అయ్యో..శ్రీలక్ష్మి..

సబ్ కలెక్టర్ నుంచి విశాఖ మున్సిపల్ కమిషనర్ గా వుండే వరకు శ్రీలక్ష్మి అంటే కింది స్థాయి అధికారులకు హడల్. సిన్సియర్ అధికారిణి ఆమె. చిన్న రిమార్కు కూడా లేదు.  Advertisement వన్స్ స్టేట్…

సబ్ కలెక్టర్ నుంచి విశాఖ మున్సిపల్ కమిషనర్ గా వుండే వరకు శ్రీలక్ష్మి అంటే కింది స్థాయి అధికారులకు హడల్. సిన్సియర్ అధికారిణి ఆమె. చిన్న రిమార్కు కూడా లేదు. 

వన్స్ స్టేట్ లెవెల్ కు వెళ్లాక కూడా బాగానే వుంది. కానీ వైఎస్ జ‌గన్ వ్యవహారాలతో ఆమెను కూడా ముడి వేసారు. జైలు పాలు చేసారు. ఏడాదిన్నర జైలులో వున్నారు. ఆరోగ్యం మొత్తం హరించుకుపోయింది. నడిచే పరిస్థితి లేనంతగా ఆరోగ్యం పాడయింది. అప్పటి వరకు తెచ్చుకున్న పేరు ప్రతిష్టలు అన్నీ మంట కలిసిపోయాయి. కుటుంబ పరంగా తలెత్తుకోలేని పరిస్థితి.

కట్ చేస్తే ఇప్పుడు ఆమెకు కేసుల నుంచి విముక్తి. ఏ ఆధారాలు లేవని క్లారిటీ. మరి ఏడాదిన్నర జైలు…అనారోగ్యం. కెరీర్ ఒడిదుడుకులు..ఇవన్నింటికీ పరిహారం? కేవలం కొంత మంది పన్నిన కుట్రలకు బలైపోయి శ్రీలక్ష్మి ఇలా అన్నీ దూరం చేసుకున్నారు. బాధలు అనుభవించారు.

ఆమె మళ్లీ ఉద్యోగంలోకి వచ్చినా ఓ సెక్షన్ ఆఫ్ మీడియా వదిలిపెట్టలేదు. తెలంగాణ నుంచి ఆంధ్ర‌కు రప్పించినా వదిలి పెట్టలేదు. అదే పెద్ద తప్పిందం అంటూ వార్తలు రాసారు. అలా ఆద్యంతం ఆమెను వెంటాడుతూనే వున్నారు. ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చింది. శ్రీలక్ష్మి నిర్దోషిగా నిరూపితం అయింది. కానీ అమూల్యమైన ఆమె ఆరోగ్యం, మానసిక ఆందోళనకు పరిహారం ఏదీ?