ఆయనే లేకపోతే చంద్రబాబు రాజకీయమే లేదు

ఈ రోజున తెలుగు రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా వెలుగుతున్న చంద్రబాబు రాజకీయ జీవితం తరచి చూస్తే ఆయనను ఆదరించి ముందుకు నడిపించిన వారు ఎంతో మంది కనిపిస్తారు అని ఆయన గురించి ఎరిగిన వారు…

ఈ రోజున తెలుగు రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా వెలుగుతున్న చంద్రబాబు రాజకీయ జీవితం తరచి చూస్తే ఆయనను ఆదరించి ముందుకు నడిపించిన వారు ఎంతో మంది కనిపిస్తారు అని ఆయన గురించి ఎరిగిన వారు అంటారు. చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రబాబుకు రాజకీయంగా సాయం చేసిన వారు ఆయనను తీర్చిదిద్దిన వారుగా రాజగోపాలనాయుడుని చెబుతారు.

ఆయన కుమార్తె రాష్ట్ర మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తన రాజకీయ జీవితం గురించి రాసిన స్వీయ చరిత్రను విశాఖలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హాజరైన రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అరుణకుమారి రాసిన పుస్తకంలో అన్నీ అక్షర సత్యాలే ఉన్నాయని అన్నారు.

ఆమె తండ్రి రాజగోపాలనాయుడు చిత్తూరు జిల్లాలో రాజకీయ దిగ్గజ నేతగా నిలిచారు అని కొనియాడారు. ఆయన గురించి ఎన్నో విషయాలు పుస్తకంలో ఉన్నాయని చెప్పారు. రాజగోపాలనాయుడు లేకపోతే చంద్రబాబు రాజకీయ జీవితమే లేదు అని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆయన కుమార్తెగా దగ్గరుండి అన్నీ చూసిన గల్లా అరుణకుమారి రాసిన స్వీయ చరిత్రలో చంద్రబాబు గురించి 44 సార్లు ప్రస్తావన వచ్చిందంటే రాజగోపాలనాయుడు లేకపోతే బాబు పొలిటికల్ కెరీర్ లేదనే విషయం అందరికీ అర్ధం అవుతుందని యార్లగడ్డ అన్నారు.

చిత్తూరు జిల్లా రాజకీయాలలో నిబద్ధత కలిగిన వారు రాజగోపాలనాయుడు అని అన్నారు. ఆయన కుమార్తెగా అరుణ కుమారి కూడా అంతటి పేరు తెచ్చుకున్నారని అన్నారు. యార్లగడ్డ ఈ విషయాలు చెప్పడం ఒక ఎత్తు అయితే రాజగోపాలనాయుడు లేకపోతే బాబు రాజకీయమే లేదు అని చెప్పడం మరో ఎత్తు. ఈ పుస్తకంలో బాబు గురించి 44 సార్లు ప్రస్తావన వచ్చిందంటే ఆయన రాజకీయ జీవితం తొలి రోజుల గురించిన అంశాలు ఎన్నో ఉండి ఉంటాయని అంటున్నారు.

ఈ పుస్తకం రాజకీయంగా ఇపుడు ఆసక్తిని రేపుతోంది. ఈ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడిన అరుణకుమారి వర్తమాన రాజకీయాలు భ్రష్టు పట్టాయని చెప్పడం విశేషం. అందుకే తన సభకు రాజకీయ నేతలను ఎవరినీ పిలవవద్దు అని సూచించాను అని ఆమె అన్నారు.

13 Replies to “ఆయనే లేకపోతే చంద్రబాబు రాజకీయమే లేదు”

  1. అది మొత్తం చదివి మ.-.హా మె.-.త గాడి మీద ఎమన్నా ఉంటె వదిలెసి, చంద్రబాబు మీద ఎమన్నా రాస్తె మాత్రం కొడి గుడ్డు మీద ఈకలు పీకుదువులె!

  2. అది మొత్తం చదివి మ.-.హా మె.-.త గాడి మీద ఎమన్నా ఉంటె వదిలెసి, చంద్రబాబు మీద ఎమన్నా రాస్తె మాత్రం కొ.-.డి గు.-.డ్డు మీద ఈకలు పీకుదువులె!

  3. ప్రతి వ్యక్తి ఎదగటానికి ఎవరో ఒకరి సహాయం వుంటుంది..అది సహజ ప్రకృతి ధర్మం, ఇది మంచే కానీ అదేదో తప్పు గా రాసేవాళ్ల కి ఇలా కింద విధంగా రాయాలి.

    .

    మహా మేత వాళ్ల తాత రెండో పెళ్లి చేసుకోకుండా ఉండుంటే..?

    .

    లెవెనోడికి మేత శవం లేకపోతే రాజకీయమే లేదుగా..?

Comments are closed.