రాయలసీమ మొత్తం పాదయాత్ర చేసిన నారా లోకేష్‌కు ఎక్కడ పెద్దగా సమస్య లేకుండా యాత్ర పూర్తి చేశారు. తీరా నెల్లూరులోకి ఎంటర్ అవ్వగానే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తగులుకున్నారు. రోజు ప్రెస్ మీట్‌లు పెట్టి మరి లోకేష్ పరువు తీస్తున్నారు. నిన్న లోకేష్ తనను సిల్లీ బచ్చా, హాఫ్ నాలెడ్జ్ అంటూ కౌంటర్ ఇవ్వడంతో.. ఇవాళ అనిల్ లోకేష్‌పై అదే రీతిలో సమాధానం చెప్పారు.
అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. నేను సిల్లీ బచ్చా, హాఫ్ నాలెడ్జ్ గాడినే కాకపోతే నీలాగా మాలోకం మాత్రం కాదన్నారు. తండ్రి, తాతలు ముఖ్యమంత్రులుగా పని చేసిన ఎమ్మెల్యేగా కూడా గెలవాని లోకేష్ తన స్థాయి గురించి మాట్లాడటం అవివేకం అంటూ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్, నారా ఫ్యామిలీ లేకుంటే లోకేష్ కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేడన్నారు. దమ్ముంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో నారా లోకేష్ తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు.
తనను ఓడించడానికి 200 కోట్లు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని.. నేను ఓడిపోతే రాజకీయాల నుండి వెళ్లిపోతానని గెలిస్తే లోకేష్ రాజకీయాలు వదులుకుంటారా అంటూ సవాల్ విసిరారు. లోకేష్ నెల్లూరు వదిలి వెళ్లే వరకు ఆయన మాట్లాడిన ప్రతి మాటకు సమాధానం ఇస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే తన ఛాలెంజ్ స్వీకరించాలన్నారు.
కాగా నిన్న లోకేష్ ఓ సభలో మాట్లాడుతూ.. తనతో చర్చకు రావాలని అనిల్ సరదా పడుతున్నారని, దమ్ముంటే చర్చిద్దాం రా అని పిలిచారు. ఇద్దరు నేతలు కేవలం మాటలకే పరిమితం అయ్యే బదులు ఒక వేదికపై చర్చిస్తే మంచిదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అనిల్ చర్చకు వచ్చిన లోకేష్ వచ్చే అవకాశం లేదంటూన్నారు వైసీపీ నేతలు. ఎందుకంటే లోకేష్ తెలుగు, ఆయన రాజకీయ పరిజ్ఞానం అందరికి తెలిసిందే కదా.