చంద్రబాబు కలలకు అచ్చెన్న కలరింగ్ …?

చంద్రబాబుది సుదీర్ఘమైన రాజకీయ జీవితం. అయినా ఉమ్మడి ఏపీలో విభజన ముక్క అయిన రాష్ట్రంలో నాలుగవసారి సీఎం పదవి కోసం కలలు కనాల్సిన పరిస్థితి అని ప్రత్యర్ధులు సెటైర్లు వేస్తున్నారు. బాబు పాటి పొలిటికల్…

చంద్రబాబుది సుదీర్ఘమైన రాజకీయ జీవితం. అయినా ఉమ్మడి ఏపీలో విభజన ముక్క అయిన రాష్ట్రంలో నాలుగవసారి సీఎం పదవి కోసం కలలు కనాల్సిన పరిస్థితి అని ప్రత్యర్ధులు సెటైర్లు వేస్తున్నారు. బాబు పాటి పొలిటికల్ అనుభవం ఉన్న నేతలు అంతా జాతీయ స్థాయిలో ప్రధాని పదవి కోసం కలలు కంటున్నారు.

చంద్రబాబు మాత్రం 294 సీట్లు ఉన్న ఏపీని ఏలిన చేత్తోనో  2014లో 175 సీట్లు ఉన్న విభజన ఏపీని ఒకసారి ఏలారు. 2024లోనూ ఆయన అదే సీటు కోరుకుంటున్నారు. చంద్రబాబు రాజకీయం అంతా ఉప ప్రాంతీయ పార్టీ మాదిరిగా మారిపోయిందని కామెంట్స్ పడుతున్నాయి.

ఏపీలో చూస్తే యువతరం రాజకీయాల్లోకి వచ్చేసింది. జగన్ సీఎం గా ఉన్నారు. ఆయన వ్యూహాలు ఎత్తుగడలకు విరుగుడు మంత్రం బాబు దూకుడుగా వేయలేకపోతున్నారు అని విమర్శలు ఉన్నాయి. అయిదేళ్ళకు ఒకసారి రొటీన్ ప్రకారం అధికారం చేతులు మారితే ఏపీలో పెద్ద పార్టీగా తమకే అందలం అని బాబు పాత ఫార్ములాను నమ్ముకున్నారని అంటున్నారు.

అచ్చెన్నాయుడు అయితే ఎక్కడా తగ్గడంలేదు. 160 సీట్లు ఖాయమని అంటున్నారు. 160 రోజులలో బాబు సీఎం అని డేట్ కూడా ఇచ్చేశారు. రెండేళ్ళ క్రితం పార్టీ లేదు ఏమీ లేదు అన్న నోటితోనే ఇపుడు 160 సీట్లు అని ఒకే నంబర్ పట్టుకుని అచ్చెన్న టీడీపీకి బాబుకు హుషార్ తెస్తున్నారు.

క్షేత్ర స్థాయిలో పరిస్థితి అలా ఉందా అన్నది సందేహంగా ఉంది. అచ్చెన్న 160 సీట్ల మాటకు బొత్స సత్యనారాయణ ఒక పవర్ ఫుల్ కౌంటర్ వదిలారు. అచ్చెన్నవి పనికి మాలిన మాటలు అంటూ మొదటికే గాలి తీశేసారు. బాబు సీఎం అయ్యేది లేదు పోయేది లేదు అంటూ బాబు ఆశలను ఉఫ్ అని ఊదేశారు.

ఏమి చేశారని మళ్లీ బాబుని జనాలు సీఎం గా చేస్తారని ప్రశ్నించారు. బాబువి వట్టి కలలు అంటూ కొట్టి పారేశారు. చంద్రబాబు కలలకు అచ్చెన్న కలరింగ్ ఇస్తున్నారు అని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. బాబు ముమ్మారు సీఎం అయ్యారు. క్రికెట్ భాషలో హ్యాట్రిక్ అని అంటారు. దేనికైనా మూడు అన్నది ముగింపు పదమే. ఆ లెక్కన చూస్తే రెండవ హ్యాట్రిక్ అయితేనే నాలుగవ చాన్స్ అనుకోవాలి. పొలిటికల్ థియరీ చూసినా బాబుకు ఈసారి చాన్స్ ఉంటుందా లేదా అన్నది టెన్షన్ లో పెట్టేలాగానే బొత్స కామెంట్స్ ఉన్నాయి.