ఇష్ట‌పూర్వ‌కంగానే ఎమ్మెల్యేతో ఆమె!

తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం క‌థ కంచికి చేరింది. టీడీపీ మ‌హిళా మండ‌లాధ్య‌క్షురాలిపై లైంగిక దాడి కేసు రాజీబాట‌లో న‌డుస్తున్న‌ట్టు గ‌తంలో చెప్పుకున్నాం. ఇప్పుడ‌దే జ‌రిగింది. ఆదిమూలం త‌న‌ను లైంగికంగా మూడు…

తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం క‌థ కంచికి చేరింది. టీడీపీ మ‌హిళా మండ‌లాధ్య‌క్షురాలిపై లైంగిక దాడి కేసు రాజీబాట‌లో న‌డుస్తున్న‌ట్టు గ‌తంలో చెప్పుకున్నాం. ఇప్పుడ‌దే జ‌రిగింది. ఆదిమూలం త‌న‌ను లైంగికంగా మూడు నాలుగు సార్లు వేధించార‌నే ఫిర్యాదులో నిజం లేద‌ని బాధితురాలు ఏపీ హైకోర్టుకు తెలిపింది. ఈ మేర‌కు ఆమె త‌ర‌పు న్యాయ‌వాది కోర్టుకు అఫిడ‌విట్ స‌మ‌ర్పించ‌డం గ‌మ‌నార్హం.

కోనేటి ఆదిమూలం త‌న‌ను లైంగికంగా వేధించాడ‌ని, చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తిరుప‌తి ఈస్ట్ పోలీస్‌స్టేష‌న్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత తిరుప‌తి రుయా ఆస్ప‌త్రిలో ఆమెకు వైద్య ప‌రీక్ష‌లు కూడా నిర్వ‌హించారు. మ‌రోవైపు టీడీపీకి రాజ‌కీయంగా న‌ష్టం జ‌రగ‌కుండా ఆదిమూలంపై స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. మ‌రోవైపు ఆమెతో రాజీ ప్ర‌య‌త్నాల‌కు పార్టీ పెద్ద‌లు చ‌ర్య‌లు తీసుకున్నారు.

పెద్ద మొత్తంలో డ‌బ్బు చేతులు మారిన‌ట్టు స‌మాచారం. చివ‌రికి లైంగిక వేధింపుల క‌థను సుఖాంతంగా ముగించారు. ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న అంశాల‌న్నీ అబ‌ద్ధాల‌ని, కేసు కొట్టేయాల‌ని హైకోర్టును బాధితురాలు కోర‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అయితే ఆదిమూలంతో ఇష్ట‌పూర్వ‌కంగానే గ‌డిపిన‌ట్టు త‌న‌ను తాను చెప్ప‌ద‌లుచుకున్నారా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. డ‌బ్బు కోస‌మే ఇదంతా చేసింద‌ని అనుకోవాల్సి వ‌స్తుంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదిలా వుండ‌గా కోనేటి ఆదిమూలంపై త్వ‌ర‌లో స‌స్పెన్ష‌న్‌ను ఎత్తివేయ‌నున్నార‌ని స‌మాచారం.

24 Replies to “ఇష్ట‌పూర్వ‌కంగానే ఎమ్మెల్యేతో ఆమె!”

  1. మరి అబద్ధాలు చెప్పి ప్రజలని, పోలీసులను తప్పుదోవ పట్టించిన ఆమెపై కోర్ట్ చర్యలు తీసుకోదా ???

  2. చట్టం న్యాయాలను ఇలాంటి బరి తెగించిన ఆడాళ్ళ కుట్రల కోసం ఉపయోగించు కోవటం సిగ్గు చేటు.

  3. జరిగిపోయింది ఎదో జరిగిపోయింది .. డబ్బులు ముట్టాయి కదా .ఇప్పటికైనా ఫుల్ వీడియో రెలీజ్ చేస్తే బాగుంటుందేమో .

  4. as usual

    పెద్ది రెడ్డి డబ్బుల కు అశపడ్డట్టు వుంది ..మొసపొయింది

    వెల కొట్లు వున్నా పిల్లికి బిక్షం వెయ్యని కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబం

  5. ఖిలాడి…black mailer it appears ..there should be a law to punish with double the punishment if misled so that victims can not be bought with money and only real victims will file case not blackmailers.. నిజం దేవుడి కెరుక!

Comments are closed.