మాట జారితే వెనక్కు తీసుకోవడం కష్టం. ఈ చిన్న లాజిక్ ను నటి కస్తూరి మిస్సయింది. తెలుగు ప్రజలపై చేసిన జుగుప్సాపర వ్యాఖ్యలు ఇప్పుడు ఆమెను చుట్టుకున్నాయి. చెన్నైలో తెలుగు సంఘాలతో పాటు, తెలుగు రాష్ట్రాల్లోని చాలా సంఘాలు ఇప్పుడు కస్తూరిపై దుమ్మెత్తి పోస్తున్నాయి.
ఊహించని విధంగా వివాదంలో చిక్కుకున్న కస్తూరి, కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టుకుంది. ఆమెకు వివాదాలు కొత్త కాదు. కాకపోతే తాజా వ్యాఖ్యలు 3 రాష్ట్రాలకు పాకడంతో, ఇప్పుడామె తన తప్పును కవర్ చేసుకోలేక కిందామీద పడుతోంది.
ఇంతకీ ఏం జరిగింది..
ఆదివారం చెన్నైలోని ఎగ్మూర్ లో బ్రాహ్మణుల నిరసన కార్యక్రమం జరిగింది. తమిళనాడులోని డీఎంకే సర్కారు తమ హక్కులను కాలరాస్తోందని, తమను ఎదగనీయకుండా చేస్తోందని ఆరోపిస్తూ వాళ్లు పెద్ద ర్యాలీ తీశారు. అందులో కస్తూరి కూడా పాల్గొంది. పనిలోపనిగా మైక్ అందుకుంది.
డీఎంకే నేతల్ని విమర్శించే క్రమంలో తెలుగు ప్రజలపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 300 ఏళ్ల కిందట అంతఃపురంలోని రాణులకు సేవ చేసేందుకు తెలుగువారు తమిళనాడుకు వచ్చారట. కొన్నాళ్లకు వాళ్లే తమది తమిళ జాతి అని చెప్పుకున్నారట. అంతకు ముందు నుంచే ఉన్న బ్రాహ్మణులు తమిళ జాతి కాదా అని ఆమె ప్రశ్నించారు.
భగ్గుమన్న తెలుగు సంఘాలు
ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో తెలుగు సంఘాలు భగ్గుమన్నాయి. చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందంటూ కొంతమంది కస్తూరిపై దుమ్మెత్తిపోస్తున్నారు. పరిస్థితి చేయి దాటిందని గ్రహించిన కస్తూరి, ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. తెలుగు, తమిళ్ తనకు రెండు కళ్లు అన్నారామె.
తన వ్యాఖ్యల్ని కొంతమంది వక్రీకరించారని ఆరోపించిన కస్తూరి.. తన ఇంట్లో అత్తమామ తెలుగు మాట్లాడతారని, తెలుగు ప్రజలు తనను తమ కోడలిగా ఆదరించారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
తెలిసో తెలియకో కొంతమంది తన వ్యాఖ్యల్ని వక్రీకరించి, తెలుగు రాజకీయాల్లోకి లాగారని.. ఇకపై తను తెలంగాణ, ఆంధ్రా రాజకీయాల్లోకి జంప్ చేస్తానని ఆమె ప్రకటించారు. తమిళనాట రాజకీయాల్లోకి తానింకా పూర్తి స్థాయిలో అడుగుపెట్టలేదని, అంతకంటే ముందు తెలుగు రాజకీయాల్లో కాలుమోపుతానని కస్తూరి ప్రకటించడం విశేషం.
GA garu TDP ni tidithe kada ravali???🥱
వాడి భయ్యం అదే. ఆమె ఎక్కడ టీడీపి లోకి వస్తుందో అని ముందరనుంచే జాగ్రత్త అన్నమాట
నిన్ను ఆంధ్ర రాజకీయాల్లోకి ఆహ్వానించే వాళ్ళు ఎవరు తల్లీ? తెలుగు వారిని, తెలుగు జాతిని కించపరిచే వ్యాఖ్యలు చేసిన మిమ్ములను తెలుగు వాళ్ళు ఎలా సమర్థిస్తారు?
One week yedo oka party media lo anukulam ga articles raaste saripoye. Aavide mana state ni bagu cheyyagaladu ane range lo covering ichhi politics ki teesukostaru. Jagan lokesh vachhinattu
Call boy jobs available 9989793850
Akkada bro
Illanti vallaku movies lo avakasam ivvakandi ivida serials banne cheyandi
Elanti vallanu ban cheyyali
She never commented that’s Tamilnadu DMK IT team does all. Happen to all. Periyar grp always there to destabilize. Udayanidhi directly on Danathsna dharms he commented and no one took seriously. She is highly educated snd Her father is IIT processor
Bhane covering istunnave neku caste important or Telugu jati important
vc estanu 9380537747
Hi
Already Arava batch ki brahmins ante padadu and chala kopam. Ide malli Telugu valla meda padi yediste yemi labham
అమె మాట్లాడింది తమిళులుగా చెలామణి అవుతున్న తెలుగు వారైన రామస్వామి నాయకర్, కరుణానిధి కుటుంబం, వైగో వంటి వారి గురించి.
వాళ్లు తెలుగుభాషకు నష్టం చేసారు.
ఆమె వ్యాఖ్యలను తెలుగు వారు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు.