తిరుమలలోని పాపవినాశనంలో అటవీశాఖ ఆధ్వర్యంలో బోటింగ్ ట్రయల్ రన్ చేపట్టడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ముఖ్యంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలను టూరిజం చేయాలనే ప్రచారంపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆ తప్పు నుంచి తప్పించుకునేందుకు మరో పెద్ద తప్పు చేయడం గమనార్హం. ముఖ్యంగా తిరుపతి జిల్లా అటవీశాఖ అధికారి వివేక్ ప్రకటనపై భక్తులు, అలాగే విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం నుంచి సమాధానం కరువైంది.
ముఖ్యంగా సనాతన ధర్మ పరిరక్షణకే తాను ఉన్నానని చెప్పే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నేతృత్వం వహిస్తున్న అటవీశాఖ తిరుమల విషయంలో అడ్డగోలుగా వ్యవహరించడంపై భక్తులు మండిపడుతున్నారు. పాపవినాశనం డ్యాంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్టు సమాచారం రావడంతోనే తనిఖీ చేయడానికి పడవలు ఉపయోగించామని జిల్లా అటవీ అధికారి వివేక్ చెప్పారు. దీంతో కూటమి హయాంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయని సాక్ష్యాత్తు జిల్లా అటవీశాఖ అధికారి ప్రకటన చేశారని, ఏడుకొండలపై అసలేం జరుగుతున్నదో చెప్పాలనే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి.
జిల్లా అటవీశాఖ అధికారి తిరుమలలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయనే ప్రకటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియో విడుదల చేశారు. భూమన ఏమన్నారంటే….ఆ ప్రాంతం పూర్తిగా అటవీ ప్రాంతమన్నారు. టీటీడీకి ప్రత్యేకంగా అటవీ అధికారులు వుంటారని ఆయన అన్నారు. బోటింగ్‌పై జిల్లా అటవీశాఖ అధికారి స్థాయి వివరణ ఇవ్వడం సరైంది కాదన్నారు. టీటీడీ ఈవో శ్యామలారావు, ఏఈవో వెంకయ్య చౌదరి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అయితే కూటమి పాలనలో తిరుమలలో ఏ రకంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయో… వివేక్ అనే అధికారి వివరణతో బయట పడిందన్నారు. అలాగే పాపవినాశనంలో ఇలా మొట్టమొదటిసారిగా బోటింగ్ జరిగిందన్నారు. చాలా పెద్ద ఎత్తున చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగినప్పుడే బోటింగ్ నిర్వహిస్తారని భూమన తెలిపారు. ఇంత వరకూ తిరుమల చరిత్రలో బోటింగ్ జరగలేదని ఆయన గుర్తు చేశారు.
ట్రయిల్ రన్‌లో పాల్గొన్న అటవీ సిబ్బంది ఎవరు? కూచున్న వాళ్లలో అటవీ సిబ్బంది ఉన్నారా? అలా కనపడడం లేదన్నారు. టూరిజంశాఖ అధికారులు నడిపినట్టు ఫొటోలు చూస్తే అర్థమవుతుందని ఆయన అన్నారు. మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున టూరిజం అభివృద్ధి చేయాలని వుందని ఇటీవల తిరుమల పర్యటనలో సీఎం చంద్రబాబు చెప్పారని భూమన గుర్తు చేశారు. ఆధ్యాత్మికయాత్ర, టూరిజం వేర్వేరు అని ఆయన అన్నారు. బాబు చెప్పిన దాని ప్రకారం టూరిజం చేసేందుకు, అలాగే అటవీ అధికారి వివరణ ఇచ్చినట్టు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగుతుండడం వల్లే బోటింగ్ జరిగిందని అర్థమవుతోందన్నారు.
తిరుమల క్షేత్రంలో సర్వభ్రష్టత్వం అనే దానికి పెద్ద ఉదాహరణగా బోటింగ్ నిర్వహించడమని ఆయన అన్నారు. మీడియాలో రావడంతో పెద్ద సంచలనం కలిగిందన్నారు. దీంతో అర్థం కాక, జిల్లా అటవీ అధికారి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతుండడం వల్లే బోటింగ్ నిర్వహించామని వివరణ ఇచ్చారన్నారు. అది నిజం కాకపోతే, తిరుమలపై నిందలు వేసిన అటవీ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ బోటింగ్ టీటీడీ ఉన్నతాధికారులకు తెలిసి జరిగిందా? లేదా అనేది వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆధ్యాత్మిక క్షేత్రం ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు. ధర్మ పరిరక్షణ కోసం ఉన్నానని చెప్పుకునే పవనానంద స్వామి వివరణ ఇస్తారా? ప్రకటన చేస్తారా? విమర్శిస్తారో ఆయనకే తెలియాలని దెప్పి పొడిచారు. తిరుమలలో కొంత కాలంగా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే పవన్‌కల్యాణ్ ఎందుకు మౌనం పాటిస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. అటవీశాఖ పూర్తిగా పవన్ చేతిలో ఉందన్నారు. అందుకే పవన్ బాధ్యత వహించి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
కర్పూరం .. వెలిగిస్తారు లెండి .. దానికే ఎందుకు ఇంత గోల ..
janalu cbn ki kuda karpuram veligenche time ayindi..just 3 and half years anthe
కికికికికి.. కలలు కను రా
Jagan gaadi kante 0.5 year yekkava istustuv yemiti sangathi ?
ప్రసాదం కల్తీ కన్నా పెద్ద బ్రష్టుత్వమా ఇది??
పవన్ కల్యాణే కాదు ఆది గురు శంకరాచార్యులు వారు వచ్చినా ఆ నీటి లోపలికి వెళ్ళాలి అంటే పడవలె వాడాలి అది పాప వినాశనం అయినా….కుంభ మేళలో బోటులు వాడలేదా…. త్రివేణి సంగమం అపవిత్రం అయిందా పడవలు వాడినందుకు…. భూమన గారు అయితే గాల్లో ఎగురుతారేమో మాకు తెలియదు కానీ….పొగ మంచు చూసి అదిగో పొగ ఉంది కదా, నిప్పు ఖచ్చితంగా ఉంది అని చెప్పడానికి అదే సాక్ష్యం అన్నాడు అంట అలా ఉంది వ్యవహారం… బోట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి…. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏమిటో, వాటి వివరాలు, ఎవరు చేస్తున్నారో ఏమి తెలియదు…. నీటి మీద ప్రయాణం చేసింది అటవీ అధికారులు కాదు అనే సాక్ష్యాలు ఉన్నాయా…. టూరిజం సిబ్బంది ఉన్నట్లు సాక్ష్యాలు ఉన్నాయా….