ఇంత ఓవరాక్షన్ ఎందుకు అయ్యన్నా..?

ఎంత ఓవరాక్షన్ చేస్తే ఎల్లో మీడియాలో అంత మైలేజీ. అందుకే మొన్నటివరకు చంద్రబాబు, లోకేష్ కు మాత్రమే పరిమితమైన ఈ ఓవరాక్షన్ జాడ్యాన్ని ఇప్పుడు అయ్యన్నపాత్రుడు కూడా ఫాలో అవుతున్నారు. నిబంధనలకు  విరుద్ధంగా కట్టిన…

ఎంత ఓవరాక్షన్ చేస్తే ఎల్లో మీడియాలో అంత మైలేజీ. అందుకే మొన్నటివరకు చంద్రబాబు, లోకేష్ కు మాత్రమే పరిమితమైన ఈ ఓవరాక్షన్ జాడ్యాన్ని ఇప్పుడు అయ్యన్నపాత్రుడు కూడా ఫాలో అవుతున్నారు. నిబంధనలకు  విరుద్ధంగా కట్టిన ప్రహరీ గోడ కూల్చేస్తే.. ఏదో ప్రాణాలు తీసేస్తున్నారనే రేంజ్ లో గగ్గోలు పెడుతున్నారు.

చేసింది కబ్జా పని. మళ్లీ దానికి సిగ్గులేకుండా కవరింగ్ చేసుకుంటున్నారు అయ్యన్న. పంట కాల్వకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించి, ప్రహరీ గోడ కట్టుకున్నారు. దానికి సంబంధించి కొన్ని రోజుల కిందటే నోటీసులిచ్చింది రెవెన్యూ శాఖ.

ఇప్పుడు అక్రమంగా కట్టిన ఆ గోడను కూల్చేసింది. దీనికే ఏదో తన ప్రాణాలు తీస్తున్నట్టు, అరెస్ట్ చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నారు.

అయ్యన్నపాత్రుడు అరెస్ట్ అంటూ ప్రచారం చేస్తోంది ఎల్లో మీడియా. అసలు అరెస్ట్ చేయడం లేదంటూ ప్రకటించారు నర్సీపట్నం పోలీసులు. అక్రమ నిర్మాణం కూల్చివేతకు మున్సిపల్, రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారని, వాళ్ల పని సజావుగా జరిగేందుకు మాత్రమే పోలీసు బలగాల్ని ఏర్పాటుచేశామని స్పష్టం చేశారు.

అయ్యన్నపాత్రుడ్ని అరెస్ట్ చేశామనేది కేవలం ప్రచారం మాత్రమేనని, కొంతమంది పనిగట్టుకొని ఈ పని చేస్తున్నారని పోలీసులు ప్రకటించారు. దీంతో ఎల్లో బండారం బట్టబయలైంది. అయ్యన్న ఓవరాక్షన్ కు చెక్ పడింది. అయ్యన్న ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించారనే విషయం బయటకొచ్చింది.

ఇప్పటికైనా అయ్యన్న, చంద్రబాబు, లోకేష్ తమ ఓవరాక్షన్ ఆపాలి. తను అక్రమ నిర్మాణం చేపట్టి, సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్న అయ్యన్న, లోకేష్ ను చూసి జనాలు నవ్వుకుంటున్నారు.