హిట్ 3 టీజర్ వస్తోంది

ఓ రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఆఫీసర్ గా నాని ఎలా కనిపించకబోతున్నారు అనే ఆసక్తి వుంది నోట్లో సిగార్ తో గ్లింప్స్ లో వచ్చిన నాని గెటప్ భలే ఆకట్టుకుంది.

ప్రతి హీరోకి మాస్ క్యారెక్టర్ చేయాలని వుంటుంది. ఈ మాస్ కు కొత్త డెఫినిషన్ ఇచ్చారు హీరో నాని. దసరా,సరిపోదా శనివారం లాంటి కొత్త తరహా మాస్ ను చూపించారు. కానీ తెలుగు ప్రేక్షకులకు అలవాటైన మాస్ వేరే వుంటుంది. పోలీస్ క్యారెక్టర్ తో వచ్చే మాస్. ఈ సినిమాను కూడా ట్రయ్ చేస్తున్నారు.

హిట్ వన్ అంటూ విష్వక్ సేన్ తో, హిట్ 2 అంటూ అడవి శేష్ తో రెండు సినిమాలు అందించారు. హిట్ 3 అంటూ తనే ట్రయ్ చేస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్ నుంచే ఆసక్తి పెంచుకుంది.

హిట్ 3 సినిమా టీజర్ ఇప్పుడు రాబోతోంది. దీని మీద చాలా ఆసక్తి వుంది. ఇటు సినిమా లవర్స్ లో, అటు నాని ఫ్యాన్స్ లో. నాని స్వంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాస్ పై ప్రశాంత్ తిపిర్నేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హిట్ వన్, టూ లో నటించిన హీరోలు అడవి శేష్. విష్వక్ సేన్ ఈ సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ గా కనిపిస్తారని వార్తలు వున్నాయి. లేదా తొలి రెండు భాగాల్లో ఫుటేజ్ అయినా వాడొచ్చు.

ఓ రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఆఫీసర్ గా నాని ఎలా కనిపించకబోతున్నారు అనే ఆసక్తి వుంది నోట్లో సిగార్ తో గ్లింప్స్ లో వచ్చిన నాని గెటప్ భలే ఆకట్టుకుంది. అదే సినిమా మీద ఆసక్తి కూడా పెంచింది. ఆ ఆసక్తిని టీజర్ కొనసాగిస్తుందా లేదా అన్నది చూడాలి.

One Reply to “హిట్ 3 టీజర్ వస్తోంది”

Comments are closed.