విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ మోస్ట్ నేత, సంస్థానాధీశుడు పూసపాటి అశోక్ గజపతిరాజు 72ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఆయన పుట్టిన్ రోజు తెలుగుదేశంలోని తస్మదీయ నాయకుల మధ్యన ఘనంగా జరిగాయి.
ఇక అశోక్ విషయానికి వస్తే అజేయుడు అన్న పేరు 2004లోనే పోయింది. నాడు కోలగట్ల వీరభద్రస్వామి ఇండిపెండెంట్ గా పోటీ చేసి మరీ అశోక్ ని ఓడించేశారు. ఇక 2019లో లోక్ సభ ఎన్నికల్లోనూ అశోక్ కి మరోసారి పరాభవం తప్పింది కాదు.
మరో రెండేళ్ళలో ఎన్నికలు ఉన్నాయనగా 72 ఏళ్ళు నిండిన ఈ సీనియర్ నేత అడుగులు ఎలా ఉంటాయన్న చర్చ అయితే సాగుతోంది. అశోక్ కి అయితే తన వారసురాలు అదితి గజపతిరాజుని విజయనగరం ఎమ్మెల్యే సీటు నుంచి పోటీలో దించాలని ఉంది. తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు.
అయితే ఈ రోజుకీ విజయనగరం లోక్ సభకు సరైన క్యాండిడేట్ లేరని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. దాంతో మరోసారి అశోక్ ని ఎంపీగా పోటీ చేయించాలనుకుంటోందిట. దాంతో 74 ఏళ్ల వయసులో అశోక్ గజపతి రాజు మళ్ళీ పోటీ చేయకతప్పదనే అంటున్నారు.
ఒక ఈ ఏజ్ లో కూడా యాక్టివ్ గా ఉంటున్న అశోక్ జిల్లా పార్టీ వ్యవహారాలను చూస్తున్నారు. చిత్రమేంటంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు అంతా ఆయన్ని ఆశ్రయించడం. పుట్టిన రోజు వేళ ఆయనను కలసి గ్రీట్ చేయడం.