పవన్ వ్యాఖ్యలకు అంబటి రాయుడు కౌంటర్!

ఎన్నో నెలలు వాయిదాలు వేసుకుంటూ వచ్చి తీరా తన తాను ఇష్టపడి తయారు చేయించుకున్న‌ బస్సుపై సీజన్ల వారిగా యాత్రలు మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ మొదటి సీజన్లో కుల మతాల గురించి మాట్లాడుతూ హడావుడి…

ఎన్నో నెలలు వాయిదాలు వేసుకుంటూ వచ్చి తీరా తన తాను ఇష్టపడి తయారు చేయించుకున్న‌ బస్సుపై సీజన్ల వారిగా యాత్రలు మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ మొదటి సీజన్లో కుల మతాల గురించి మాట్లాడుతూ హడావుడి చేశాడు. ఈ సీజన్ 2 లో కేవలం వలంటరీ వ్యవస్థనే ప్ర‌ధాన‌ అజెండాగా తీసుకొని తన నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పటికే ఆయ‌న వాఖ్య‌ల‌పై వలంటీర్లు మండిపడుతున్న నేప‌థ్యంలో.. తాజాగా ప్ర‌ముఖ క్రికెట‌ర్ అంబటి రాయుడు వాలంటీర్లకు బాసటగా నిలిచారు

ఓ స‌మావేశంలో అంబ‌టి రాయుడు మాట్లాడుతూ.. వలంటరీ వ్యవస్థ గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువేన‌ని.. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారు. వాటిని మనం పట్టించుకోకూడదని.. వలంటీర్లు అందరూ ధైర్యంతో ముందుకు వెళ్లాలంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వలంటరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని.. దేశంలో 70 సంవత్సరాల నుంచి జరగనది మన రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా జరుగుతోంద‌న్నారు. రాష్ట్రంలోని ప్రతి మనిషికి ఏది అందాలో అది వలంటరీ ద్వారా అందుతుందన్నారు.

క‌రోనా సమయంలో వలంటీర్లు తమ ప్రాణాన్ని ఫలంగా పెట్టి అందరికీ సేవలందించార‌ని.. జీవితాంతం ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తుపెట్టుకోవాలని.. ప్రజలకు మంచిగా సేవలందించే వలంటరీ వ్యవస్థ మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేదన్నారు. 

కాగా గ‌తంలో చంద్ర‌బాబు కూడా వ‌లంటీర్ల‌పై నోరు జారి త‌ర్వాత త‌న కొడుకు లోకేష్ ద్వారా టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన కూడా వలంట‌రీ వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగిస్తామ‌న్నారు. కానీ టీడీపీతో పొత్తు పెట్టుకొని ఎన్నిక‌ల‌కు వెళ్ల‌బోయే ప‌వ‌న్ మాత్రం త‌ను రెండు చోట్ల ఓడిపోయిన‌.. కేంద్ర ఇంటెలిజెన్స్ అంటూ పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడుతుండటం వింత‌గా ఉంది.