బాబు ఆ రెండు పథకాలు సక్సెస్ ఫుల్

టీడీపీ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చాక రెండు పధకాలు సక్సెస్ ఫుల్ గా అమలు చేస్తున్నారని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు సెటైర్లు పేల్చారు. చంద్రన్న పగ, చంద్రన్న దగ అనే…

టీడీపీ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చాక రెండు పధకాలు సక్సెస్ ఫుల్ గా అమలు చేస్తున్నారని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు సెటైర్లు పేల్చారు. చంద్రన్న పగ, చంద్రన్న దగ అనే పథకాలను ఆయన చక్కగా అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

గడచిన తొమ్మిది నెలల కాలంలో వైసీపీ నాయకుల మీద పగ సాధించడం, ఇచ్చిన హామీలను దగా చేయడమే బాబు చేసిన పాలన అని కన్నబాబు ఎకసెక్కమాడారు. అతి తక్కువ కాలంలోనే కూటమి ప్రభుత్వం ప్రజలలో విశ్వాసం కోల్పోయిందని ఆయన అన్నారు. ఎక్కువ హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆయన నిందించారు. అయితే బాబు మాదిరిగా జగన్ ఉండరని చెప్పింది చేసే నైజం వైఎస్ జగన్ ది అని కన్నబాబు అన్నారు.

ఉత్తరాంధ్ర ఉద్యమాల పురిటి గడ్డ అని ఆయన కొనియాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా చిత్తశుద్ధితో ప్రయత్నించారని గతాన్ని గుర్తు చేశారు. వైసీపీ ప్రజల పక్షాన వైసీపీ నిలబడుతుందని పేదల పక్ష పాతి జగన్ అని ఆయన స్పష్టం చేశారు.

తొమ్మిది నెలల పాలనలో లక్షా 20 వేల కోట్లు అప్పు చేసి చంద్రబాబు ఏమి చేశారో తెలియదని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే రాజకీయ పార్టీలో వలసలు సాధారణమని ఆయన లైట్ తీసుకున్నారు. జగన్ కోసం ప్రాణాలు ఇచ్చే వారు కోట్లాది మంది ఉన్నారని ఏపీలో అన్ని సేనల కంటే జగన్ సేన వెరీ స్ట్రాంగ్ అని కన్నబాబు స్పష్టం చేశారు.

10 Replies to “బాబు ఆ రెండు పథకాలు సక్సెస్ ఫుల్”

  1. వీడి ఇంటిపేరు మాత్రమే కాదు, వీడి మాటలు, బుద్దులు అన్నీ కూడా కురసాగానే ఉన్నాయ్

  2. Power lo unte Sai Reddy or Babai Subba Reddy in charges.

    Leka pothe Samajika nyayam kinda Kurasala laanti joker ni appoint chestharu.

    Gorre Biddalaki ardham avvada?

    Leka natisthara?

  3. ఈ పనికిమాలిన ప్రాసలకేం గాని..

    మీ వైసీపీ రాష్ట్ర నాయకుడు “శంకర్ నాయక్” బ్రోతల్ కంపెనీ లో మంచం కింద నిలువునా దాక్కుని.. అడ్డం గా దొరికిపోయాడు..

    నీ జగన్ రెడ్డి కి చెప్పు వెళ్లి.. మీ పార్టీ అందగాడు, సౌమ్యుడు, బుద్ధిమంతుడు ఇంకొకడు బొక్కలోకి వెళ్ళాడు.. వెళ్లి పరామర్శించమని ..

    ..

    ఇలా వైసీపీ అందగాళ్లంతా జైలు లోకి వెళ్లిపోతుంటే.. పాపం.. జగన్ రెడ్డి కి బయట కష్టం కదా..

  4. జగన్ గారి కష్టానికి జనాలు కూడా ఏమి దాచుకోకుండా పదకొండు ఇచ్చేసేరు సర్ బాబు గారు గతం లో పడిన కష్టానికి ఇప్పుడు జనసేనతో 164 ఇచ్చేరు మీరు మాత్రం టీడీపీ నాయకుడు చిక్కాలతో కలిసి చేసిన నిర్వాహకానికి మీ పాత నియోజక వర్గం లో వైసీపీ ని విజయవంతం గ చంపేసేరు ఇక భవిష్యత్తులో కూడా రాకుండా చేసేరు sc లు ఇక అక్కడ వైసీపీ కి వెయ్యకుండా చేయగలిగేరు ఇదే విధం గ ఉత్తరాంధ్రలో కూడా చేయమని మనవి

Comments are closed.