ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడుపై అపారమైన మమకారం పెంచుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్‌లు ఆపి మరీ నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పెద్ద హైడ్రామా సృష్టించారు. పవన్ హైడ్రామా పై మంత్రి అంబటి రావు తనదైన శైలిలో సెటైర్ వేశారు.
'అవినీతి బాబు ని అరెస్ట్ చేస్తే నీకు ఇదేమి కర్మ బ్రో' అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పవన్ ఎప్పుడు ఏం మాట్లాడినా దాని తనకు సరైన కౌంటర్ ఇచ్చే వారిలో వైసీపీ నుండి మంత్రి అంబటి రాంబాబు ముందు వరుసలో ఉంటారు అనే విషయం తెలిసిందే. నిన్న కూడా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి చేశారని దానికి ఆయన శిక్ష అనుభవించాల్సిందే అంటూ తేల్చి చెప్పారు.
కాగా నిన్న రాత్రి చంద్రబాబు కలిసేందుకు వెళ్తున్న పవన్‌ను పోలీసులు అడ్డుకోవడంతో.. పోలీసుల వైఖరికి నిరసనగా పవన్ రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. జనసేన పార్టీ నాయకులకు ఎటువంటి సమస్య వచ్చిన కాస్త లేటుగా ట్వీట్ చేస్తారమో గానీ తన దత్తత తండ్రి చంద్రబాబు నాయుడుకు ఎటువంటి చిన్న సమస్య వచ్చిన వీడియోలు రీలిజ్ చేస్తు చంద్రబాబుకు సపోర్ట్ చేస్తుంటారు.
నిన్న పవన్ సాయత్రం నుండి చేసిన ఓవరాక్షన్‌ను చూసిన జనాలు కూడా వైసీపీ అంటున్నట్లు పవన్ నిజంగా చంద్రబాబు మనిషే అని అనుకుంటున్నారు. మరోవైపు ఎవరు ఎన్ని చెప్పినా ఎవ్వరు ఎటువంటి విమర్శలు చేసినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడును వదులుకునే ప్రసక్తే లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.