అనితా రాజీనామా చేయాల్సిందే!

ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు హోం మంత్రి అనిత పదవికి ఎసరు వచ్చేలా ఉంది. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీలో లా అండ్ ఆర్డర్ బాగా లేదని అన్నాక…

ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు హోం మంత్రి అనిత పదవికి ఎసరు వచ్చేలా ఉంది. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీలో లా అండ్ ఆర్డర్ బాగా లేదని అన్నాక ఇక ఎందుకు ఆలస్యం అనిత రాజీనామా చేయాల్సిందే అని వైసీపీ డిమాండ్ చేస్తోంది. తాము మొదటి నుంచి అనిత హోంమంత్రిగా పూర్తిగా విఫలం అయ్యారని వైసీపీ మొదటి నుంచి చెబుతోంది అని వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అంటున్నారు.

ఇపుడు కూటమి ప్రభుతంలో కీలకంగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా ఒప్పుకున్న తరువాత రాజీనామా చేయడమే ఉత్తమమని అనితకు ఆమె సూచించారు. ఇది నైతికతకు సంబంధించిన అంశంగా చూస్తే అనిత వెంటనే తన పదవిని వదులుకుంటారని ఆమె అంటున్నారు. ఏపీలో అయిదు నెలల పాలనలో కూటమి ప్రభుత్వం మొత్తం విఫలం అయింది అని ఆమె అన్నారు. మహిళల మీద దాడులతో ఏపీలో శాంతి భద్రతలు ప్రశ్నార్ధకం అయ్యాయని ఆమె ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ అప్పట్లో ఎన్నో విమర్శలు చేశారని 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని కూడా ఆరోపించారని ఆమె గుర్తు చేశారు. ఇపుడు అయిదు నెలల పాలనలో ఎంతమంది మహిళలను వెనక్కి రప్పించారని ఆమె కూటమి ప్రభుత్వాన్ని పవన్ ని ప్రశ్నించారు.

గత ప్రభుత్వం మీద అదే పనిగా విమర్శలు చేస్తూ ప్రీతి సుగాలీ గురించి ఎన్నోసార్లు మాట్లాడిన పవన్‌ కళ్యాణ్ ఆమెకు ఏమి న్యాయం చేసారని వరుదు కళ్యాణి నిలదీశారు. చంద్రబాబు అనుభవం కలిగిన వ్యక్తి అని ఎన్నికల ముందు ప్రచారం చేసిన పవన్ కల్యాణ్ ఇపుడు అదే బాబు ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ బాగా లేదని అంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు.

శాంతి భద్రతలు దెబ్బ తింటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోం మంత్రి సహా కూటమి ప్రభుత్వం మొత్తం బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఏపీలో చక్కని పాలన అందిస్తామని మహిళలకు రక్షణగా నిలుస్తామని ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా చేసిందేంటో చెప్పాలని ఆమె కోరారు. ఈ విమర్శలు ఎలా ఉన్నా అనితను మాత్రం అర్జంటుగా రాజీనామా చేయమని వైసీపీ మహిళా నేత పెద్ద డిమాండ్ నే చేశారు.

9 Replies to “అనితా రాజీనామా చేయాల్సిందే!”

  1. ముఠా కక్షలు, వ్యాపార, వ్యక్తిగతమైన కక్షల కోసల హత్యలు జరిగితే రాజకీయ హత్యలుగా రంగులు పూసి జంతర్ మంతర్ వద్ద ఒక గంట నిరాహార దీక్ష చేసిన వారు మరి ఆడవారిపై ఇన్ని ఘోరాలు జరుగుతుంటే దేశంలోని కూటముల మద్దతును కూడగట్టి ఢిల్లీ వీధుల్లో ఎండగట్టవచ్చుగా…! చాచిన వారికి vote హక్కు లేదన్నా? లేక మేనల్లుళ్లు, మేనకోడళ్లతో అవసరం లేకనా?

  2. Anitha is unfit to be HM. He has never shown any concern for the plight of fellow women. This portfolio needs tough and action oriented person and not the dummies.

  3. హూ ఈజ్ థిస్ జంబల్ హాట్ లేడీ?

    (హాట్ అంటే నిజంగా హాట్ అనుకునేరు..)

Comments are closed.