ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దెబ్బకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు బుర్ర పోయినట్టుంది. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థంకావడం లేదు. టీడీపీని 23 అసెంబ్లీ, 3 లోక్‌సభ సీట్లకు పరిమితం చేసిన నాయకుడిని పట్టుకుని ఫేక్ ముఖ్యమంత్రి అంటున్నారంటే, అచ్చెన్న మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని చేయాలనే డిమాండ్‌పై ఉత్తరాంధ్ర ఉప్పెనలా ఎగిసిపడడం టీడీపీని ఆందోళనకు గురి చేస్తోంది.
విశాఖ వద్దు, అమరావతి ముద్దు అంటున్న అచ్చెన్నాయుడికి రాజకీయంగా ఏమవుతుందోనని ముచ్చెమటలు పడుతున్నాయి. విశాఖ గర్జన విజయవంతం కావడాన్ని అచ్చెన్నతో పాటు టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. విశాఖ సముద్రం పొంగి రోడ్లపైకి వచ్చిందా? అనే రీతిలో నగరం జన ప్రవాహంతో నిండింది. సహజంగానే ఇది అచ్చెన్నాయుడి వెన్నులో వణుకుపుట్టిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జగన్‌రెడ్డి ఒక ఫేక్ సీఎం అని ఘాటు విమర్శ చేశారు. ఏపీని నలుగురు రెడ్లు దోచుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి జేఏసీ ఏర్పాటు చేస్తామని అచ్చెన్న చెప్పడం విశేషం. ఓటమి భయంతోనే ప్రజల మధ్య వైసీపీ విద్వేషాలు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన పెద్ద జోక్ కూడా చెప్పారు.
2014 – 2019 ఏపీకి సువర్ణ అధ్యాయమని చెప్పి నవ్వు పండించారు. సువర్ణ పాలన ఎవరికని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, నేతలకు తప్ప, జనానికి కాదని దెప్పి పొడుస్తున్నారు. చంద్రబాబు పాలన అద్భుతంగా సాగి వుంటే … ఘోరంగా ఎందుకు ఓడించారో కనీసం ఆత్మ విమర్శ చేసుకున్నారా? అని నిలదీస్తూ కామెంట్స్ చేయడం గమనార్హం.