ఏపీలో మరో నాలుగు నెలలలో ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు ఆ దిశగా అడులుగు వేస్తూ తమ పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ముందుకు సాగుతూంటే సామాజిక సంఘాలు ప్రజా సంఘాలు ఇదే అదనుగా తమ డిమాండ్లకు పదును పెడుతున్నారు.
ఏపీలో జనాభా పరంగా చూస్తే బీసీలు ఎక్కువ. నూటికి అరవై శాతం పైగా వారే ఉంటాయని ఒక అంచనా అంటే. వారిదే అధికారంలో వాటా కావాలి. కానీ బీసీలు అంటే ఒక కులం కాదు వారిలో ఎన్నో కులాలు ఉన్నాయి. ఆ ఐక్యత కోసం సంఘాలను ఏర్పాటు చేసుకుని చైతన్యం తీసుకుని వస్తున్నాయి. అయితే ఎన్నికల నాటికి కులాలే విడిపోయి తమకు నచ్చిన పార్టీకి మద్దతు ఇస్తూ రావడం అంతా చూస్తున్న ముచ్చట.
ఇదిలా ఉంటే బీసీల ఓట్లు గంపగుత్తగా ఎపుడూ పడవు. కానీ బీసీలు తలచుకుంటే మెజారిటీ ఓట్లు మాత్రం ఏదో ఒక పార్టీకి వేయడం జరుగుతోంది. అలా బీసీలు ఈసారి తమ ఓట్లు తమకు మద్దతుగా నిలిచిన పార్టీకే వేస్తామని చెబుతున్నారు. బీసీలను గుర్తించే పార్టీలకే తమ ఓట్లు పడతాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంగళరావు ప్రకటించారు.
దేశానికి స్వాతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు పై దాటింది కానీ బీసీల జీవితాలలో మార్పు లేదని వెంగళరావు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే బీసీలను ఓట్లుగా వాడుకుంటున్నారని ఆ తరువాత పక్కన పెట్టేస్తున్నారని ఆరోపించారు.
తమను నిర్లక్ష్యం చేసే పార్టీలను దూరం పెడతామని గుర్తించే పార్టీలకే మద్దతు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. మరి ఆయన దృష్టిలో బీసీలను గుర్తించి గౌరవించే పార్టీ ఏపీలో ఏది అన్నది ఆలోచించాల్సిన విషయమే. ఎన్నికల వేళ తమ మద్దతు ఆ పార్టీకి ప్రకటిస్తారని బీసీ నేతలు అంటున్నారు ఏపీలో ఈసారి బీసీ ఓట్ల కోసం ప్రధన పార్టీలు పోటీకి దిగుతునాయి. ఎవరికి బీసీలు అండగా ఉంటారో అన్నది చిక్కు ప్రశ్నగానే ఉంటుంది.