ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ లో జరుగుతున్న ఇండియా మ్యాచ్ లను చూస్తూ రిలాక్స్ అవుతూ కనిపించారు కొందరు తెలుగు ప్రముఖులు. ఇండియా- పాక్ మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీల్లో వీరిని కొన్ని క్షణాల పాటు చూపించాయి కెమెరాలు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. ఈ టోర్నీలో అవకాశం పొందని కొందరు భారత క్రికెటర్ల పక్కన చిరంజీవి కనిపించారు.
ఈ మధ్యనే దుబాయ్ టూరెళ్లినట్టుగా ఉన్నారు చిరంజీవి. తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా వెళ్లినట్టుగా ఫొటోలు పెట్టారు. అందులో నాగార్జున- అమల కూడా ఉన్నారు. వారెవరూ కెమెరాల్లో కనిపించలేదు.
ఇక దర్శకుడు సుకుమార్ కూడా ఒకసారి అలా మెరిశారు. ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కెమెరాల్లో సుకుమార్ ను ఒకసారి చూపించారు. అయితే కామెంటరేటర్లు వీరి గురించి ఏమీ ప్రస్తావించలేదు! మామూలుగా ఇలాంటి సెలబ్రిటీలను చూపించినప్పుడు కామెంటరేటర్లు కూడా అందుకుంటూ ఉంటారు.
ఇక ఈ మ్యాచ్ చూడటానికి వెళ్లిన వారిలో నారా లోకేష్ కూడా ఉన్నట్టుగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు దర్శనమిచ్చాయి. ఒకవైపు ఏపీలో గ్రూప్స్ ఎగ్జామ్స్ వివాదం నానా రచ్చ అయ్యింది. ఆఖరి నిమిషం వరకూ వాయిదా వాయిదా అంటూ చివరకు అవన్నీ రూమర్లు అంటూ ఎగ్జామ్ నిర్వహించడంపై ఉద్యోగార్థుల్లో తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది. ఈ వ్యవహారం వీధికి ఎక్కింది. ఇలాంటి నేపథ్యంలో లోకేష్ దుబాయ్ వెళ్లి క్రికెట్ మ్యాచ్ తో చిల్ కావడం ఏమిటంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వర్గాలు విరుచుకుపడ్డాయి.
లంగా 11 రెడ్డి ఎప్పుడు పడతే అప్పుడు బెంగుళూర్ వెళ్ళచ్చు, లండన్ వెళ్ళచ్చు, ఎర్రగడ్డ వెళ్ళచ్చు కానీ మిగతావాళ్ళు ఎక్కడకి వెళ్ళకూడదు.
11 రెడ్డి మాత్రం బంగళూరు, లండన్, ఎర్రగడ్డ, చంచల్గూడ ఎప్పడు పడితే అప్పడు వెళ్లవచ్చు
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
హ హ హ …దు బా య్…
Kupam pulakesi yekkadaa vunna okkateee











