కేంద్రం ప్రారంభించిన కొత్త పధకం అగ్నిపధ్ కోసం తాజా నియమకాలకు రంగం సిద్ధం అయింది. ఈ రోజు నుంచి ఈ నెల 31 దాకా విశాఖ వేదికగా భారీ రిక్రూట్మెంట్ జరుగుతోందె. దీనికి యానంతో పాటు క్రిష్ణా, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి ఏకంగా అరవై వేల మంది అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేస్తున్నారు.
విశాఖ లోని ఇందిరాగాంధీ స్టేడియంలో రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. ఇప్పటికే అభ్యర్ధులు అంతా పెద్ద ఎత్తున తరలివచ్చారు. తాము సైన్యంలో చేరి సత్తా చాటుతామని యువతరం ఉరకలు వేస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపధ్ కి ఎన్ని రకాల విమర్శలు వివాదాలు ఉన్నా దేశానికి సేవ చేయడానికి కండలు కరిగించడానికి యువత మాత్రం కట్టలు తెంచుకుంటోంది.
దేశ మాత సేవలో తరించాలని తెగ ఉత్సాహపడుతోంది. మరి అరవై వేల మందిలో ఎంతమందిని ఎంపిక చేస్తారో నాలుగేళ్ల అగ్నిపధ్ నియమకాల తరువాత కూడా సైన్యాన చేరి తుదిదాకా కొనసాగి ఎంతమంది తాము అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసుకుని వస్తారో చూడాలి.
ఇక విశాఖ జిల్లా అధికారులు అగ్నివీరుల ఎంపికకు సంబంధించి అని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి కఠిన పరీక్షలు అయినా ఎదుర్కోనేందుకు అభ్యర్ధులు కూడా రెడీ అయ్యారు. ఒక వైపు విశాఖలో వానలు కురుస్తున్న పరిస్థితులు ఉన్న వేళ నెత్తురు మండే యువతరం అగ్ని వీరులుగా దేశ సేవ కోసం నిప్పులు చిమ్ముతూ ముందుకు రావడం అభినందించ తగ్గ విషయం.