స్టార్ సింగ‌ర్ మొన్న ముద్దు వీడియో, ఇప్పుడు మాజీ భార్య‌తో!

స్టార్ సింగ‌ర్ ఉదిత్ నారాయ‌ణ్ ను వ‌ర‌స వివాదాలు వెంటాడుతున్నాయి.

స్టార్ సింగ‌ర్ ఉదిత్ నారాయ‌ణ్ ను వ‌ర‌స వివాదాలు వెంటాడుతున్నాయి. త‌న‌పై ఆపేక్ష‌తో బుగ్గ‌పై చుంభించ‌డానికి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ఒక మ‌హిళాభిమాని పెదాల‌పై చుంభించి, ఆ వీడియో వైర‌ల్ కావ‌డంతో ఉదిత్ పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలో ఉదిత్ త‌న తీరును గ‌ట్టిగా స‌మ‌ర్థించుకున్నాడు. అందులో త‌ప్పేలేద‌న్నాడు. అభిమానుల‌ను అలా చుంభిచడం త‌మ‌బోటి సింగ‌ర్ల‌కు మామూలే అని చెప్పుకున్నాడు. అదే ద‌శ‌లో అంత‌కు ముందు కూడా ఈ సింగ‌ర్ అలా వ్య‌వ‌హ‌రించిన ఇత‌ర వీడియోలు కూడా చ‌ర్చ‌కు వ‌చ్చాయి. అయితే సోష‌ల్ మీడియాలో ఆ చ‌ర్చ అలా మ‌రుగున ప‌డినా, ఇప్పుడు ఉదిత్ కుటుంబ వివాదం ఒక‌టి ఫిర్యాదు వ‌ర‌కూ వ‌చ్చింది.

ఉదిత్ కు ఒక మాజీ భార్య కూడా ఉంద‌ట‌. ఎప్పుడో కెరీర్ ఆరంభానికి ముందే ఇత‌డికి పెళ్లి అయ్యింద‌ట‌. 1984లో ఒక బిహారీ వ‌నిత‌ను ఇత‌డు వివాహం చేసుకున్నాడ‌ట‌. సింగ‌ర్ గా అవ‌కాశాల కోసం ముంబైకి వెళ్లాకా ఆమెతో విడిపోయాడ‌ట‌. ఆ త‌ర్వాత ఇత‌డు మ‌రో మ‌హిళ‌ను పెళ్లి చేసుకుని ఇద్ద‌రు పిల్ల‌ల‌ను కూడా క‌న్నాడు.

మొద‌టి వివాహం గురించి ఉదిత్ చాన్నాళ్ల పాటు చాటుగానే ఉంచాడ‌ట‌. దీంతో ఆమె కోర్టును ఆశ్ర‌యించి, డైవోర్స్ ను సెటిల్ చేసుకుంద‌ట 90ల‌లో. అప్పుడు ఉదిత్ ఆమెకు భ‌రణం కింద ఇళ్లు, కొంత స్థ‌లంతో పాటు కొంత బంగారం ఇచ్చాడ‌ట‌. అలాగే నెల‌కు 15 వేల చొప్పున మెయింటెయినెన్స్ చెల్లించ‌డానికి కూడా ఒప్పుకుని బిహార్ మ‌హిళా క‌మిష‌న్ ముందు ఒప్పుకున్నాడ‌ట‌. అలా కోర్టు బ‌య‌ట వ్య‌వ‌హారాన్ని సెటిల్ చేసుకున్న ఉదిత్ పై తాజాగా అత‌డి మాజీ భార్య ఒక ఫిర్యాదు చేసింది.

త‌న‌కు సంబంధించిన ఒక భూమిని ఉదిత్ అమ్ముకున్నాడ‌ని, త‌న‌కు చెల్లాల్సిన 11 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను అత‌డు తీసుకున్నాడ‌ని ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై ఫ్యామిలీ కోర్టు విచార‌ణ‌కు కూడా ఉదిత్ హాజ‌ర‌య్యాడు. అందులో త‌న త‌ప్పేం లేద‌నేది ఉదిత్ వాద‌న‌గా తెలుస్తోంది.

ఈ కేసు విచార‌ణ‌తో ఉదిత్ మొద‌టి వివాహం అంశం మ‌ళ్లీ చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇటీవ‌లి అత‌డి వ్య‌వ‌హారంతో ఈ విచార‌ణ మ‌రింత‌గా వార్త‌ల్లో నిలుస్తూ ఉంది.

3 Replies to “స్టార్ సింగ‌ర్ మొన్న ముద్దు వీడియో, ఇప్పుడు మాజీ భార్య‌తో!”

Comments are closed.