ఎన్నికలు ఎప్పుడు వచ్చిన వైసీపీనే విజయం సాధిస్తుందని ఏపీ సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి ఆర్ కే రోజా అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష అని చెప్పారు. గురువారం తిరుమల స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలోకి పరిశ్రమలు వస్తుంటే నారాలోకేష్ అనవసరగా మాట్లడుతున్నారు అంటూ మండిపడ్డారు. నారాలోకేష్ ను ఉద్దేశిస్తూ మన స్టేట్ లో ఒక తింగరోడు ఉన్నాడు వాడినే పప్పు అంటారు అంటూ ఘాటుగా విమర్శించారు. మేము అన్ని హామిలన్నింటినీ నెరవేరుస్తున్నామని, మళ్లీ ముఖ్యమంత్రిగా జగనే ఉంటారనే అభిప్రాయపడ్డారు.
హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణపై కూడా మంత్రి రోజా సీరియస్ కామెంట్లు చేశారు. అమావాస్యకో, పౌర్ణమికో నియోజకవర్గానికి వచ్చి బాలకృష్ణ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
మహిళలపై బాలకృష్ణ గతంలో ఎన్నో మాట్లాడారని, మరి ఆ రోజుల్లో బాలకృష్ణను ఎందుకు పార్టీ నుంచి సస్పండ్ చేయలేకపోయారని ప్రశ్నించారు. మంత్రులకు ఏ అధికారాలు ఉన్నాయో మమ్మల్ని అడిగితే తెలుస్తుందన్నారు.