు అండ్ కోకు గ‌ట్టి షాక్ త‌గిలింది! ఇది మామూలుగా అయితే పెద్ద విష‌యం కాక‌పోవ‌చ్చు. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్లు ఈ క్వాష్ పిటిష‌న్ వేయ‌డ‌మే గొప్ప అన్న‌ట్టుగా ప్ర‌చారం చేసుకున్నారు! మరి ఆ పిటిష‌న్ ను కోర్టేమో కొట్టేసింది. మ‌రి ఇదే పిటిష‌న్ ను ప‌ట్టుకుని సుప్రీంకు వెళ్తారేమో!

అయితే ఎక్క‌డికెళ్లినా.. ఈ వ్య‌వ‌హారంలో టీడీపీ త‌ర‌ఫున వాద‌న ఒకేలా ఉంది! చంద్ర‌బాబును అరెస్టు చేసిన 24 గంట‌ల్లోనే మెజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌ర‌చ‌లేదు, ఆయ‌న అరెస్టుకు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి తీసుకోలేదు.. అనే వాద‌న‌లే చంద్ర‌బాబు త‌ర‌ఫున సాగాయి! చంద్ర‌బాబు ను రిమాండ్ కు ఇవ్వొద్ద‌న్న‌ప్పుడూ ఇదే వాద‌న‌, చంద్ర‌బాబును క‌స్ట‌డీకి ఇవ్వ‌డం గురించి ఇదే వాద‌న‌, చంద్ర‌బాబు త‌ర‌ఫున దాఖ‌లైన క్వాష్ పిటిష‌న్ లోనూ ఇదే వాద‌న‌!

కేవ‌లం టెక్నిక‌ల్ అంశాల‌ను ప‌ట్టుకునే చంద్ర‌బాబు త‌ర‌ఫున కోర్టుల్లో మ‌హామ‌హా లాయ‌ర్లు వాదిస్తున్నారు! అస‌లు ఈ స్కామ్ జ‌ర‌గ‌లేదు, అవినీతి జ‌ర‌గ‌లేదు, 371 కోట్ల రూపాయ‌ల డ‌బ్బు మాయం కాలేదు.. అనే వాద‌న‌లు వినిపించి చంద్ర‌బాబు అరెస్టు ను అక్ర‌మం అనొచ్చు. ఈ వాద‌న‌ల‌తోనే చంద్ర‌బాబును పోలీసుల క‌స్ట‌డీకి ఇవ్వ‌న‌క్క‌ర్లేద‌ని వాదించొచ్చు! ఈ వాద‌న‌ల‌తోనే చంద్ర‌బాబు క్వాష్ పిటిష‌న్ నూ వేసుకోవ‌చ్చు! అయితే ఈ కేసులో విచార‌ణ సంద‌ర్భంగా చంద్ర‌బాబు త‌ర‌ఫున న్యాయ‌వాదులు ఎక్క‌డా ఇలాంటి వాద‌న‌లు చేసిన‌ట్టుగా వార్త‌లు రావ‌డం లేదు! 

ఎంత‌సేపూ సాంకేతిక అంశాల‌ను ప‌ట్టుకునే చంద్ర‌బాబును జైలు నుంచి బ‌య‌ట‌కు తీసుకురావాల‌ని, చంద్ర‌బాబుపై కేసు కొట్టి వేయించాల‌ని ఆయ‌న త‌ర‌ఫున పెద్ద పెద్ద న్యాయ‌వాదులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ ప్ర‌య‌త్న‌లేమో బెడిసికొట్టిన‌ట్టుగా ఉన్నాయి!

చంద్ర‌బాబు త‌ర‌ఫున ఇప్ప‌టి వ‌ర‌కూ చాలా పేరున్న న్యాయ‌వాదులు వాదించారు. గ‌తంలో త‌న‌పై ఎలాంటి ఆరోప‌ణ‌లు వ‌చ్చినా వాటిపై స్టే తెచ్చుకుని విచార‌ణ‌లు జ‌ర‌గ‌కుండా చంద్ర‌బాబు నాయుడు ఇప్ప‌టి వ‌ర‌కూ ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు. ఈ అతి విశ్వాసంతో త‌ను నిప్పు అని, త‌న‌ను ఎవ్వ‌రూ ఏం పీక‌లేరు అంటూ బాహాటంగా చెప్పుకున్నాడు! ఈ స్కామ్ లో కూడా చంద్ర‌బాబు అలాగే ఈజీగా బ‌య‌ట‌ప‌డిపోతాడని ప‌చ్చ‌బ్యాచ్ అనుకుంది. చంద్ర‌బాబుపై వారికి ఉన్న న‌మ్మ‌కం అలాంటిది! మ‌రి ఇప్పుడేమో వ్య‌వ‌హారం అలా లేదు.

అయితే అప్పుడే ఏమైంది.. చంద్ర‌బాబు అవినీతి వ్య‌వ‌హారాల గురించి జ‌గ‌న్ గ‌ట్టిగానే జూలు విదులుస్తున్న‌ట్టుగా ఉన్నాడు. మ‌రి ఏం పీకారు, ఏం పీకుతారు అంటూ పరుషంగా స‌వాళ్లు విసిరిన చంద్ర‌బాబు నాయుడుకు ఇప్పుడు త‌త్వం బోధ‌ప‌డుతోందా!