ఎస్సీ, ఎస్టీ వ‌ర్గీక‌ర‌ణ‌పై సుప్రీం సంచ‌లన తీర్పు!

ఎస్సీ, ఎస్టీ వ‌ర్గీక‌ర‌ణ‌పై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. వ‌ర్గీక‌ర‌ణ‌ను సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ చంద్ర‌చూడ్ నేతృత్వంలోని ఏడుగురి బెంచ్ స‌మ‌ర్ధించ‌డం విశేషం. వ‌ర్గీక‌ర‌ణ విష‌యంలో 2004లో ఇచ్చిన తీర్పును ప‌క్క‌న పెట్టింది. ఇదిలా…

ఎస్సీ, ఎస్టీ వ‌ర్గీక‌ర‌ణ‌పై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. వ‌ర్గీక‌ర‌ణ‌ను సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ చంద్ర‌చూడ్ నేతృత్వంలోని ఏడుగురి బెంచ్ స‌మ‌ర్ధించ‌డం విశేషం. వ‌ర్గీక‌ర‌ణ విష‌యంలో 2004లో ఇచ్చిన తీర్పును ప‌క్క‌న పెట్టింది. ఇదిలా వుండ‌గా వ‌ర్గీక‌ర‌ణ‌ను జ‌స్టిస్ బేలా త్రివేది వ్య‌తిరేకించారు.

విద్య‌, ఉద్యోగాల్లో వ‌ర్గీక‌ర‌ణ అమ‌లుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే వ‌ర్గీక‌ర‌ణ‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేప‌ట్ట‌వ‌చ్చ‌ని సుప్రీంకోర్టు త‌న ఆదేశాల్లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. వ‌ర్గీక‌ర‌ణ కోసం ఎమ్మార్పీఎస్ వ్య‌వస్థాప‌క అధ్య‌క్షుడు కృష్ణ‌మాదిగ సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప్ర‌ధాని మోదీ హైద‌రాబాద్ బ‌హిరంగ స‌భ‌లో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ చేప‌డ‌తామ‌ని హామీ ఇచ్చారు. అందుకే మాదిగ‌లు ఎన్డీఏ కూట‌మికి మ‌ద్ద‌తు ఇచ్చారు. ఇవేమీ ప‌ట్టించుకోకుండా మెజార్టీ మాల‌లు కూడా ఎన్డీఏ కూట‌మికి మ‌ద్ద‌తుగా నిలిచారు.

తాజా తీర్పుతో మాల‌లు ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఉప వ‌ర్గీక‌ర‌ణ‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాల‌లు స్వాగ‌తించే ప‌రిస్థితి వుండ‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు.

14 Replies to “ఎస్సీ, ఎస్టీ వ‌ర్గీక‌ర‌ణ‌పై సుప్రీం సంచ‌లన తీర్పు!”

  1. చీలిక పేలికల ప్రజాస్వామ్య ప్రదర్శన రాజ్యాంగ బద్ధంగా సూపర్ అంతే!

  2. ఇక్కడ ఈ పార్టినా, ఆ పార్టినా కాదు. అసలు SC, ST వ‌ర్గీక‌ర‌ణ‌ చెయటం లొ తప్పెముంది? ఇప్పటికె BC లలొ A, B, C, D లుగా ఉన్నయి.

    .

    అసలు రెజర్వెషన్లు ఉన్నయి అంటె, అది అణగారిన వర్గలకి న్యాయం చెయటం అనె ప్రతిపతిక మీదనె ఉన్నాయి. ఇందులొ కొన్ని ఉపకులాలు… అయ్య! ఆ రెజర్వెషన్లు దశాబ్దాలుగా మా దాకా సరిగ్గా రావటం లెదు, మాలొ అబిరుద్ది చెందిన పలానా ఉపకులం వారెకె వెల్తున్నయి. కనుక ఉన్న రెజర్వెషన్ లలొ, మా నిష్పత్తిలొ మాకు వెరుగా పంచ్చండి….. అంటె అందులొ తప్పెముంది?

    .

    అన్ని పార్టీలు సామాజిక న్యాయం అనె కదా చెపుతుంది. ఇక వెనుకబాటుతనం చూపిస్తూ, రెజర్వెషన్లు అడుగుతున్న వారు, తమలొనె అణగరిన వర్గం వారికి న్యాయంగా దక్కవలసిన రెజర్వెషన్లు లకి అడ్డు చెపితె ఏలా?

    1. మరి అయితె జనాలని విడకొట్టి.. ఈ రెజర్వెషన్లు ఎందుకు? రెజర్వెషన్లు తీసెసి అందరినీ కలిపె ఉంచ్చవచ్చుగా?

      .

      ఎంతొ చదివినా, మెరిట్ ఉన్నా.. OC విద్యర్దులు రెజర్వెషన్ల వల్ల నష్టపొతున్నారు. అయినా ఎదొ అణగారిన వర్గాలకి న్యాయం అన్న దానితొ సరిపెట్టుకుంటున్నరు. మరి ఎంతొ మందిని మెరిట్ లొ తప్పించి ఇస్తున్న రెజర్వెషన్లని సరిగ్గా, న్యాయంగా అన్ని వర్గాలకి దక్కెలా చూడాలా వద్దా???

  3. kevalam ఈ రిజర్వేషన్స్ కేటాయించిన కులాలలోని పేదలకు మాత్రమే చెందాలి కానీ ఆయా కులాలకు కేటాయించిన అవకాశాలు ఆయా కులాలలోని పెద్దలు మాత్రమే పొందుతున్నారు తండ్రి కానీ తాత కానీ రిజర్వేషన్ పొందితే ఆ కుటుంబాలకు ఇవ్వకుండా కొత్త వారికీ మాత్రమే ఇవ్వాలి అవకాశం అందరు పేదలకు ఇవ్వాలి రావాలి కూడా

      1. creamy layer has become a joke with up to 15 lacs limit. That has to be fixed up to 2 to 4 times of daily wage labourer. There is no creamy layer in SC/ST reservations I believe.

  4. Good decision. States know much better about ground reality than Centre. Also, anything new by Centre takes forever.

    For those naysayers, I have attended a seminar in 2004 at which the top brass of SC/ST community (AIS officers, professors, leaders) has made it a point and repeatedly urged their communities that “those who have benefited maximum from reservations should strongly consider vacating the same (i.e. not use them anymore) for the benefit of the then still extremely underprivileged people of the same community. I don’t see anything wrong with that. Reservations should be for the benefit of those socially and economically underprivileged people, just not on “kulam”

  5. జగన్ గాడు ఏది వద్దంటాడో అదే జరిగి తీరుతుంది.‌ అదీ వాడికున్న శాపం.

    ఎస్సీ వర్గీకరణ

    3 రాజధానులు

    శాసనమండలి రద్దు

    బా బా య్ మ ర్డ ర్ కే సు సిబిఐ కి వద్దు

    CPS రద్దు చేయొచ్చు

    మద్యం ధరలు పెంచితే, తక్కువ తాగుతారు

    పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు రద్దు

    ఉచిత ఇసుక వద్దు

    పట్టిసీమ వేస్ట్

    సినిమా టిక్కెట్లు పెంచాలి

    నూటా డెబ్బై ఐదుకి / నూటా డెబ్బై ఐదు

Comments are closed.