అయ్యన్న నోటికి ప్లాస్టర్ వేశారా?

పెద్దాయన టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు. ఆయన తన చిత్తం వచ్చినట్లుగా మాట్లాడుతారు. ఆయన ఆ స్వేచ్చనే ఎక్కువగా కోరుకున్నారు. అది ఆయన ఇప్పటిదాకా అనుభవిస్తూ వస్తున్నారు. అయితే స్పీకర్ అన్న పదవితో ఆ…

పెద్దాయన టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు. ఆయన తన చిత్తం వచ్చినట్లుగా మాట్లాడుతారు. ఆయన ఆ స్వేచ్చనే ఎక్కువగా కోరుకున్నారు. అది ఆయన ఇప్పటిదాకా అనుభవిస్తూ వస్తున్నారు. అయితే స్పీకర్ అన్న పదవితో ఆ స్వేచ్చకు చంద్రబాబు ముకుతాడు వేశారు అని అంతా అనుకున్నారు.

స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు నియమితులై ఆ కుర్చీలో ఆసీనులైన నేపధ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన కామెంట్స్ కూడా చర్చకు వచ్చాయి. ఇక మీ పాత అవతారం చాలించాలి. కొత్త అవతారం లోకి మారాలి అని అచ్చెన్న సుతిమెత్తగానే చెప్పాల్సింది చెప్పారు. బాబు మాట కూడా అదే అని అంటున్నారు.

చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్యలో అధికారంలో ఉన్న వేళ అయ్యన్న మంత్రిగా ఉన్నారు. ఆయన తరచూ మీడియా ముందుకు వచ్చి హాట్ కామెంట్స్ చేస్తూ హైలెట్ అయ్యేవారు. అలా మీడియాకు సంచలన వార్తలు పంచారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో చాలా సార్లు పెట్టారు. అందుకే ఈసారి మంత్రి పదవి ఇవ్వకుండా స్పీకర్ పదవితో బాబు అయ్యన్న నోరు కట్టేశారు అని అంతా అనుకున్నారు.

అయితే అయ్యన్నపాత్రుడు అదే మాట అనడమే విశేషం. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇపుడు తాను పరిమితులకు లోబడి వ్యవహరించాలి అని అన్నారు. తనకు స్పీకర్ పదవి ఇచ్చి నోటికి ప్లాస్టర్ వేశారు చంద్రబాబు అని అన్నారు. అది అయ్యన్న మనసులో మాటగానే చూస్తున్నారు

పదవి ఘనమైనది. కానీ రాజ్యాంగబద్ధమైనది.రాజకీయాలు చేయడానికి కుదరదు. అయ్యన్న లాంటి వారికి ఆ పదవిలో ఉండడం సీనియారిటీ ప్రకారం కరెక్టే అయినా నిత్యం మీడియాతో జనాలతో మెలిగే పెద్దాయనకు చేతులూ కాళ్ళు నోరూ కూడా కట్టేసినట్లుగా అవుతోంది. 

ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలంటే అయ్యన్న మాట్లాడుతూనే ఉండాలి. ఆయన మీడియాతో టచ్ లో ఉంటేనే ఏపీ రాజకీయానికి హుషార్ వస్తుంది. కానీ ఇపుడు ఆయన సైలెంట్ అయిపోవాల్సి వస్తోంది అన్నది ఆయన బాధ మాత్రమే కాదు అనుచరుల బాధ అభిమానుల బాధ వారిని మించి మీడియా బాధ కూడా.