వైసీపీ, టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోంది. ప్రధాన మీడియా టీడీపీ వైపు ఉంది. దీంతో ఆ మీడియాలో కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా వచ్చే అవకాశం లేదు. వైసీపీకి సొంత పత్రిక ఉన్నప్పటికీ, వ్యతిరేక మీడియా రాసిన మేరకు కూడా ప్రభుత్వంపై కథనాలు వచ్చే పరిస్థితి లేదు. ఇందుకు తాజా ఉదాహరణ విశాఖ పోర్ట్‌లో 25 వేల కిలోల గంజాయి వైసీపీ హయాంలో పట్టుబడిందనే ప్రచారంలో వాస్తవం లేదని సీబీఐ చెప్పినా, సొంత పత్రికలో వెంటనే రాయకపోవడం.
ఈ నేపథ్యంలో ఇదే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న పోస్టు పెట్టినా, వెంటనే పోలీసుల నుంచి నోటీసులు లేదా అరెస్ట్‌లు. ఇదే వైసీపీ నేతలపై ఎన్ని రకాలుగా పోస్టింగ్‌లు పెట్టినా, చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఇదే విషయమై మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రతిరోజూ నెత్తీనోరు కొట్టుకుంటున్నారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ నాయకుడు వైఎస్ జగన్ ఫొటోలను లోకేశ్ ఆధ్వర్యంలో మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. టీడీపీ సోషల్ మీడియాలో తమపై అభ్యంతరకర పోస్టులపై పట్టాభిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. తన కుటుంబ సభ్యులపై కూడా టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినట్టు అంబటి వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కు లేదన్నారు. పోలీసుల తీరుపై శాంతియుతంగా నిరసన తెలుపుతామన్నారు.
ఆ దొరికింది కూడా కొటయ్య చౌదరి గారిది కదా మన పత్రిక లో ఆనాడే రాసాం కదా రాంబాబు గారు..
నిత్యం చచ్చే వాడికి ఏడ్చేవాడు ఉండడు రోజు అబద్దాలు వంకర కధనాలు రాస్తుంటే సాక్షి పత్రిక ఒక రోజు నిజం రాసిన నమ్మరు ఇది నాన్న పులి ఆటలాగా జరిగింది ఇది అబద్దాలు రాసె రోత పత్రికకు ఈనాడుకు వున్నా వ్యత్యాసం