ఆస్ప‌త్రిలో చేరిన మంచు మ‌నోజ్‌

విల‌క్ష‌ణ న‌టుడు మోహ‌న్‌బాబు త‌న‌యుడు, హీరో మంచు మ‌నోజ్ బంజారాహిల్స్‌లోని ఆస్ప‌త్రిలో చేరారు.

విల‌క్ష‌ణ న‌టుడు మోహ‌న్‌బాబు త‌న‌యుడు, హీరో మంచు మ‌నోజ్ బంజారాహిల్స్‌లోని ఆస్ప‌త్రిలో చేరారు. కాలికి గాయం కావ‌డంతో న‌డ‌వ‌లేని స్థితిలో భార్య మౌనిక‌తో క‌లిసి ఆయ‌న ఆస్ప‌త్రికి వెళ్లిన‌ట్టు వార్త‌లొస్తున్నాయి. ఆస్తుల విష‌య‌మై కుటుంబ స‌భ్యుల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింద‌ని స‌మాచారం.

ఈ సంద‌ర్భంగా భౌతిక‌దాడుల‌కు వ‌ర‌కూ వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. జ‌ల్‌ప‌ల్లిలో ఇంట్లో వుండ‌గా మోహ‌న్‌బాబు అనుచ‌రులు మ‌నోజ్‌పై దాడి చేయ‌డంతో కాలికి తీవ్ర గాయ‌మైన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న‌పై దాడికి సంబంధించి మ‌నోజ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. మంచు మోహ‌న్‌బాబు స్కూల్‌కు సంబంధించిన వారే త‌న‌పై దాడి చేసిన‌ట్టు మ‌నోజ్ చెబుతున్నారు.

సెల‌బ్రిటీ కుటుంబం కావ‌డంతో ఆస్తుల గొడ‌వ తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. చాలా కాలంగా మంచు కుటుంబంలో ఆస్తుల వివాదం న‌డుస్తోంది. గ‌తంలో మంచు విష్ణు, మ‌నోజ్ మ‌ధ్య కూడా గొడ‌వ జ‌రిగిన‌ట్టు ఒక వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. తాజాగా తండ్రీత‌న‌యుల మ‌ధ్య గొడ‌వైన‌ట్టు సాగుతున్న ప్ర‌చారాన్ని మోహ‌న్‌బాబు ఖండిస్తున్నారు. ఇందులో నిజం లేద‌ని ఆయ‌న అంటున్న‌ప్ప‌టికీ, మ‌నోజ్‌కు గాయాలు కావ‌డం, ఆస్ప‌త్రిలో చేర‌డంతో అస‌లేం జ‌రిగిందో అర్థం చేసుకోవ‌చ్చ‌ని జ‌నం అంటున్న మాట‌.

4 Replies to “ఆస్ప‌త్రిలో చేరిన మంచు మ‌నోజ్‌”

Comments are closed.