బాబు జైళ్లో ఖాళీ.. వాళ్లిద్దరూ షూటింగ్స్ లో బిజీ

స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు, రాజమండ్రి సెంట్రల్ జైల్ లో సేదతీరుతున్నారు. బాబు అరెస్టయిన వెంటనే పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యాడు. అలా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. Advertisement…

స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు, రాజమండ్రి సెంట్రల్ జైల్ లో సేదతీరుతున్నారు. బాబు అరెస్టయిన వెంటనే పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యాడు. అలా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు.

దాదాపు అదే టైమ్ లో బాలకృష్ణ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. తన బావను అరెస్ట్ చేసిన ఏపీ సర్కారుపై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై తనదైన శైలిలో ఓ పద్యం కూడా అందుకున్నారు.

ఆ తర్వాత పవన్ కల్యాణ్, బాలకృష్ణ కలిశారు. చంద్రబాబు కొడుకు లోకేష్ ను వెంటేసుకొని రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారు. ములాఖత్ తో మిలాఖత్ అయ్యారు. సెంట్రల్ జైలు వేదికగా ముసుగు తొలిగించేశారు. టీడీపీతోనే తన ప్రయాణమని పవన్ కల్యాణ్ చెప్పేశాడు. చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికం అంటూ మరోసారి ఫైర్ అయ్యాడు.

ఇలా చంద్రబాబు కోసం 3 రోజుల పాటు చాలా హంగామా చేసిన బాలయ్య-పవన్, ఇప్పుడు ఆ ఇష్యూని వదిలేసి తమ పనుల్లో పడిపోయారు. పవన్ కల్యాణ్ ఆల్రెడీ సెట్స్ లో వాలిపోగా, బాలయ్య ఇవాళ్టి నుంచి షూటింగ్ మొదలుపెట్టేశారు.

నందమూరి బాలకృష్ణ ఇవాళ్టి నుంచి సెట్స్ లో జాయిన్ అయ్యారు. రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో భగవంత్ కేసరి షూటింగ్ లో పాల్గొన్నారు బాలయ్య.

ఇక పవన్ కల్యాణ్ సంగతి సరేసరి. ఆయన ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లో జాయిన్ అయ్యాడు. ఓవైపు తన సినిమాల షూటింగ్స్ కొనసాగిస్తూనే, మరోవైపు వారాహి మలిదశ యాత్ర మొదలుపెట్టేందుకు సమాయత్తమవుతున్నారు.