అయోధ్య గీతోపదేశం: జగన్ కు అర్థమవుతోందా?

అయోధ్య రామిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకులలో ఒకరు. గత ఎన్నికల్లో ఓటమికి దారితీసిన కారణాలను ఆయన తనదైన శైలిలో విశ్లేషిస్తున్నారు. అయితే ఆయన చెబుతున్న మాటలు.. ఓడిపోయిన నాటి నుంచి గ్రేట్…

అయోధ్య రామిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకులలో ఒకరు. గత ఎన్నికల్లో ఓటమికి దారితీసిన కారణాలను ఆయన తనదైన శైలిలో విశ్లేషిస్తున్నారు. అయితే ఆయన చెబుతున్న మాటలు.. ఓడిపోయిన నాటి నుంచి గ్రేట్ ఆంధ్ర చెబుతున్న వాదననే బలపరుస్తున్న సంగతి గమనార్హం.

ప్రస్తుతం ఉమ్మడి కృష్ణాజిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కూడా అయిన అయోధ్య రామిరెడ్డి.. జగన్ పరిపాలన కాలంలో వాలంటీర్ల మీద అతిగా ఆధారపడి కేడర్ ను నిర్లక్ష్యం చేయడం వల్లనే పార్టీ ఓటమి పాలైందని అంటున్నారు. ఎన్నికల కంటె ముందు నుంచి కూడా వాలంటీర్ల గ్రేట్ ఆంధ్ర అనేక సందర్భాల్లో ఈ విషయం చెప్పింది. వాలంటీర్లే జిందా తిలిస్మాత్ అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని హితోపదేశం చేసింది. జగన్ పట్టించుకోలేదు. ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి కూడా అదే మాటలతో గీతోపదేశం చేస్తున్నారు. కనీసం ఇప్పుడైనా జగన్ చెవిన వేసుకుంటారా? అనే సందేహాలు కార్యకర్తల్లోనే రేగుతున్నాయి.

జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన కాలంలో వాలంటీరు వ్యవస్థను కొత్తగా తీసుకువచ్చారు. వీరిద్వారా పథకాలను అమలు చేయడంవలన లబ్ధిదారులకు మేలు జరుగుతుందని, పారదర్శకత ఉంటుందని ఆశించారు. అవన్నీ నిజమే కానీ.. వాలంటీర్లే పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రథసారథులని భ్రమించారు. ఆ భ్రమలో పార్టీ కార్యకర్తలను పూర్తిగా విస్మరించారు.

పెన్షన్ల పంపిణీ మాత్రమేకాదు, ప్రజలకు రేషన్ కార్డు కావాలన్నా, ప్రభుత్వ ఆఫీసులో ఏ చిన్న పని పడినా.. అన్నింటికీ వాలంటీర్లనే సంప్రదించాల్సిందిగా సూచిస్తూ వచ్చారు. క్రమంగా సంక్షేమ పథకాల అమలులో కార్యకర్తలకు ఎలాంటి పాత్ర లేకుండాపోయింది. అసలు కార్యకర్తలను ప్రజలు పట్టించుకోవడం మానేశారు.

ఎన్నికల సీజన్ ముంచుకొచ్చిన తర్వాత కూడా జగన్ వైఖరిలో మార్పు రాలేదు. వాలంటీర్లే పార్టీని గెలిపిస్తారు అంటూ పదేపదే ఊదరగొట్టారు. వారిని ఇంటింటికీ తిప్పుతూ జగన్ ప్రభుత్వం గురించి ఊదరగొట్టించారు. పదేపదే భజన చేయించారు. ప్రజలకు అందే ప్రతి పథకమూ జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్నట్టుగా పదేపదే చెప్పించారు. ఇందులో ఎక్కడా కార్యకర్తల పాత్ర లేకుండాపోయింది.

ప్రభువు చెప్పిన దానికి వాలంటీర్లు కాస్త అతి జోడించి.. జగన్ భజన చేయడం ప్రజల వద్ద వెగటు పుట్టించింది. మొత్తానికి కార్యకర్తలకు ప్రజల దృష్టిలో ఏమాత్రం విలువలేకుండా చేసిన ఫలితం పార్టీ ఓడిపోయింది. ఇంచుమించుగా ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి కూడా అదే చెబుతున్నారు. ఇప్పటికైనా కార్యకర్తలకు విలువ ఇవ్వడం, ప్రజల్లో వారి గౌరవం కాపాడడం గురించి జగన్ శ్రద్ధ వహిస్తారా? అనేది వేచిచూడాలి.

13 Replies to “అయోధ్య గీతోపదేశం: జగన్ కు అర్థమవుతోందా?”

  1. నీలి కార్యకర్తలకి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి , ౩౦ వేల మంది అమ్మాయిలని మాయం చేసిన నీలి వాలంటీర్లు , ప్రజల మాన , ప్రాణ , ధన దోపిడీ కి మూల కారణం నీలి వాలంటీర్లు , వీడు అయోధ్య రామి రెడ్డి కాదు లంకా రెడ్డి

  2. అధికారం లో ఉంటె.. తాడేపల్లి పాలస్..

    అధికారం పోతే.. యెలహంక పాలస్..

    అడ్డోళ్లకు నెలలో మూడు రోజులే సెలవులు.. మా జగన్ రెడ్డి కి నెలలో ముప్పై రోజులూ సెలవులే ..

    అయ్యగారు అధికారం లో ఉన్నప్పుడు.. విశాఖ పర్యటన ని కూడా అంతరిక్ష పర్యటన అనే రేంజ్ లో ప్రచారం చేసుకొనేటోళ్లు..

    2023 స్టార్టింగ్ లో.. నియోజకవర్గాల వారీగా జగన్ తో క్యాడర్ ముఖాముఖి సమావేశాలు అని చెప్పారు.. కుప్పం, ఆత్మకూరు తో మమ అనిపించేసారు.. అంటే 175 లో జస్ట్ 2..

    2023 సెప్టెంబర్ లో.. పల్లె నిద్ర అన్నారు.. నిద్ర పోకుండా ఎదురు చూసారు జనాలు.. ఏమైందో.. ఎవడికి తెలుసు..

    ఒకసారి “సిద్ధం” అన్నారు.. వెంటనే.. “మేమంతా సిద్ధం” అన్నారు.. హోర్డింగ్స్ కి 500 కోట్లు ఖర్చు.. జనాలు “మీకో దండం” అనేసారు..

    నెలలో మూడు సార్లు.. సాక్షి హెడ్ లైన్స్.. పోలవరం పరుగులు.. చదివేవాడికి కంపరం గా ఉంటుంది.. కానీ ప్రశ్నించకూడదు..

    ఇవే తప్పులు అప్పుడు కూడా చెప్పేవాడిని.. తిరిగి నా భార్య ని తిట్టేవాళ్ళు.. ఆవిడ ఏమి పాపం చేసింది అని అడిగితే.. నా తల్లిని తిట్టేవాళ్ళు.. ఆవిడ కాన్సర్ తో చనిపోయిందిరా అంటే.. కాదు.. మా పక్కలో పడుకుని ఉంది అంటూ కామెంట్స్ చేసేవాళ్ళు..

    అన్ని అవమానాలు పడింది.. నా రాష్ట్రం కోసం.. నా పార్టీ కోసం.. నా పిల్లల భవిష్యత్తు కోసం..

    నేను గెలిచాను.. నా రాష్ట్రం గెలిచింది..

    1. అయ్యగారు అధికారం లో ఉన్నప్పుడు.. విశాఖ పర్యటన ని కూడా అంతరిక్ష పర్యటన అనే రేంజ్ లో ప్రచారం చేసుకొనేటోళ్లు . LOL this is super.

      1. ఈవీఎం ల వల్ల ఓడిపోయామానికదా తీర్మానం చేసుకొన్నాము మళ్ళి ఇదేమి వాదన రోజుకొక వాదన తెస్తే జనాలు వేరే గ అనుకొంటారు

  3. అబ్బే ఇవన్నీ అర్థమైతే వాడు వాడు జ*గ*న్ రె*డ్డి ఎలా అవుతాడు, వాడు ముమ్మాటికీ అసమర్థుడు పరిపాలన అంటే ఏంటో తెలియని దద్దమ్మ

  4. ఇప్పటికీ..వాళ్ళకి 11 ఎందుకు వచ్చాయో అనే జ్ఞానం కలగలేదు..అదే రాష్ట్రానికి మంచిది. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత వాళ్ళకి పట్టడం లేదు. 11 నుండి ఇంకా దిగువకి ఎలా పడిపోవాలో. వీళ్ళకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలీదు. విలాస భవనాలు కట్టుకొని కులుకుదాం అనుకొని బోర్లా పడ్డా..కవర్ డ్రైవ్ లు..

  5. ఇప్పుడు మళ్ళి ఇదేమి వింత వాదన ఆల్రెడీ ఈవీఎం ల వల్లనే ఓడిపోయామని తీర్మానం చేసుకొన్నారు కదా మళ్ళి బకరాల కింద వాలంటీర్లను తీసుకోనిచ్చేరు

  6. ఈవీఎం ల వల్ల ఓడిపోయామానికదా తీర్మానం చేసుకొన్నాము మళ్ళి ఇదేమి వాదన రోజుకొక వాదన తెస్తే జనాలు వేరే గ అనుకొంటారు

Comments are closed.