కేసీఆర్ 3.0 జ‌గ‌న్ 2.0! – పున‌రుత్తేజం ఎలా?

ఇప్పుడు 2.0 అంటున్న జ‌గ‌న్ ముందుగా చేసుకోవాల్సిన ప‌ని.. మిగిలిన కార్య‌క‌ర్త‌ల్లో అయినా భ‌రోసా క‌లిగించ‌డం. 2.0అంటూ వ‌స్తే.. 1.0లా పాల‌న ఉండ‌ద‌ని జ‌గ‌న్ వారికి భ‌రోసాను ఇవ్వాలి ముందుగా!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు అయిపోయి ఏడాదిన్న‌ర స‌మ‌యం అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్తై ఎనిమిది నెల‌లు గ‌డుస్తున్నాయి. ఇరు రాష్ట్రాల అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు అయితే చాలా స‌మ‌య‌మే మిగిలి ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మూడున్న‌ర సంవ‌త్స‌రాల స‌మ‌యం, ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు అయితే ఇంకా నాలుగేళ్ల‌కు పై స‌మ‌య‌మే మిగిలి ఉంది. అయితే.. ప్ర‌జాస్వామ్యంలో ఎప్పుడూ ఉండే చ‌ర్చ‌ల్లో ప్ర‌తిప‌క్షం పుంజుకోవ‌డాల గురించి కూడా ఉంటుంది. అటు తెలంగాణ‌లో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ఆర్ఎస్ పున‌రుత్తేజం ప‌నుల్లో ఉంది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ శ‌క్తిగా త‌న ఉనికిని చాటుకునే ప్ర‌య‌త్నాల్లో ఉంది. ఇలాంటి నేప‌థ్యంలో కేసీఆర్ 3.0కూ, జ‌గ‌న్ 2.0 కూ ఉన్న సాధ్యాసాధ్యాల గురించిన చ‌ర్చిస్తే.. ముందుగా చెప్పాల్సిన మాట‌, తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో ఒక పార్టీ ప‌రిస్థితి అయిపోయింది అనుకోవ‌డానికి మించిన అబ‌ద్ధం ఉండ‌ద‌నేది!

తెలుగు రాజ‌కీయ చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే.. ఇక ప‌నైపోయింది అనుకున్న ప్ర‌తి సారీ పార్టీలు లేచి నిల‌బ‌డ్డాయి. అధికారాన్ని అందిపుచ్చుకున్నాయి. ద‌శాబ్దాల నుంచి ఇలాంటి ప‌రిస్థితే కొన‌సాగుతూ ఉంది. ఇలాంటి నేప‌థ్యంలో.. బీఆర్ఎస్ పార్టీ ప‌ని అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌ని అయినా అయిపోయింద‌నుకోవ‌డం మాత్రం రాంగ్ ఎస్టిమేష‌నే అవుతుంది. తెలుగు ప్ర‌జ‌లు ఏ పార్టీని అయినా చిత‌క్కొడ‌తారు కానీ, చంపేయ‌రు! ఇది తెలుగు ప్ర‌జ‌లు అనుస‌రించే రాజ‌కీయ నీతి! ఒక‌రికే అవ‌కాశం ఇస్తూ పోతే .. వారు నెత్తికెక్కుతారు అనేది తెలుగు వాళ్ల‌కు బాగా తెలుసు! అందుకే ఎవ‌రిని ఎప్పుడో ఎలా లేపాలో, ఎప్పుడు ఎవ‌రిని త‌గ్గించాలో వారు ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో చూపుతూనే ఉంటారు. కాబ‌ట్టి.. రాజ‌కీయ ప్ర‌త్యామ్నాయ శ‌క్తులు ఏపీలో జ‌గ‌న్ కు అయినా, తెలంగాణ కేసీఆర్ కు అయినా స్థానం ఉన్న‌ట్టే.

తెలంగాణ‌లో కాంగ్రెస్ కు ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా కేసీఆరే క‌నిపిస్తూ ఉన్నారు. అక్క‌డ‌కూ బీజేపీ తెలంగాణ‌పై చాలా ఆశ‌లే పెట్టుకుని ఉన్నా.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ ప్ర‌త్యామ్నాయ శ‌క్తి కేసీఆరే త‌ప్ప‌, క‌మ‌లం పార్టీకి అంత దృశ్యం అయితే క‌న‌ప‌డ‌టం లేదు. ఎంపీ సీట్లు నెగ్గితే నెగ్గ‌వ‌చ్చు కానీ.. ఎమ్మెల్యేల వ‌ర‌కూ వ‌స్తే కాంగ్రెస్ వ‌ర్సెస్ బీఆర్ఎస్ గానే ప‌రిస్థితి కొన‌సాగుతూ ఉంది.

ఇక ఏపీలో అయితే.. ఎలాగూ తెలుగుదేశం- జ‌నసేన‌లు క‌లిసి ఉన్నాయి. ఇప్పుడ‌ప్పుడే అవి విడిపోయే ప‌రిస్థితి కూడా లేదు. విడిపోతే త‌మ ప‌రిస్థితి ఏమ‌వుతుందో అనే భ‌యం ఆ పార్టీల‌కు ఉండ‌నే ఉంది. విడివిడిగా పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఆ పార్టీలు చిత్త‌వుతాయి. అది విశ్లేషణ కాదు, అటు తెలుగుదేశం పార్టీకి అయినా, ఇటు జ‌న‌సేన‌కు అయినా ఆ భ‌యం ఉండ‌నే ఉంది. కాబ‌ట్టి.. ఎంత కాలం సాగినా ఆ పార్టీలు రెండూ క‌లిసే పోటీలో నిల‌బ‌డాలి. లేదంటే.. మొద‌టికే మోసం వ‌స్తుంది. కాబ‌ట్టి.. ఏపీలో కూట‌మికి రాజ‌కీయ ప్ర‌త్యామ్నాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ ఉన్నా.. ష‌ర్మిల సార‌ధ్యంలో ఆ పార్టీ అంత‌కంత‌కూ దిగ‌జారిపోవ‌డ‌మే త‌ప్ప అంత‌కు మించి సాధించేది ఏమీ లేదు.

ఇలా రాజ‌కీయ ప్ర‌త్యామ్నాయంగా జ‌గ‌న్, కేసీఆర్ ల‌కు వారి వారి అవ‌కాశాలు మిగిలే ఉన్నాయి. స్థిర‌మైన ఓటు బ్యాంకు ఆ పార్టీల‌కు ఉండ‌నే ఉంటుంది. దీనికి తోడు.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త క‌లిసి వ‌చ్చినా.. ఆ పార్టీలు గ‌ట్టిగా పుంజుకునే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉంటాయి. అయితే ప్ర‌త్య‌ర్థులు అనే స‌వాళ్ల‌ను ఎదుర్కొంటూ, త‌మ పాల‌న‌లో జ‌రిగిన త‌ప్పుల‌ను ఒప్పుకుని.. వాటిని పునరావృత్తం కానీయ‌మే భ‌రోసాను ఇవ్వ‌డ‌మే అటు కేసీఆర్ అయినా, ఇటు జ‌గ‌న్ అయినా చేయాల్సిన ప‌నులు!

నాయ‌కుల అరాచ‌కాలు, గ్రామాల‌ను మ‌రిచిన కేసీఆర్!

ప‌దేళ్ల పాల‌న త‌ర్వాత అధికారాన్ని కోల్పోయిన కేసీఆర్ చేసిన పొర‌పాట్లలో ప్ర‌ముఖ‌మైన‌వి హైద‌రాబాద్ ఇమేజే త‌మ‌ను మ‌రోసారి గెలిపిస్తుంద‌ని న‌మ్మ‌డం! ఎంత‌సేపూ హైద‌రాబాద్, హైద‌రాబాద్ అంటూ ఊద‌ర‌గొట్టారు కానీ, గ్రామీణ తెలంగాణ‌ను కేసీఆర్ విస్మ‌రించారు. దీన్ని చెప్ప‌డానికి దీర్ఘ‌మైన విశ్లేష‌ణ‌లు అవ‌స‌రం లేదు. హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కేసీఆర్ రాజ‌కీయంగా వాడుకోవ‌డంలో హైద‌రాబాద్ వ‌ర‌కూ విజ‌య‌వంతం అయ్యార‌ని, జీహెచ్ఎంసీ ప‌రిధిలో బీఆర్ఎస్ కు వ‌చ్చిన అసెంబ్లీ సీట్ల సంఖ్య చెబుతూ ఉంది.

రైతుల‌ను, గ్రామాల‌ను విస్మ‌రించి, అసెంబ్లీ నియోక‌వ‌ర్గాల స్థాయికి ఎమ్మెల్యేలు నియంత‌లుగా త‌యారు కావ‌డం అనేది బీఆర్ఎస్ పుట్టి ముంచింద‌ని ప‌ట్ట‌ణ‌, రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌చ్చిన ఫ‌లితాల‌ను బ‌ట్టి తేల్చేయ‌వ‌చ్చు! వాస్తవానికి బీఆర్ఎస్ హ‌యాంలో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉండేది. కాంగ్రెస్ నేత‌ల గురించి కొత్త‌గా వివ‌రించ‌న‌క్క‌ర్లేదు. ఒక‌రు ఎదుగుతుంటే, ఒక‌రు పార్టీపై గ్రిప్ సాధిస్తూ ఉంటే.. ప‌ది మంది నేత‌లు వారిని గుంజుతూ ఉంటారు. అలాంటి విబేధాలు, వారిలో వారికి ఉన్న వైషమ్యాల ఫ‌లితంగానే తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి కూడా కాంగ్రెస్ పార్టీ 2014లో ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేక‌పోయింది, వారిలో వారి కుమ్ములాట‌లు, క‌లిసి ప‌నిచేయ‌లేక‌పోవ‌డం, అస‌లు కేసీఆర్ ను ఎలా ఎదుర్కొనాలో కూడా వారికి క్లారిటీ లేక‌పోవ‌డం వ‌ల్ల 2018లోనూ వారికి కాలం క‌లిసి రాలేదు.

అయితే.. కేవ‌లం కేసీఆర్ పాల‌న ప‌దేళ్ల పాటు కొన‌సాగ‌డం, ఎమ్మెల్యేల పోక‌డ‌లు శృతి మించ‌డం, కాంగ్రెస్ ను త‌క్కువ అంచ‌నా వేయ‌డం, ఇక మ‌రోసారి బీఆర్ఎస్ కే ప‌ట్టంగడితే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను ఇక ప‌ట్ట‌డం సాధ్యం కాద‌ని జ‌నాలు కూడా క్లారిటీకి రావ‌డం, టీఆర్ఎస్ పేరును మార్చుకుని బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ జాతీయ స్థాయి క‌ల‌రింగ్ ఇచ్చుకోవ‌డం.. ఇలాంటి స్వ‌యంకృతాలు బీఆర్ఎస్ ను ఓట‌మి పాలు చేశాయి. అక్క‌డ‌కూ హైద‌రాబాద్ వ‌ర‌కూ ప‌ట్టు నిలుపుకున్నారు. మిగ‌తా చోట్ల తేడా కొట్టింది. మ‌రి ఇప్పుడు అయినా బీఆర్ఎస్ పేరు గ్రామాల్లో ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెడుతూ ఉండ‌వ‌చ్చు. అధికారం ఉన్న వేళ ఎమ్మెల్యేలు నియంతలుగా చ‌లామ‌ణి కావ‌డం వ‌ల్ల వ‌చ్చిన చెడ్డ‌పేరు అది.

అయితే ప్ర‌జాస్వామ్యంలో విచిత్రం ఏమిటంటే.. ఎవ‌రి చేతిలో అధికారం ఉంటే వారు నియంత‌ల వ‌లే చ‌లామ‌ణి అయ్యే ప్ర‌య‌త్నం చేస్తారు, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏమీ త‌క్కువ చేస్తుండ‌రు! వీరిలో చాలా మంది ప‌దేళ్లుగా అవ‌కాశం కోసం ఎదురుచూపిన వారు! కాబ‌ట్టి.. వ్య‌తిరేక‌త అనేది త‌ప్ప‌దు. అయితే ఇది టీఆర్ఎస్ వాళ్లు చివ‌రి ఐదేళ్ల‌లో చేసిన అరాచ‌కాల స్థాయికి ఎక్కువ‌గా ఉంటుందా, త‌క్కువ‌గా ఉంటుందా అనేది ప్ర‌జ‌లు బేరీజు వేసుకునే అవ‌కాశం ఉంది.

ఇక ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన నాటి నుంచి వాటికి వివ‌ర‌ణ ఇచ్చేందుకు కూడా కేసీఆర్ స‌రిగా బ‌య‌ట‌కు రాలేదు. ఏడాదిన్న‌ర త‌ర్వాత కేసీఆర్ ఇప్పుడిప్పుడు క‌నిపిస్తూ ఉన్నారు. అయితే కేటీఆర్, హ‌రీష్ రూపంలో స‌మ‌ర్థులైన నాయ‌క‌త్వం బీఆర్ఎస్ కు ఉంది. ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా నిల‌దొక్కుకోవ‌డానికి వారి ప‌నితీరు కీల‌కంగా నిలుస్తుంది. కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ వాళ్లు ఎన్ని అవినీతి ఆరోప‌ణ‌లు చేసినా.. ఇప్ప‌టి వ‌ర‌కూ అరెస్టులు అయితే చేయ‌లేక‌పోయింది. క‌విత అరెస్టు జ‌రిగినా, అది ఆప్ పై బీజేపీ సంధించిన అస్త్రాల్లో భాగంగా బీజేపీ చేయించిన అరేస్టే అవుతుంది త‌ప్ప అందులో కాంగ్రెస్ కు హ‌స్తం లేన‌ట్టే! ఈ విష‌యంలో అయితే కేసీఆర్ కుటుంబం గ‌ట్టిగానే క‌నిపిస్తూ ఉంది.

ఒక‌వేళ అరెస్టు జ‌రిగితే దాని వ‌ల్ల బీఆర్ఎస్ లేనిపోని సానుభూతి వ‌స్తుందేమో అని రేవంత్ రెడ్డి కూడా ఆలోచిస్తున్నాడు కాబోలు! అలాగే కాంగ్రెస్ సీఎంల‌కు ప్ర‌త్య‌ర్థుల‌పై దృష్టి సారించేందుకు దొరికే స‌మ‌యం త‌క్కువ‌. ఎందుకంటే.. వీళ్లు సొంత పార్టీలోని ప్ర‌త్యర్థుల‌ను ఎదుర్కొనాలి. ఏ అడుగు ముందుకు వేసినా.. సొంత వాళ్లు కూడా అవ‌కాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. బీఆర్ఎస్ పై రేవంత్ దాడి తీవ్ర‌త‌రం అయితే, కేసీఆర్ కుటుంబీకుల అరెస్టులు జ‌రిగితే.. అప్పుడు రేవంత్ పైనే కాంగ్రెస్ వాళ్లు త‌మ అధిష్టానానికి ఫిర్యాదులు చేయ‌క‌పోరు. అరెస్టుల వ‌ల్ల బీఆర్ఎస్ కు లాభం జ‌రుగుతుందంటూ మొద‌లుపెడితే వీరి ఫిర్యాదుల‌కు హ‌ద్దూఅదుపూ ఉండ‌దు. కాబ‌ట్టి.. రేవంత్ ఏక‌ప‌క్షంగా దూసుకెళ్ల‌డానికి ఆస్కారం అయితే అవ‌కాశాలు త‌క్కువ‌గానే ఉన్న‌ట్టున్నాయి.

అయితే ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని మ‌ళ్లీ పొంద‌డం అనేది బీఆర్ఎస్స్ కు తేలికేమీ కాదు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఒక్క‌టే గులాబీ పార్టీని గ‌ట్టెక్కించ‌లేదు. ఎందుకంటే.. ఇక్క‌డ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలుతుంది. కాంగ్రెస్ వ్య‌తిరేక ఓటును ఎంతో కొంత బీజేపీ కూడా సొంతం చేసుకుంటుంది. అది నియోజ‌క‌వ‌ర్గానికి ఐదారు వేల ఓట్ల నుంచి మొద‌లుపెడితే.. అభ్య‌ర్థిని బ‌ట్టి.. ప‌ది వేలు, ఇర‌వై వేలు కూడా బీజేపీ అభ్య‌ర్థులు చీల్చుకుపోయే అవ‌కాశాలు ఉంటాయి. కాబ‌ట్టి.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌నే కాకుండా, తిరిగి విశ్వాసాన్ని పొంద‌డం అనేది టీఆర్ఎస్ కు కీల‌కం.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో అర్బ‌న్ ఓట‌ర్ బీఆర్ఎస్ వైపే నిలిచారు. అయితే కాంగ్రెస్ వాళ్లు ఆ విష‌యంలో జాగ్ర‌త్త‌గానే ఉండ‌వచ్చు. అర్బ‌న్ ఓట‌ర్ ఎప్పుడూ విశ్వాస‌పాత్రంగా ఉంటార‌నేదేమీ లేదు. హైద‌రాబాద్ అభివృద్ధి విష‌యంలో కాంగ్రెస్ శ్ర‌ద్ధ ను కొన‌సాగిస్తే.. అర్బ‌న్ ఓట‌ర్ కు మ‌ళ్లీ బీఆర్ఎస్ గుర్తుకు రావాల‌నేమీ లేదు. కాబ‌ట్టి.. అర్బ‌న్ ఓట‌ర్ పై న‌మ్మ‌కం పెట్టుకోవ‌డం క‌న్నా కోల్పోయిన రైతాంగం, గ్రామీణులు, ప‌ట్ట‌ణ ఓట‌ర్ల‌ను టీఆర్ఎస్ తిరిగి త‌న వైపుకు తిప్పుకోవాలి. ఇది అంత తేలిక ఏమీ కాదు.

కాంగ్రెస్ కు రూర‌ల్ లో సంప్ర‌దాయ ఓటు బ్యాంకు ఉంది. దాన్ని కాపాడుకుంటూ.. కొంత మేర కృషి చేసినా కాంగ్రెస్ త‌న ఉనికిని ఎప్ప‌టికీ కోల్పోదు. రైతుల్లో వ్య‌తిరేక‌త ప్ర‌బ‌లితే త‌ప్ప గ్రామాల్లో బీఆర్ఎస్ కు సానుకూల‌త రాదు. అయితే వీరి చేతిలో అధికారం ఉన్న‌ప్పుడు గ్రామాల‌ను ఉద్ధ‌రించింది ఏమీ లేక‌పోవ‌డంతో.. రేపు మ‌ళ్లీ ఓటు అడ‌గాల‌న్నా చెప్పుకోవ‌డానికి పెద్ద‌గా లేకుండా పోతోంది. అదే బీఆర్ఎస్ కు ఇప్పుడున్న పెద్ద స‌వాల్. అయితే ఇంకా స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో.. రేవంత్ పాల‌న ఎలాంటి పుంత‌లు తొక్కుతుంది, ల‌భించే అవ‌కాశాల‌ను టీఆర్ఎస్ ఏ మేర‌కు వినియోగించుకుంటుంది అనేది రాజ‌కీయ తెర‌పై చూడాల్సిన చిత్రం!

జ‌గ‌న్ 2.0 సాకారం ఎలా!

ఏపీ విష‌యానికి వ‌స్తే.. తెలుగుదేశం- జ‌న‌సేన కూట‌మి గ‌ట్ట‌డ‌మే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట‌మికి ప్ర‌థ‌మ కార‌ణం. జగ‌న్ పాల‌న గురించి విశ్లేషించ‌డానిక‌న్నా మునుపు.. తెలుగుదేశం- జ‌న‌సేన లు జ‌ట్టు క‌ట్ట‌డం, దానికి ఉడ‌తాభ‌క్తిగా బీజేపీ ఓటు బ్యాంకు కూడా తోడ‌వ్వ‌డం.. ఈ కూట‌మికి స‌మీక‌ర‌ణాలు అన్నీ సానుకూలంగా స్పందించ‌డంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించ‌న‌టువంటి ఓట‌మి ఎదుర‌య్యింది. రాజ‌కీయంలో ప్ర‌తిసారీ వ‌న్ ప్ల‌స్ వ‌న్ టూ కాదంటారు. అయితే ఏపీలో మాత్రం వ‌న్ ప్ల‌స్ వ‌న్ ప్ల‌స్ అయ్యింది.

టీడీపీ, జ‌న‌సేన‌ల కూట‌మి సూప‌ర్ హిట్ అయ్యింది. మరి భ‌విష్య‌త్తులో ఈ పొత్తు స‌మీక‌ర‌ణాలు ఎలా ఉంటాయ‌నేది ఇప్పుడు చ‌ర్చించాల్సిన అంశం అయితే కాదు! ఈ కూట‌మి స‌యోధ్య ఇలాగే ఉండ‌వ‌చ్చు, ఉండ‌క‌పోవ‌చ్చు. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశ‌లు పెట్టుకోవ‌డానికి కూడా ఏమీ లేదు. ఈ కూట‌మి ఇలానే ఉంటుంద‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్ర‌హించి, ఆ మేర‌కు రాజ‌కీయ వ్యూహాలు, ప్ర‌తి వ్యూహాల‌తో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ప‌వ‌న్ ను వ‌దిలేందుకు చంద్ర‌బాబు సాహ‌సించ‌డు, చంద్ర‌బాబును వ‌దిలేందుకు ప‌వ‌న్ కు ధైర్యం ఉండ‌దు. కాబ‌ట్టి.. వారిద్ద‌రూ క‌లిసే సాగుతారు! సానుకూల‌త‌ను సంపాదించుకున్నా, వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకున్నా.. చంద్ర‌బాబు- ప‌వ‌న్ లు క‌లిసే పొందాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తూ ఉంది. మ‌రి ఈ కూట‌మిని ఎదుర్కొనాలంటే.. జ‌గ‌న్ వ్య‌వ‌హ‌ర‌ణ తీరులోనూ చాలా మార్పులు రావాల్సి ఉంది.

అందులో ముఖ్య‌మైన‌ది.. జ‌గ‌న్ త‌న క‌ళ్లూ, చెవులూ స‌వ్యంగా ప‌నిచేసేలా చూసుకోవ‌డం. అంటే జ‌గ‌న్ తన చుట్టూ ఉన్న వాళ్ల క‌ళ్ల ద్వారా చూడ‌టం మానేసి, త‌న చుట్టూ ఉన్న వాళ్లే త‌న‌కు చెవులుగా ప‌ని చేసే ప‌రిస్థితిని పోగొట్టుకోవాలి. వాస్త‌వాల‌ను త‌నే గ్ర‌హించ‌డం మీద జ‌గ‌న్ దృష్టి పెట్టాలి. ఎంత‌సేపూ ఐప్యాక్ రిపోర్టులు, చెవిరెడ్డి స‌ర్వేలు, స‌జ్జ‌ల శాస్త్రీయ విశ్లేష‌ణ‌ల‌నే న‌మ్ముకుంటే.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పరిస్థితి 2024 ఎన్నిక‌ల్లాగానే తయార‌వ‌డంలో పెద్ద ఆశ్చ‌ర్యం లేదు.

ఏ రాజ‌కీయ నేత అయినా.. కాలం గ‌డిచే కొద్దీ, రాజ‌కీయాల్లో డ‌క్కామొక్కీలు తినే కొద్దీ ప‌రిణ‌తి సాధిస్తాడు! అయితే 2014 జ‌గ‌న్ తో పోల్చినా 2024 జ‌గ‌న్ ఆ ప‌రిణ‌తి కోల్పోయిన‌ట్టుగా అగుపిస్తాడు! ఓటు అడిగే ప‌ద్ధ‌తి నుంచి.. ప్ర‌తి దాంట్లోనూ జ‌గ‌న్ మొద‌టి ప‌దును కోల్పోయాడు. అందుకే 2014లో అలాంటి ప‌రిస్థితుల్లో కూడా 67 సీట్లు అయినా ద‌క్కాయి. చేసింది చెబితే ఓటేస్తార‌నే భ్ర‌మ‌లో జ‌గ‌న్ క‌నిపించాడు. క‌నీసం ఆ చెప్పుకోవ‌డం అయినా.. సంక్షేమం- అభివృద్ధిని మిళితం చేశాడా అంటే అదీ లేదు! ఎంత‌సేపూ సంక్షేమం మీద అతిగా చెప్పుకుని జ‌గ‌న్ బొక్క‌బోర్లా ప‌డ్డాడు. త‌ను చేసిన అభివృద్ధి ప‌నుల గురించి కూడా చెప్పుకోలేనంత వ్యూహ‌లేమితో జ‌గ‌న్ రాజ‌కీయం సాగింది!

ఐదు మెడిక‌ల్ కాలేజీలు క‌ట్టాను, పోర్టులు నిర్మిస్తున్నాను, ప్ర‌తి పంచాయ‌తీకీ ఆర్బీకేలు నిర్మించాను, స‌చివాల‌య భ‌వ‌నాల‌ను క‌ట్టాను, ప్ర‌జ‌ల ప‌రిస్థితి దృష్ట్యా సంక్షేమం మీద ఎక్కువ దృష్టి పెట్టాను గ‌త ఐదేళ్ల‌లో.. ఇంకో అవ‌కాశం ఇస్తే సంక్షేమాన్ని స‌రిచూసుకుంటూనే.. అభివృద్ది మీద దృష్టి కేంద్రీక‌రిస్తాను.. ఉపాధి మార్గాలను మ‌రింత మెరుగు ప‌రుస్తాను.. అంటూ సాగాల్సిన ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని జ‌గ‌న్ ఎటో తీసుకెళ్లిపోయాడు! సంక్షేమం మీద అతిగా ఆధార‌ప‌డిపోయి, అదే గెలిపించేస్తుంద‌నే న‌మ్మ‌కాల‌తో.. జ‌గ‌న్ దారుణ‌మైన ఓట‌మిని మూట‌గ‌ట్టుకున్నాడు. ప్ర‌చారం ప‌ర్వంతోనే జ‌గ‌న్ విసిగెత్తించాడు ప‌దే ప‌దే ఇవే మాట‌ల‌తో! దీనికి తోడు.. కార్య‌క‌ర్త‌ల‌ను పూర్తిగా లైట్ తీసుకున్నాడు.

2014 నుంచి త‌న‌తో నిలిచిన కార్య‌క‌ర్త‌ల‌కు భ‌రోసాను ఇస్తూ క‌నీసం ఒక్క మాట చెప్ప‌లేకపోయాడు. వ‌లంటీర్ల‌ను, స‌చివాల‌యాల‌ను అతిగా ప్ర‌మోట్ చేసుకుని.. వాటి మీద ఆధార‌ప‌డిపోయి.. న‌మ్మ‌క‌మైన కార్య‌క‌ర్త‌ల‌ను జ‌గ‌న్ కోల్పోయాడు. క‌నీసం వంద ఇళ్లు ఉన్న ఊర్లో కూడా నాలుగైదు హార్డ్ కోర్ కార్య‌క‌ర్త‌ల్లాంటి కుటుంబాల‌ను జ‌గ‌న్ త‌న ఐదేళ్ల పాల‌న‌తో కోల్పోయాడు! ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి శ‌రాఘాతంగా త‌గిలింది. ఎంత ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఉన్నా, జ‌గ‌న్ అభివృద్ధి చేయ‌లేద‌నే తెలుగుదేశం ప్ర‌చారాన్ని ప్ర‌జ‌లు విశ్వ‌సించినా, తెలుగుదేశం- జ‌న‌సేన‌లు కూట‌మిగా వెళ్లినా.. జ‌గ‌న్ కు అర‌వై డెబ్బై సీట్లు అల‌వోక‌గా ద‌క్కేవి. అయితే కార్య‌క‌ర్త‌ల‌నే దూరం చేసుకోవ‌డంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతటి దుస్థితి త‌లెత్తిందన‌డంతో ఆశ్చ‌ర్యం లేదు!

మ‌రి ఇప్పుడు 2.0 అంటున్న జ‌గ‌న్ ముందుగా చేసుకోవాల్సిన ప‌ని.. మిగిలిన కార్య‌క‌ర్త‌ల్లో అయినా భ‌రోసా క‌లిగించ‌డం. 2.0అంటూ వ‌స్తే.. 1.0లా పాల‌న ఉండ‌ద‌ని జ‌గ‌న్ వారికి భ‌రోసాను ఇవ్వాలి ముందుగా! ఐదేళ్ల పాల‌న‌లో కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోలేదు, వ‌లంటీర్ల మీద సచివాల‌యాల మీద అతిగా ఆధార‌ప‌డిపోయి.. పార్టీకి ప్ర‌జ‌ల‌కూ ఉండాల్సిన క‌నెక్టివిటీని మిస్ చేశాను, దాన్ని మ‌రో అవ‌కాశంలో స‌వ‌రిస్తాను అనే మాట జ‌గ‌న్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ రాలేదు! చేసిన పొర‌పాట్ల‌ను త‌న కార్య‌క‌ర్త‌ల‌ను, పార్టీ వాళ్ల ముఖంగా అయినా జ‌గ‌న్ ఒప్పుకోవాలి. ఆ త‌ర్వాతే మిగిల‌న‌వి అన్నీ!

ఈ విష‌యంలో చంద్ర‌బాబును చూసి జ‌గ‌న్ గ్ర‌హించ‌గ‌లగాలి. ఎప్పుడు ఓడిపోయినా.. చంద్ర‌బాబు త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌, నేతల మీటింగుల‌ను పెట్టి.. అధికారంలో ఉన్న‌ప్పుడు మిమ్మ‌ల్ని ప‌ట్టించుకోలేదు, ఈ సారి అవ‌కాశం వ‌స్తే మొత్తం మీరే అనే మాట‌ను రెగ్యుల‌ర్ గా వాడుతూ ఉంటారు. ఆ త‌ర్వాత ఎవ‌రిని ప‌ట్టించుకుంటారు, ప‌ట్టించుకోరు అనేది వేరే క‌థ‌! అయితే పార్టీని అధికారంలోకి తీసుకొస్తే.. ఆ త‌ర్వాత అంతా మీరే అనే మాట‌ను మాత్రం చంద్ర‌బాబు ఎవ‌రు ముందున్న వారి మీద విప‌రీతంగా ప్ర‌యోగిస్తూ ఉంటారు. అయితే జ‌గ‌న్ ధోర‌ణి మాత్రం ఇలా లేదు! కార్య‌క‌ర్త‌ల విష‌యంలో, మద్యం విష‌యంలో చేసిన పొర‌పాట్లే.. జ‌గ‌న్ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణాలు. మిగ‌తావ‌న్నీ ఆ త‌ర్వాత‌! అభివృద్ధి, రాజ‌ధాని ఊసుల‌ను ప‌ట్టించుకోకుండా, చేసిన ప‌నుల‌ను కూడా ప్ర‌చారం చేసుకోకుండా, రాజ‌ధాని విష‌యాన్నీ త‌మ క‌న్వీన్సింగ్ గా మార్చుకోవ‌డం జ‌గ‌న్ చేసిన త‌ప్పిదాల్లో మ‌రిన్ని!

అయితే ఇప్ప‌టికీ ప్ర‌త్యామ్నాయంగా మాత్రం ఏపీలో జ‌గ‌న్ కే అవ‌కాశం ఉంది. చంద్ర‌బాబును ధిక్క‌రించి ప‌వ‌న్ రేప‌టి ఎన్నిక‌ల స‌మ‌యానికి ప్ర‌తిప‌క్షంగా అవ‌తారం ఎత్తి జ‌నం ముందుకు వెళ్లే దృశ్యాలు ఏమీ ఉండ‌వు. త‌ను ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదగాల‌నే ఆస‌క్తి కూడా ప‌వ‌న్ కు లేద‌ని స్ప‌ష్టం అవుతోంది. చంద్ర‌బాబు చాటు మ‌నిషిగానే ప‌వ‌న్ ఉండ‌వ‌చ్చు. ఇది జ‌గ‌న్ కు చాలా సానుకూలాంశం.

చంద్ర‌బాబు పాల‌న‌పై , అధికారంలో ఉన్న వేళ తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ల అర‌చ‌కాల‌పై జ‌నాల‌కు విసుగొస్తే.. అప్పుడు ఆ వ్య‌తిరేక‌త ప‌వ‌న్ పై కూడా కొన‌సాగుతుంది. ఎలాగూ చంద్ర‌బాబుకు దోస్తుగా ఉండ‌టానికే ప‌వ‌న్ ప్రాధాన్య‌త‌ను ఇస్తాడు. కాబ‌ట్టి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్ వేర్వేరు కాదు. వీరికి ప్ర‌త్యామ్నాయంగా మాత్రం జ‌గ‌న్ కే అవ‌కాశం ఉంది. ముందు త‌న చుట్టూ ఉన్న మ‌నుషులను ప్ర‌క్షాళ‌న చేసుకుని, ఐప్యాక్ వ్యూహాల‌పై కాకుండా, స‌హ‌జ‌మైన రాజ‌కీయ వ్యూహాల‌తో ముందుకు వెళితే జ‌గ‌న్ కు అవ‌కాశాలు పుష్క‌లంగా ఉంటాయి. చేయాల్సింద‌ల్లా ప్ర‌జ‌ల‌తోనూ, కార్య‌క‌ర్త‌ల‌తోనూ నిష్కల్మ‌షంగా మ‌మేకం కావ‌డ‌మే! జ‌గ‌న్ ఆ ప‌ని చేస్తే.. అత‌డి చుట్టూరానే ఉండి, అత‌డి క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టిన ప‌ర‌దాలు కూడా అవే మ‌టుమాయం అవుతాయి!

32 Replies to “కేసీఆర్ 3.0 జ‌గ‌న్ 2.0! – పున‌రుత్తేజం ఎలా?”

  1. భయ్యా.. సింపుల్..

    ఎన్నికల నాటికి.. జగన్ రెడ్డి వస్తే అమరావతి నాశనం చేసేస్తాడు.. పోలవరం కూల్చేస్తాడు అని ఒక్క మాట మేము ప్రచారం చేస్తే చాలు.. జనాలు జగన్ రెడ్డి ని 175 అడుగుల లోతు గొయ్యి తీసి పాతి పెడతారు..

    ..

    పోనీ జగన్ రెడ్డి అమరావతి కి జై కొట్టినా.. 2019 కి ముందు చెప్పిన అబద్ధాలు లెక్కలు బయటకు తీస్తారు..

    ఒకటి అర్థం చేసుకోండి..

    2019 కి ముందు జగన్ రెడ్డి వాడాల్సిన ఆయుధాలన్నీ వాడేసాడు.. చెప్పకూడని అబద్ధాలని చెప్పి.. అధికారంలోకి వచ్చాడు..

    అలాంటివాళ్ళు అధికారం నిలుపుకుంటూనే ఉండాలి .. ఒక్కసారి దిగితే ఇక జనాలు ఎప్పటికీ నమ్మే అవకాశం ఉండదు..

    ..

    99% హామీలు నెరవేర్చేశానని చెప్పాడు .. జనాలు ఎందుకు నమ్మలేదు.. ఆలోచించారా..?

    మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అని అడిగాడు.. ఓటు ఎందుకు వేయలేదో.. ఆలోచించారా..?

    చంద్రబాబు వస్తే పథకాలు ఆగిపోతాయి అని చెప్పాడు.. జనాలు అందుకు కూడా “సిద్ధం” గానే ఉన్నారు..

    విశాఖ రాజధాని అన్నాడు… విశాఖ జనాలు ఎందుకు నమ్మలేదు..

    సిద్ధం సభలకు 11 కోట్ల మంది వచ్చారు.. 11 సీట్లే గగనం గా వచ్చాయి..

    ..

    జగన్ రెడ్డి కాలం చెల్లిన రాజకీయాలు చేస్తున్నాడు.. సోషల్ మీడియా ని నమ్ముకుని జనాలను భ్రమల్లో ఉంచాలనుకొంటున్నాడు.. జనాలు తెలివిమీరిపోయారు..

    జగన్ రెడ్డి ఆవులిస్తే.. జనాలు జగన్ రెడ్డి పేగులు బయటకు లాగేస్తారు.. జాగ్రత్తగా ఉండండి..

    ..

    ఫైనల్ గా.. ఇది చాలా ఇంపార్టెంట్..

    కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటే.. జగన్ రెడ్డి మీద నమ్మకం అని అర్థం కాదు..

    కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి పనులు చేయించుకోవాలని స్వేచ్ఛ కలిగి ఉన్నారని అర్థం..

  2. బాబు గారు మొన్న ఎలేచ్షన్స్ లో ఖచ్చితముగా రాజధాని అమరావతీ అని చెప్పి మరి ఉత్తరాంధ్ర లో మాక్సిమం సీట్స్ గెలిచారు ..ఈయన కనీసం తన మూడు రాజధానుల ఐడియా మీద కూడా గట్టిగ నిలబడలేకపోయారు …ఇప్పుడు నెక్స్ట్ ఎలేచ్షన్స్ లో ఏమి చెప్పి వోట్ అడుగుతారు ?

  3. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి కొత్తగా పొడిచేది ఏముంది అవే పథకాలు అవే సొల్లు పురాణం ఇంటి ఇంటి కి తిరిగి మా ప్రభుత్వం ఇంత భిక్ష ఇచ్చింది మీకు పేపర్లు లో రాసి మరి ఇస్తారు మాకు మీరు బానిసలు గా ఉండాలి మాకు తప్ప వేరే వాళ్లకు ఓట్లు వేయకూడదు అని జనాలను బయపెడుతారు, జనాలకి అక్కడే మండి మా డబ్బులు తీసుకొని మమ్మల్ని అడుక్కునే వాళ్లను చేస్తారా అని వాళ్ళ ఆత్మ విశ్వాసం మీద మళ్ళీ జగన్ కి చుక్కలు చూపిస్తారు.. దీనికి కు లాల సమికరణాలు ఉండనే ఉన్నాయి… నెల్లూరు తర్వాత రె డ్డి ( వైస్సార్ ఫ్యామిలి రె డ్డి కాదు) కులం ప్రభావం చాలా స్వల్పంగా ఉంటుంది… ఇక్కడ జిల్లాల నుండి అత్యధిక సీట్లు ఉన్నాయి.. టీడీపీ జనసేన కలయిక తో వన్ సైడ్ అయ్యాయి అని వైసీపీ కి కూడా తెలుసు…

  4. అంటే

    అహంకారం 3.0, ఫామ్ హౌస్ 3.0, సొల్లు కబుర్లు 3.0

    బిచ్చమ్ 2.0, వినాశం 2.0, స్మశానం 2.0

    జనం మిస్ అవుతున్నారు అంటావ్. ఖర్మ రా బాబు

  5. AP I dont know but TG will have KCR KTR combo back again. NDA is doing zero for hyderabad and less we talk about congress the better. Mottham industry padakesindi TG lo.

  6. జ‌గ‌న్ 2.0 సాకారం ఎలా!”

    ఆమ్మో! ఈ మాట వింటేనే జనాల్లో, పారిశ్రామిక వేత్తల్లో ఒక రకమైన జలదరింపు వస్తుంది.

    జగన్ 1.0 చూపించిన ఎఫెక్ట్ అలాంటిది. వాళ్లే చూసుకుంటారు జగన్ 2.0 సాకారం ‘కాకుండా’ ఎలా అని!

  7. నీ బాధేంటో ఏమి సమజ్ అవట్లె.. కొంచెం సేపు చంద్ర బాబు పవన్ కూటమి ఉంటే జగన్ కే కష్టం అంటావు..

    మళ్ళీ చంద్ర బాబు జగన్ కలిసే ఉంటారు..ఇది జగన్ కి చాలా సానుకులాంశం అంటావు..

    ఎంత సేపు i pac వదిలించుకోవాలి అంటావు..

    అంటే GA pac పెట్టుకోవాలా ఇపుడు?

  8. 2.0 విషయం లో ఇవి తప్పులుగా కన్పించడం లేదు . నయవంచన , దగా , మోసం , కపటం లాంటి పదాలు యథేచ్ఛగా వాడొచ్చు. ఒక మనిషికి నిజంగా ఇన్ని మోసాలు చేసే అవకాశం ఉంటుందా?? నేను కూడా జీవితం లో ఒకటో రెండో మోసం చేసి ఉంటాను. మరీ ఇంత దారుణం గా ఐతే కాదు.

  9. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతిపక్ష నేతలు పెద్దగా కష్టడనక్కర్లేదు. అటు రేవంత్, ఇటు బాబు ఇద్దరి పాలన అధ్వాన్నంగా ఉంది. ముఖ్యంగా బాబు ధోరణి చూసి తెలుగు తమ్ముళ్ళే సోషల్ మీడియా మీద తీవ్రమైన వ్యతిరేకత కనబరుస్తున్నారు. ఈ రోజు జీవీరెడ్డి రాజీనామా మీద తెలుగు దేశం కాడర్ స్పందన చూడండి. అందరూ బాబునే తప్పు పడుతున్నారు.

  10. చిన్న సవరణ జగనన్న పరిపాలన ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూశారు..2019 నుంచి 2024 వరకు పరిపాలన చూశాక 60శాతం ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి..

    ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో 2029లో కూటమి కలిసి పోటీ చేసిన కూటమి విడిపోయి పోటీ చేసిన మా అన్నయ్య కి మాత్రం ఓట్లు పడవు.. చేతులు ఒక్క సారే కాల్చుకుంటారు..

Comments are closed.