భారతీయ బిలియనీర్ బిజినెస్ మాగ్నెట్, స్టాక్ ట్రేడర్, ఇన్వెస్టర్ అయిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 62 ఏళ్ల వయసులో మరణించారు. ట్రేడర్‌గా చార్టెడ్ అకౌంటెంట్‌గా ఎంతో పేరుగడించిన ఆయన.. భారత్‌లోని అత్యంత సంపన్నుల్లో ఒకరు.
రాజస్థానీ కుటుంబానికి చెందిన రాకేష్, తండ్రి ఉద్యోగ రీత్యా ముంబైలో పెరిగారు. అతని తండ్రి ఆదాయపు పన్ను కమిషనర్‌గా ముంబై లో పనిచేశారు. కేవలం ₹ 5,000 పెట్టుబడితో కాలేజీ స్టూడెంట్ గా ఉండగానే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి.. తన ప్రయాణాన్ని ప్రారంభించారు. దేశంలో 36వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు.
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఇటీవల ఆగష్టు 7న ఆకాశా ఎయిర్‌తో విమానయాన పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఝున్‌ఝున్‌వాలా , పెట్టుబడిదారుడిగా కాకుండా, ఆప్టెక్ లిమిటెడ్ మరియు హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఛైర్మన్‌గా ఉన్నారు. ఇంకా అనేక భారతీయ సంస్థలో డైరెక్టర్ కూడా ఉన్నాడు.
ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణంతో పలువురు వ్యాపార వేత్తలు, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు.