చంద్రబాబు ఆ పని చేయగలరా…?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు మహానాడు వేదికగా చాలా విమర్శలే చేశారు. వైసీపీ చేసినది అంతా అప్పులు తప్పుల తడకే అని కూడా అన్నారు. దానికి ధీటుగా సూటిగా వైసీపీ మంత్రి సీదరి అప్పలరాజు బాబుకు…

తెలుగుదేశం అధినేత చంద్రబాబు మహానాడు వేదికగా చాలా విమర్శలే చేశారు. వైసీపీ చేసినది అంతా అప్పులు తప్పుల తడకే అని కూడా అన్నారు. దానికి ధీటుగా సూటిగా వైసీపీ మంత్రి సీదరి అప్పలరాజు బాబుకు ఒక సవాల్ విసురుతున్నారు. వైసీపీ పాలనలో చేసింది అంతా అప్పులు అంటున్నారు. కానీ ఆ అప్పులు చేసింది సంక్షేమ పధకాల కోసం.

మరి ఏపీలో సంక్షేమ పధకాలు కొనసాగించాలా వద్దా అన్న ఒక్క పాయింట్ మీద క్లారిటీ ఇచ్చి చంద్రబాబు ఏమైనా మాట్లాడుకోవచ్చు అని కూడా ఆయన అంటున్నారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల మీద టీడీపీ విధానం ఏమిటి అన్నది జవాబు చెప్పాలని మంత్రి డిమాండ్ చేస్తున్నారు.

సంక్షేమ పధకాలు వద్దు, దండుగ అనుకుంటే దాన్ని జనాలకు క్లారిటీగా చెప్పాలని కూడా మంత్రి అంటున్నారు. మొత్తానికి వైసీపీ ఇంత అప్పులు చేసింది, అంత చేసింది అని విమర్శలు చేస్తున్న టీడీపీ అధినాయకత్వాన్ని మంత్రి గట్టిగానే నిలదీస్తూ ప్రశ్నించారు అనుకోవాలి.

మరి ఏపీ అప్పులు అంటున్న చంద్రబాబు సంక్షేమ పధకాల గురించి మాత్రం పెద్దగా మాట్లాడడం లేదు, అంటే ఆయన వాటిని సమర్ధిస్తున్నారా లేక తాము అధికారంలోకి వస్తే లేకుండా చేయాలనుకుంటున్నారా. ఇదే ఇపుడు వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్న. మరి జవాబు ఎలా ఇచ్చినా బాబు మాత్రం ఇరాకాటంలో పడడం ఖాయం.

అయితే దీనికి టీడీపీ శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్  కూన రవికుమార్ మాత్రం తాము ఇపుడే ఎందుకు చెప్పాలి రెండేళ్ళ టైమ్ ఉంది కదా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 

సంక్షేమ పధకాలు అమలు విషయంలో ప్రస్తుతానికైతే టీడీపీ కప్పదాటు వైఖరినే అనుసరిస్తోంది అంటున్నారు. ఈ సంశయం, అయోమయమే జనాల్లో పెట్టి టీడీపీ గురించి విమర్శలు చేయాలని వైసీపీ భావిస్తోంది అని కూడా అంటున్నారు.