ఎంపీ సీటు మీద పారిశ్రామికవేత్తల కన్ను!

ఎంపీ సీటు అంటే పారిశ్రామికవేత్తలే ఎక్కువ ఆసక్తి చూపుతారు. రాజకీయ పార్టీలు సైతం వారి వైపే మొగ్గు చూపుతాయి. అంగబలం అర్ధబలం అంటూ లెక్కలేవో చెబుతూ చివరికి బిగ్ షాట్స్ ని తెచ్చి పార్టీ…

ఎంపీ సీటు అంటే పారిశ్రామికవేత్తలే ఎక్కువ ఆసక్తి చూపుతారు. రాజకీయ పార్టీలు సైతం వారి వైపే మొగ్గు చూపుతాయి. అంగబలం అర్ధబలం అంటూ లెక్కలేవో చెబుతూ చివరికి బిగ్ షాట్స్ ని తెచ్చి పార్టీ టికెట్ ఇస్తారు. ఈ ఆచారం ఇటీవల కాలంలో ఎక్కువ అయింది.

దాంతో ఎంపీ సీటు అంటే మనం మోయలేని భారం అన్నట్లుగా రాజకీయ నేతలు భావిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు టికెట్ అడిగినా హై కమాండ్ మాత్రం చూద్దాం అంటూ దాటవేసే ధోరణితో ఉండడం వెనక బిజినెస్ పీపుల్ కోసం సెర్చింగ్ అన్నది ఉంది అంటున్నారు.

అనకాపల్లి ఎంపీ సీటు కోసం పారిశ్రామిక వేత్తలు చూస్తున్నారు. ఇప్పటికే దిలీప్ చక్రవర్తి ఈ సీటు కోసం టీడీపీ జనసేన నేతలకు టచ్ లో ఉంటున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే అన్ని రకాలుగా బరువు బాధ్యతలు మోస్తారు అన్నది కూడా పార్టీల ఆలోచనగా ఉంది అంటున్నారు.

చాలా కాలంగా ఇదే అనకాపల్లి సీటు కోసం ముత్యాల వెంకటేశ్వరరావు షార్ట్ కట్ లో ఎంవీఆర్ అనే పారిశ్రామికవేత్త చూస్తున్నారు. ఆయన గత రెండేళ్ళుగా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో సామాజిక సేవా కార్యక్రమాలను విరివిగా చేసుకుంటూ పోతున్నారు.

అన్ని రాజకీయ పార్టీలతో ఆయన బాగానే ఉంటున్నారు. ఏ పార్టీ అయినా పర్వాలేదు టికెట్ ఇచ్చినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు. టీడీపీ అయితే దిలీప్ చక్రవర్తి వైపు చూస్తోంది. వైసీపీ కూడా పార్టీకి చెందిన వారి నుంచే అభ్యర్ధిని ప్రకటించాలని భావిస్తోంది. రెండవ ఆలోచన ఉంతే ఎంవీఆర్ కూడా రేసులో ఉన్నట్లే లెక్క అంటున్నారు.

తాజాగా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించి అభినందనలు తెలియచేశారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఇంకా మరికొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా అనకాపల్లి మీదనే గురి పెట్టారు. లక్ ఎవరికి ఏ విధంగా కలసి వస్తుందో చూడాలి.