నిన్న అంబానీ.. నేడు అదానీ

విశాఖ మా ఫేవరేట్ బిజినెస్ స్పాట్ అనుకుంటూ కార్పోరేట్ దిగ్గజాలు బిగ్ షాట్స్ ఒకరి తరువాత ఒకరు ముంబై ఫ్లేటెక్కి సరాసరి వైజాగ్ లో ల్యాండ్ అయిపోతున్నారు. ఇప్పటికి సరిగ్గా రెండు నెలల క్రితం…

విశాఖ మా ఫేవరేట్ బిజినెస్ స్పాట్ అనుకుంటూ కార్పోరేట్ దిగ్గజాలు బిగ్ షాట్స్ ఒకరి తరువాత ఒకరు ముంబై ఫ్లేటెక్కి సరాసరి వైజాగ్ లో ల్యాండ్ అయిపోతున్నారు. ఇప్పటికి సరిగ్గా రెండు నెలల క్రితం విశాఖలో ప్రపంచ పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తే తన పదహారు మంది డైరెక్టర్లను వెంటేసుకుని ప్రత్యేక విమానంలో ముఖేష్ అంబానీ విశాఖకు తరలివచ్చారు.

ముఖ్యమంత్రి జగన్ తో కలసి వేదిక పంచుకుని విశాఖ సహా ఏపీలో పెట్టుబడులకు నా హామీ అంటూ ప్రకటించారు. ఇపుడు గౌతం అదానీ వంతు వచ్చింది. ఈ నెల  3న విశాఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అదానీ డేటా సెంటర్ కి శంకుస్థాపన జరగనుంది.

ఈ కార్యక్రమంలో అదానీ పాల్గొనడానికి వస్తున్నారు. ఆయనతో పాటు మరో ముప్పయి మంది బృందం కూడా విశాఖ వస్తోంది. అదానీ సమక్షంలో విశాఖ పారిశ్రామికభివృద్ధి మీద జగన్ మరోసారి నగర ప్రజలకు పూర్తి భరోసా ఇవ్వనున్నారు.

విశాఖ కేంద్రంగా అభివృద్ధికి వైసీపీ శ్రీకారం చుట్టింది. రెండు నెలల వ్యవధిలో కార్పోరేట్ దిగ్గజాలు ముఖేష్ అంబానీ గౌతం అదానీ విశాఖ రావడం అంటే అది వైసీపీ ప్రభుత్వ విజయంగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. విశాఖ సమీప భవిష్యత్తులో దేశంలోనే నంబర్ వన్ సిటీ అవుతుందని అంటున్నారు. జగన్ గురించి విశాఖ గురించి ఏపీలో తమ బిజినెస్ విస్తరణ గురించి గౌతం అదానీ ఏమంటారో ఆయన మాటల్లోనే వినేందుకు అంతా ఎదురుచూస్తున్నారు.