వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి మంచిత‌న‌మే త‌ప్పైందా?

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న భార్య , కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి టీడీపీలో అవ‌మానాలు ఎదుర్కొంటున్నారు. నెల్లూరు జిల్లా ప‌రిష‌త్ స‌మావేశ మందిరంలో డీఆర్సీ మీటింగ్‌కు వెళ్లిన వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డిని స‌భావేదిక‌పైకి…

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న భార్య , కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి టీడీపీలో అవ‌మానాలు ఎదుర్కొంటున్నారు. నెల్లూరు జిల్లా ప‌రిష‌త్ స‌మావేశ మందిరంలో డీఆర్సీ మీటింగ్‌కు వెళ్లిన వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డిని స‌భావేదిక‌పైకి పిలిచి మ‌రీ అవ‌మానించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గౌర‌వంగా బొకే ఇవ్వ‌డం అనేది చిన్న విష‌యంగా క‌నిపించిన‌ప్ప‌టికీ, ఇది అధికారుల అహంకార వైఖ‌రిని ప్ర‌తిబింబిస్తోంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఎన్నిక‌ల‌కు ముందు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి దంప‌తులు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వైసీపీలో వేమిరెడ్డి దంప‌తుల‌ను పొమ్మ‌న‌కుండా పొగ‌పెట్టార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. వేమిరెడ్డి దంప‌తుల‌ను పోగొట్టుకున్న రోజే, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారం పోగొట్టుకోడానికి ఎంతో స‌మ‌యం లేద‌ని అంద‌రికీ అర్థ‌మైంది. వేమిరెడ్డి దంప‌తులు ఏ పార్టీలో ఉన్నా కేవ‌లం గౌర‌వాన్ని మాత్ర‌మే కోరుకుంటారు. అంత‌కు మించి వాళ్లు ప‌ద‌వులు ఆశించ‌రు. మ‌హా అయితే టీటీడీలో క‌లియుగ దైవం సేవ కోసం ప‌ద‌విని ప్ర‌శాంతిరెడ్డి కోరుకుంటారు.

అలాంటి వాళ్ల‌ను కూడా జ‌గ‌న్ కాపాడుకోలేక‌పోయారు. వైసీపీలో అవ‌మానానికి మ‌న‌స్తాపం చెంది… టీడీపీలో చేరిన వేమిరెడ్డికి , అక్క‌డ కూడా అదే ప‌రిస్థితి. దీంతో వేమిరెడ్డి దంప‌తులు మెత‌క వైఖ‌రే ప‌దేప‌దే అవ‌మానాలు పొందేలా చేస్తోంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో సున్నిత మ‌న‌స్కులు రాణించాలంటే చాలా క‌ష్ట‌మైంది. తిట్ట‌డం, తిట్టించుకోవ‌డం అల‌వాటు చేసుకుంటే త‌ప్ప‌, రాజ‌కీయాల్లో మ‌నుగ‌డ సాగించ‌లేని దుస్థితి.

వేమిరెడ్డి అంటే మంచి మ‌నిషి అనే పేరే, ఆయ‌న‌కు అడ్డంకిగా మారింద‌ని ఆయ‌న అనుచ‌రులు అంటున్నారు. వేమిరెడ్డిని అవ‌మానిస్తే, తీవ్ర ప‌రిణామాలు వుంటాయ‌నే భ‌యం క్రియేట్ అయింటే, ప‌దేప‌దే అవ‌మానాలు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్ప‌డేది కాద‌ని వాళ్లు అంటున్నారు. టీడీపీలో కూడా వేమిరెడ్డి అంటే మంత్రులు నారాయ‌ణ‌, ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డితో పాటు జిల్లా అధికారుల‌కు లెక్క‌లేకుండా పోయింది.

అందుకే ఆయ‌న్ను అంద‌రూ చూస్తుండ‌గానే, విస్మ‌రించి అవ‌మానించారు. ఇక అంత‌ర్గ‌తంగా వేమిరెడ్డి దంప‌తుల ప‌రిస్థితి ఏంటో అర్థం చేసుకోవ‌చ్చ‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. అంతే మ‌రి, మెత్త‌నోళ్ల‌ను చూస్తే.. ఒత్తుతా (అణ‌చివేత‌) వ‌స్తార‌నే సామెత ఊరికే పుట్టిందా?

8 Replies to “వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి మంచిత‌న‌మే త‌ప్పైందా?”

  1. Kootami ki wave vundi ani telisi last minute kootami lo cheri MP seat kottesina ee red gaadu should be grateful for getting recognition in Kootami. Wife was given MLA and also a member post in TTD. Inka kooda ee balupu pradarsanalu endi veedi over action kakapothe. Kootami leadership should show him his level and position. Otherwise every tom dick and harry will start wagging tails.

  2. Kootami ki wave vundi ani telisi last minute kootami lo cheri MP seat kottesina ee red gaadu should be grateful for getting recognition in Kootami. Wife was given MLA and also a member post in TTD. Inka kooda ee balupu pradarsanalu endi veedi over action kakapothe.

  3. After recognizing that Kootami had wave he jumped to kootami in last minute and won as MP. This reddi fellow should be grateful for getting recognition in Kootami. Wife was given MLA and also a member post in TTD. Now what is this balupu pradarsana and over action. Kootami leadership should show him his level and position. Otherwise every tom dick and harry will start wagging tails.

  4. ఆ జరిగిన దాంట్లో చంద్రబాబు గారికి సంబంధం లేదని వేమిరెడ్డి గారికి తెలుసు ఆయనకి చంద్రబాబు గారు ఇచ్చే గౌరవం తెలుసు

Comments are closed.