బాబుగారిట్లో అత్తాకోడళ్ల గొడవ

ప్రయివేటు బతుకులు మీ సొంతం..పబ్లిక్ లో వుంటే ఏమైనా అంటాం అంటాడు శ్రీశ్రీ. అందుకే పెద్దవాళ్ల ఇళ్లలో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా పతాకశీర్షికలకు ఎక్కిపోతాయి.  Advertisement వైకాపా అధ్యక్షురాలు విజయమ్మ రెండు…

ప్రయివేటు బతుకులు మీ సొంతం..పబ్లిక్ లో వుంటే ఏమైనా అంటాం అంటాడు శ్రీశ్రీ. అందుకే పెద్దవాళ్ల ఇళ్లలో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా పతాకశీర్షికలకు ఎక్కిపోతాయి. 

వైకాపా అధ్యక్షురాలు విజయమ్మ రెండు చోట్ల పదవుల నిర్వహణ సరికాదు, రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు తానే అధ్యక్షురాలిగా వుండడం నైతికం కాదు కనుక ఒక చోట పదవికి రాజీనామా చేసారు. అలా చేసే ముందు క్లారిటీగా మాట్లాడారు. 

తన కొడుకును ప్రజల చేతుల్లో వుంచానని, కూతురు కు అండగా వుండాలనుకుంటున్నా అని స్పష్టం చేసారు. సరే దానికి చిలవలు, పలవలు అల్లుకునేవారు అల్లుకున్నారు. స్పెషల్ స్టోరీలు, డిస్కషన్లు చేసారు.

ఇలాంటి నేపథ్యంలో ఇదిగో ఇలాంటిదే మరో పాయింట్ అంటూ మీడియాకు మేత వదిలారు మాజీ మంత్రి పేర్ని నాని. ఈ పాయింట్ మీద కూడా డిస్కషన్ పెట్టండంటూ, చంద్రబాబు ఇంటి అంత:పుర రహస్యాన్ని బయటకు తీసారు. 

కొన్నాళ్ల క్రితం చంద్రబాబు భార్యకు, కోడలు..మేనకోడలు అయిన లోకేష్ భార్యకు సరిపడలేదని, దాంతో బాబు అండ్ భార్య ఒక ఫార్మ్ హవుస్ లో సర్దుకోవాల్సి వచ్చిందని చెప్పారు. దాంతో కమ్మ సామాజిక వర్గ పెద్దలు కూర్చో పెట్టి రాజీ చేసారని వివరించారు. ఇది తప్పయితే దేనికైనా రెడీ అన్నంతగా నాని ఛాలెంజ్ చేసారు.

మరి దీని మీద డిస్కషన్ పెట్టరా అని నాని అడగడం సమంజసమే కదా. జగన్ చెల్లి తనకు అన్నకూ పడదని చెప్పిందా? లేదు కదా? తల్లి ఏమైనా తనకు కొడుకుకు పడదని చెప్పిందా? లేదు కదా? మరి ఎలా మీడియా చిలవలు పలవలు అల్లి స్టోరీలు వండి వారుస్తోంది. ఆ లెక్కన నారా కుటుంబం మీద కూడా వండి వార్చ వచ్చు కదా?

మన వాళ్ల ఇళ్ల గొడవలు అయితే గుట్టుగా దాచాలి. అవతలి వారి ఇంటి గుట్టు అయితే రచ్చ కెక్కించాలి. ఇదే కదా తేదేపా మీడియా కార్యాచరణ. అన్న చెల్లి అన్నాక, అత్త కోడలు అన్నాక వివాదాలు కామన్ అని సరిపెట్టుకోరు. ఎందుకంటే జగన్ పరువు ఏ విధంగా పలుచన చేయాలన్నదే కదా యావ.