ఛీఛీ.. మ‌రీ ఇంత సిగ్గు లేకుండా ఏంద‌బ్బా!

రాజ‌కీయాలంటే రోజురోజుకూ అస‌హ్యం క‌లిగేలా ప్ర‌జాప్ర‌తినిధులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇంత‌కంటే దిగ‌జార‌ర‌ని అనుకుంటున్న ప్ర‌తి సంద‌ర్భంలోనూ … అబ్బే పాతాళం కంటే దిగువ‌కు దిగ‌జారుతామ‌ని నాయ‌కులు నిరూపిస్తున్నారు. తాజాగా తెలంగాణ‌లో గ‌ద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల…

రాజ‌కీయాలంటే రోజురోజుకూ అస‌హ్యం క‌లిగేలా ప్ర‌జాప్ర‌తినిధులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇంత‌కంటే దిగ‌జార‌ర‌ని అనుకుంటున్న ప్ర‌తి సంద‌ర్భంలోనూ … అబ్బే పాతాళం కంటే దిగువ‌కు దిగ‌జారుతామ‌ని నాయ‌కులు నిరూపిస్తున్నారు. తాజాగా తెలంగాణ‌లో గ‌ద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి తీరు తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది.

గ‌త నెల‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆయ‌న కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. ఆ త‌ర్వాత ఏమైందో తెలియ‌దు కానీ రెండు రోజుల క్రితం అసెంబ్లీలో ఆవ‌ర‌ణ‌లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో బండ్ల భేటీ అయ్యారు. బీఆర్ఎస్‌లోనే కొన‌సాగుతాన‌ని కేటీఆర్‌తో ఆయ‌న అన్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది.

బండ్ల‌తో పాటు మ‌రికొంద‌రు కూడా తిరిగి బీఆర్ఎస్‌లోకి రిట‌ర్న్ అవుతార‌ని ప్ర‌చారం మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో బండ్ల‌తో ఇవాళ ఉద‌యం మంత్రి జూప‌ల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. బండ్ల‌ను బుజ్జ‌గించిన‌ట్టు స‌మాచారం. స్థానిక కాంగ్రెస్ నాయ‌కుల‌తో స‌మ‌స్య వ‌ల్లే తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు జూప‌ల్లితో ఆయ‌న చెప్పార‌ని తెలిసింది.

అయితే కాంగ్రెస్‌లో ప్రాధాన్యం ఇస్తామ‌ని జూప‌ల్లి హామీ ఇచ్చార‌ని స‌మాచారం. దీనికి బండ్ల మ‌ళ్లీ మ‌న‌సు మార్చుకుని కాంగ్రెస్‌లో కొన‌సాగ‌డానికే మొగ్గు చూపార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. బండ్ల తీరును ఛీ కొడుతున్నారు. అధికారం కోసం ఇంత‌గా దిగజారాలా? అని జ‌నం మండిప‌డుతున్నారు.

6 Replies to “ఛీఛీ.. మ‌రీ ఇంత సిగ్గు లేకుండా ఏంద‌బ్బా!”

  1. అబ్బా ఎంత నికృష్టపు దృశ్యం ఒక కొత్త రాజాకీయ వేశ్య ను బుజ్జగించడానికి ఒక పేరు మోసిన రాజాకీయ వేశ్య ను రాయబారానికి పంపడం బహుశా అవకాశానికి తగ్గట్టు పైట జార్చడంలో మెలకువలు నేర్పి ఉంటది

Comments are closed.