తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత బాధను ఎవరైనా వెంటనే పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. దిగంబరంగా ఎదురుగా ఎవరైనా వస్తే తమ పరిస్థితి ఏంటని ఆవేదన చెందుతున్నారు. అప్పుడు చూడలేక ఏం చేయాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మగవాళ్లెవరో బిత్తల తమ ఎదురుగా వస్తారనే ఆలోచనలు అనితకు ఎందుకు వస్తాయో ఎవరూ అడగకూడదు. అడిగితే ఆమెకు కోపం వస్తుంది. ఎంతసేపూ తాను మాట్లాడిందే వినాలనే అహంకారం ఆమె మాటల్లో కనిపిస్తూ వుంటుంది.
తాజాగా టీడీపీ మార్ఫింగ్ గుట్టును రట్టు చేసిన ఏపీ సీఐడీని కూడా ఆమె అట్లే ప్రశ్నిస్తోంది. తమ నివేదికపై ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం సీఐడీకి ఏముందని అనిత ప్రశ్నించి తన నైజాన్ని చాటుకున్నారు.
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పుణ్యాన తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత బాగా పాపులర్ అయ్యారు. మాధవ్ న్యూడ్ వీడియో నకిలీనా? కాదా? అనే సంగతి తేల్చేందుకు ఆమె అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో మాధవ్ వీడియోను అమెరికాకు కూడా పంపి రెండు రోజుల్లో నివేదిక కూడా తెప్పించుకున్నారు. మాధవ్ వీడియో ఒరిజినల్ అని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభితో కలిసి ఆమె మీడియా ముఖంగా తేల్చి చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం ఊరుకుంటుందా? అబ్బే తగ్గేదేలే అని సదరు టీడీపీ నివేదిక కూపీ లాగింది. టీడీపీ ఫోరెన్సిక్ నివేదిక ఫేక్ అని ఏపీ సీఐడీ చావు కబురు చల్లగా చెప్పింది. దీంతో వంగలపూడి అనిత మళ్లీ కాసేపటి క్రితం మీడియా ముందుకొచ్చింది. తాను ప్రకటించిన నివేదిక ఫేక్ అని సీఐడీ తేల్చిసిన సంగతి మినహాయించి , ఎప్పట్లాగే పాత విమర్శలనే ఆమె పునరావృతం చేశారు. అసలు తనకేమీ అర్థం కాలేదని తల గోక్కుంటున్నారామె.
అమ్మా పెట్టా పెట్టదు, అడుక్కోనివ్వదనే సామెత చందాన ఏపీ ప్రభుత్వ పరిస్థితి తయారైందన్నారు. మాధవ్ వీడియో వ్యవహారంపై తానుగా చర్యలు తీసుకోకపోగా, తాము ఆ పని చేస్తే కక్ష సాధిస్తారా? అని ప్రశ్నించారు. తమ నివేదికపై రంధ్రాన్వేషణ ఎందుకు చేస్తున్నారని ఆమె ప్రశ్నించడం గమనార్హం. కానీ ఏపీ సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ చెప్పినట్టు టీడీపీ నివేదిక ఫేక్ అనడాన్ని మాత్రం ఆమె ఖండించకపోవడం విశేషం.
ఏపీ సీఐడీకి తమ నివేదికతో ఏం పని అని ఆమె ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బట్టల్లేకుండా తిరిగిన మాధవ్‌పై చర్యలు తీసుకోకుండా తమపైనే కేసులు పెట్టడానికి సిద్ధమవుతారా? అని అనిత నిలదీశారు. ఒక ఎంపీ స్థానంలో ఉండి అసభ్యంగా ప్రవర్తించిన మాధవ్‌పై చర్యలు తీసుకోకపోతే, ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ఇతరులు బట్టల్లేకుండా తమ ముందు తిరిగితే పరిస్థితి ఏంటని ఆమె వాపోయారు.
అప్పుడు తమ ఆత్మాభిమానం ఏం కావాలని అనిత ప్రశ్నించారు. ఏపీలో మహిళల ఆత్మాభిమానాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. మాధవ్ వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపితే నిజానిజాలేంటో నిగ్గుతేలుతాయని ఆమె చెప్పు కొచ్చారు. నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు సదరు వీడియోను పంపే దమ్ము ఏపీ ప్రభుత్వానికి ఉందా? అని ఆమె ప్రశ్నించారు. మాధవ్‌ను బర్తరఫ్ చేస్తేనే డర్టీ ఫిక్చర్‌కు ముగింపు పడుతుందన్నారు. అంత వరకూ తమ పోరాటం ఆగదన్నారు. అనిత తన డర్టీ ఆలోచనలకు ఫుల్‌స్టాప్ పెట్టే వుద్దేశం మాత్రం లేదని చెప్పకనే చెప్పారు.