సంసారం గురించి ఓ తిరుగుబోతు…!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. వారాహి యాత్రలో భాగంగా నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం వైఎస్ జ‌గ‌న్‌, వైసీపీ నేత‌ల‌పై ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెల‌రేగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌పై…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. వారాహి యాత్రలో భాగంగా నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం వైఎస్ జ‌గ‌న్‌, వైసీపీ నేత‌ల‌పై ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెల‌రేగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌పై మంత్రి గుడివాడ పంచ్‌లు విసిరారు. ప‌వ‌న్‌ను తిరుగుబోతుతో పోల్చ‌డం గ‌మ‌నార్హం. ఒక రాజ‌కీయ పార్టీ అధినేత‌గా అధికారంలోకి వ‌స్తే ప్ర‌జ‌ల‌కు ఏం చేస్తానో చెప్పాలే కానీ, ప్ర‌తిసారీ ముఖ్య‌మంత్రి వైఎస్‌ను విమ‌ర్శించ‌డమే ప‌నిగా మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న రాజ‌కీయ పంథాను మార్చుకోక‌పోతే ప్ర‌జ‌లే చెప్పులు చూపిస్తార‌ని మంత్రి హెచ్చ‌రించారు. ఎన్సీపీ, ఎన్సీఆర్‌బీకి తేడా తెలియ‌ని వ్య‌క్తి ప‌వ‌న్ అని ఆయ‌న ఎద్దేవా చేశారు. ప‌వ‌న్ ఒక సైకోలా మాట్లాడుతున్నాడ‌ని త‌ప్పు ప‌ట్టారు. ప‌వ‌న్ హావ‌భావాలు ఉన్మాదిలా ఉన్నాయ‌ని మంత్రి విమ‌ర్శించారు.

వాలంటీర్లపై పవన్‌ మాట్లాడిన తీరు బాధాకరమ‌న్నారు. ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి మ‌ధ్య వార‌ధిగా వాలంటీర్లు ఉన్నార‌న్నారు. ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేస్తున్న వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేస్తామ‌ని చెప్పాల‌ని మంత్రి డిమాండ్ చేశారు. దాదాపు రూ.2.50 ల‌క్ష‌ల మంది వాలంటీర్లు ప‌ని చేస్తున్నార‌న్నారు. వాలంటీర్లలో 60 శాతం మహిళలు ఉన్నార‌న్నారు. వాళ్ల‌పై నిందలు వేయడా నికి పవన్‌కు బుద్ధి ఉందా? అని ప్ర‌శ్నించారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు చేశార‌ని గుర్తు చేశారు. వాలంటీర్లకు పవన్‌ క్షమాపణలు చెప్పాల‌ని మంత్రి డిమాండ్ చేశారు.

కార్య‌క‌ర్త‌లేమో జ‌న‌సేనాని అనుకుంటుంటే, ఆయ‌న మాత్రం తాను చంద్ర‌బాబుకు సేనాధిప‌తి అని నిరూపించుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. అందుకే జ‌న‌సేన పార్టీ ఎందుకు, డ‌బ్బులు తీసుకుని ఖ‌ర్చు చేయ‌డం ఎందుకు? టీడీపీలో విలీనం చేసేయొచ్చు క‌దా? విలీనం చేస్తే విడ‌త‌లుగా డ‌బ్బు రాద‌ని ఆలోచిస్తున్నావా? అని ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ బ్యాన‌ర్‌ని ఎప్ప‌టిక‌ప్పుడు చంద్ర‌బాబు కొంటూ వుండాల‌ని మంత్రి అన్నారు. సినిమా భాష‌లో చెబితేనే ప‌వ‌న్‌కు అర్థ‌మ‌వుతుంద‌ని ఎద్దేవా చేశారు.

పదేళ్లైనా పవన్‌ రాజకీయాల్లో ఎదగలేద‌న్నారు. అవసరాలకు తల్లి, రాజకీయాల కోసం భార్య పేరు ఉపయోగిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. పవన్‌ తల్లిని అవమానించింది టీడీపీ నేతలే కదా? వారిని కాకుండా త‌మ‌ను విమర్శించడం దేనిక‌ని మంత్రి నిల‌దీశారు.

కమెడియన్లు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులు కూడా ఎమ్మెల్యేలు అయ్యార‌న్నారు. పవన్‌ ఎందుకు ఎమ్మెల్యే అవ్వలేద‌ని ప్ర‌శ్నించారు. వారాహి పార్ట్‌ 2లో భాగంగా పొలిటికల్‌ సైడ్‌ హీరో రాజకీయాలు మాట్లాడార‌న్నారు. సంసారం, కాపురాల  గురించి ఓ తిరుగుబోతు మాట్లాడితే ఎలా వుంటుందో, రాజ‌కీయాల గురించి  పవన్‌ మాట్లాడితే అట్లా వుంటుంద‌ని ఎద్దేవా చేశారు. నిరాశ‌నిస్పృహ‌ల నుంచి వ‌చ్చిన ఓ ఉన్మాది మాట‌ల్ని మ‌నమంతా విన్నామ‌న్నారు. ప‌వ‌న్ మాట‌ల‌కు ఆయ‌న కిరాయి కార్య‌క‌ర్త‌ల‌కి, అభిమానులకి న‌చ్చుతాయ‌న్నారు.