బాబుకు చేదు వార్త చెప్పిన కాంగ్రెస్ నేత…?

కాంగ్రెస్ అంటే ఎన్టీయార్ కి అసలైన శత్రువు. చంద్రబాబుకు మాత్రం కాదు అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన పుట్టిందే కాంగ్రెస్ లో, ఎమ్మెల్యే, మంత్రి అయింది అక్కడే. ఇక టీడీపీలోకి వచ్చి కాంగ్రెస్ ని…

కాంగ్రెస్ అంటే ఎన్టీయార్ కి అసలైన శత్రువు. చంద్రబాబుకు మాత్రం కాదు అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన పుట్టిందే కాంగ్రెస్ లో, ఎమ్మెల్యే, మంత్రి అయింది అక్కడే. ఇక టీడీపీలోకి వచ్చి కాంగ్రెస్ ని తిట్టినా ఆయన 2018 ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ తో తెలంగాణా ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు.

ఇలా కాంగ్రెస్ ఒక విధంగా బాబుకు మిత్రుడు లాంటి పార్టీయే అని చెప్పాలి. అలాంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత చింతా మోహన్ చంద్రబాబుకు ఒక చేదు వార్తను వినిపించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన చింతా మోహన్ ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని తేల్చేశారు.

ఏపీలో వైసీపీ సర్కార్ అలాంటి ప్రయత్నాలు ఏ కోశానా చేయదని కూడా ఆయన తనకున్న రాజకీయ అంచనాలను, విశ్లెషణను జోడించి మరీ చెప్పారు. దాంతో ఇది తమ్ముళ్ళకే కాదు టీడీపీకి కూడా అశుభమైన వార్తగానే చూడాలి. మహానాడు హిట్ అయింది రేపో మాపో ఎన్నికలు, అధికారం మనదే అని చినబాబు, పెదబాబు చేస్తున్న హడావుడితో టీడీపీ పాలిటిక్స్ వేడెక్కింది.

ఇక మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలు ముందే వస్తాయేమోనని సర్దుకుంటున్నాయి తప్ప ఏ ఒక్క పార్టీ అసలు ఎందుకు ఎన్నికలు ముందుగా వస్తాయని మాత్రం తర్కించడంలేదు. అయితే విపక్షంలో ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్ మాత్రం రెండేళ్ళ తరువాతనే ఏపీలో ఎన్నికలు ఉంటాయని చెప్పడం విపక్ష శిబిరానికే పూర్తిగా నిరాశను కలిగించే వార్త. అన్నింటికీ మించి టీడీపీ ఉత్సాహానికి అడ్డుకట్ట వేసే వార్త.

నిజానికి ఇదే మాటను వైసీపీ నేతలు, మంత్రులు ఇప్పటికి పదిసార్లు చెప్పి ఉంటారు. ఎన్నికలు ముందుగా ఎందుకు వస్తాయని బొత్స సత్యనారాయణ లాంటి వారు అయితే టీడిపీని నిగ్గదీశారు కూడా. అయినా టీడీపీ తన అస్తిత్వం కోసం ముందస్తు ఎన్నికల ప్రచారం చేసుకుంటోంది. 

ఇపుడు సాటి విపక్షమే ఎన్నికలూ లేవు, ముందస్తూ లేదు అని తాపీగా చెప్పడం అంటే తమ్ముళ్ళకే కాదు టీడీపీకి మహానాడు ఇచ్చిన హుషార్ కరిగిపోయినట్లే, షాక్ తగిలినట్లే.