టీడీపీ అనుకుల పత్రిక వారాంతపు పలుకులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వచ్చిన వార్తలు జనసేన అభిమానులకు కోపం తెప్పిస్తున్నాయి. ఏబీఎన్ రాధాకృష్ణని ‘బ్రోకర్ కృష్ణ’ అని పేర్కొంటూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘#ABNBrokerKrishna’ అంటూ జనసేన మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా ఓ హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండింగ్‌లోకి తెచ్చారు.
వారాంతపు పలుకులో ఆర్కే వెల్లడించిన విషయం ఏమిటంటే ఆంధ్రలో ఓట్లు చీల్చి జగన్ కు సాయం చేయడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఓ ఎత్తుగడ వేసారట. ఎన్నికల ఖర్చుల కింద వెయ్యి కోట్లు అయినా ఇస్తాము, విడిగా పోటీ చేయమని పవన్ దగ్గరకు దూతను పంపారట. ఇన్నీ రోజులు వైసీపీ నేతలు ఫ్యాకేజీ.. ఫ్యాకేజీ అంటూ పాడే పాటకు ఆర్కే మరింత అజ్జం పోశారని మండి పడుతున్నారు జనసైనికులు.
గతంలో ప్రజారాజ్యం పార్టీపై విషం గక్కినట్లే ప్రస్తుత౦ తన పత్రికను అడ్డం పెట్టుకోని పవన్ కళ్యాణ్ పై విషం చిమ్ముతున్నారని, ప్రజల్లో పవన్ కళ్యాణ్ కు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక గుడ్డ కాల్చి మీద వేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆర్కేపై తమ అవేధన వ్యక్తం చేస్తున్నారు. రాధాకృష్ణ రాసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ కు ఉన్న చరిష్మా పడిపోదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
మరో వైపు ‘ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతా..’ అంటూ వైసీపీకి గతంలో చెప్పు చూపిన పవన్ కళ్యాణ్ వారాంతపు పలుకుల అధినేతకు ఎందుకు చూపలేదంటూ వైసీపీ అనుకుల సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. రాధాకృష్ణ ఈ వెయ్యి కోట్ల ప్యాకేజీ వంటకాన్ని చంద్రబాబు కనుసన్నల్లో వండారు అంటూ వైసీపీ వారు అంటూన్నారు.
మొత్తానికి ఇన్నీ రోజులు వైసీపీ నేతలు మాత్రమే ఉపయోగించే ఫ్యాకేజీ పేరును ఇకపై మిగత పార్టీ వారు కూడా 1000కోట్ల ఫ్యాకేజీ అంటారని బాధపడుతున్నారు జనసైనికులు. వైసీపీ నేతలపై చిన్న దానికి పెద్ద దానికి ట్వీట్ లేదా పిడిఎఫ్ ఫోస్ట్ చేసే పవన్ కళ్యాణ్ తనపై ఇంత రచ్చ జరుగుతున్నా ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు.